Ten lines about dusshera in telugu
Answers
Answer:
దసరా అంటే దన్ + హరా అని; అంటే శ్రీరామచంద్రమూర్తి సీతాపహరణ గావించిన రావణాసురుని పదితలలు నరకి సంహరించిన సందర్భంగా జరుపుకునే విజయోత్సవంగా కూడా దీనిని వ్యవహరిస్తూ ఉంటారు.
సరిగా వానిని ఆశ్వీయుజమాసం నవమి తిధినాడు సంహరించినాడు. అందువల్ల దీనిని "దసరా వైభవం"గా దశమినాడు జరుపుతూ ఉంటారు.
ఇక దేవినవరాత్ర పూజలు చేయుట, అనునది అనాదికాలంగా వస్తున్న శాస్త్రవిధి. "అశ్వనీ" నక్షత్రంలో కలసివచ్చిన పూర్జిమమాసమే "ఆశ్వీయుజమాసం" అవుతుంది. ఈ మాసమందు 'దేవీనవరాత్రులు శరన్నవరాత్రులని పిలుసూ శుద్దపాడ్యమి తిథితో ప్రారంభించి తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు వైభవంగా చేసారు.
ప్రథమాశైలపుత్రి, ద్వితీయా బ్రహ్మచారిణీ
తృతీయాచంద్రఘంటీతి, కూష్మాండేతి చతుర్థికీ
పంచమా స్కందమాతేతి షష్ణాకాత్యాయనేతి
చ సప్తమా కాళరాత్రిచ అష్టమాచాతి భైరవీ
నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా,
మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒక్కరే! అలంకారాలు వేరైనా అమ్మ దయ అందిరపట్ల ఒక్కటే! హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో వైభవంగా నిర్వహించే పండుగలలో ఈ "దసరావైభవం" ఒకటి.
ఇది పదిరోజులు పండుగ అయినప్పటికి దేవిని రోజుకో అవతారంగా అలంకరించి అమ్మవార్కి అర్చనలుచేసి, నవవిధ పిండివంటలతో నివేదనలుచేసూ విశేష పూజలతో పాటు శ్రీలలితా సహస్రనామ పారాయణ నిత్యము గావిస్తూ "శరన్నవరాత్రులు" గా వ్యవహరిస్తారు.
శ్రవణానక్షత్రయుక్త దశమి తిథిన విజయదశమితో ఈ దసరావైభవాలు పూర్తిచేస్తారు.
దసరాకు మరోపేరు 'దశహరా" అంటే! పది పాపాలను హరించేది అని అర్థం చెప్తారు దైవజ్ఞలు.