telugu talli importants in telugu
Answers
Answer:
సాహిత్యపరంగా తెలుగుతల్లి అంటే తెలుగు ప్రజల అమ్మగా చిత్రీకరించబడిన, ప్రజామోదం పొందిన చిహ్నం. తెలుగుతల్లి చాలా అందంగా చిరునవ్వుతో తెలుగు మహిళలకు అద్దం పట్టేలా ఉంటుంది. తెలుగు నేల ఎల్లప్పుడు పచ్చదనంతో నిండి తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తెలుగు తల్లి ఆశిస్తున్నట్లుగా తన ఎడమ చేతిలో కోతకొచ్చిన పంట ఉంటుంది. కుడి చేతిలో ఉన్న కలశం తెలుగు ప్రజల జీవితాలు మంచి మనసుతో నిండుగా కలకాలం వర్థిల్లాలని, తెలుగు ప్రజలకు అవసరమైన వాటిని తెస్తున్నట్లుగా సూచిస్తుంది. ఈ దేవత తెలుగు వారి శైలిలో సాంప్రదాయ దుస్తులను ధరించి ఉంటుంది. ఈ తెలుగుతల్లిని ఆరాధించటం ద్వారా మానవాళికి అవసరమైన భాషా నైపుణ్యాలను అందిస్తుందని తెలుగు ప్రజలు భావిస్తారు, అందువలన తెలుగు ప్రజల జీవితాలలో తెలుగు తల్లికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అధికారిక గీతం మా తెలుగు తల్లి. ఈ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి, 1942లో చిత్తూరు వుప్పలదడియం నాగయ్య నటించిన ధీన బంధు అనే తెలుగు చిత్రం కోసం ఈ గీతాన్ని వ్రాసారు. ఈ గీతం అత్యంత ప్రజాదరణ పొందటంతో చివరికి ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక గీతంగా చేశారు.