Telugu speech on save river
Answers
Answer:
ఒక్కో చుక్కా ఒడిసి పడితేనే.. భవితకు నీటి భరోసా
TNN | Updated: 23 Mar 2017, 12:27 PM
ఈ విశ్వంలో సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారం. నీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదం వెల్లివిరుస్తుంది.
samayam-telugu
ఈ విశ్వంలో సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారం. నీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదం వెల్లివిరుస్తుంది. పల్లెకైనా, నగరానికైనా నీటి వనరులు ఎంతో అవసరం. అభివృద్ధి విస్తరణకు కూడా నీరే ప్రధానం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి అవసరం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా జనాభా అనూహ్యంగా అధికమవుతోంది. రానున్న కాలంలో నీటి డిమాండ్ భారీగా ఉండే సూచనలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరో వైపు భూమిపై ఉన్న నీటి వనరుల్లో సుమారు 97 శాతం సముద్రాల్లోనే ఉంది. అంటే మనకు పనికొచ్చే నీరు కేవలం 3 శాతమే. ఈ నేపథ్యంలో జల వనరులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. ఈ రోజు (మార్చి 22) ‘ప్రపంచ జల దినోత్సవం’ సందర్భంగా నీటి సంరక్షణ కోసం ప్రతిన పూనాల్సిన తరుణమిదే..
మనకు తెలిసీ తెలియకుండానే నీటిని వృథా చేస్తుంటాం. షేవింగ్ చేసుకునేటప్పుడు, పాత్రలను శుభ్రం చేసేటప్పుడు చాలా మంది ట్యాప్‌ను అలాగే వదిలేస్తుంటారు. ట్యాప్ నుంచి ఒక్కో సెకన్‌కు లీకయ్యే నీటి చుక్క.. రోజుకు 3.5 లీటర్ల నీటికి సమానం. అందువల్ల ఉపయోగించిన వెంటనే ట్యాప్‌లను జాగ్రత్తగా ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి. మీ పిల్లలకూ ఇలాంటి అలవాట్లను నేర్పించాలి. వేసవి రాగానే తాగు నీరు లభించక పశుపక్ష్యాదులు మృత్యువాత పడే ఉదంతాలను అనేకం చూసే ఉంటారు. నీటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోకపోతే రేపు మన పిల్లలు కూడా ఇలాంటి స్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది.