బాసరలో నివసించే నీ మిత్రుడు శ్రీ కి నీవు శ్రీరామ నవమిని ఎలా జరుపుకున్నావో తెలియజేస్తూ ఒక లేక వ్రాయి.
This is Telugu answer if u know
Answers
లేఖా రచన
హైదరాబాద్,
21-04-2021.
ప్రియమైన మిత్రుడు శ్రీ కి,
నీ ప్రియమైన మిత్రురాలు సీత వ్రాయునది ఏమనగా.
ఎలా ఉన్నావు శ్రీ? ఇంట్లో అందరూ క్షేమమేనా? ఆ పరమేశ్వరుని కృప వలన క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను, మా కుటుంబ సభ్యులు అందరమూ కూడా బాగా ఉన్నాము.
ఈరోజు శ్రీ రామ నవమి ని మా పరివారంతో కలిసి నేను అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. మా అమ్మగారు తెల్లవారుజామునే లేచి, మమల్ని కూడా నిద్ర లేపి, త్వరగా మా రోజూవారీ క్రియలను క్రమబద్ధంగా ముగించుకుని, పూజకు కావలసిన సామాగ్రిని మరియు నైవేద్యాలని తయారు చేసాము. ఆ తరువాత, పూజారి తో కలిసి, నవమి నాటి పూజాది కార్యక్రమాలను ఎంతో నియమనిష్టలతో చేసుకున్నాం. ఆ తంతు తదుపరి, దేవునికి నైవేద్యం సమర్పించి, మేము దాన్ని ప్రసాదంగా స్వీకరించాము. నైవేద్యానికి ఏం చేసామో తెలుసా? నేను చెప్తాను, విను. నైవేద్యానికి బెల్లం పానకం, వడపప్పు, మామిడికాయ పులిహోర ఇంకా భక్ష్యాలను తయారు చేసుకున్నాం. అవి ఎంత రుచిగా ఉన్నాయో! ఆ తరువాత, భద్రాచలం రాముల వారి కళ్యాణాన్ని వీక్షించి, పుణీతులమయ్యాము.
శ్రీ రామ నవమి నాడు నీ దినచర్యని తెలుపుతూ ఒక లేఖ రాయి నాకు. నీ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీ అమ్మా మరియు నాన్నకి నా నమస్కారములు!
ధన్యవాదాలు!
ఇట్లు,
నీ ప్రియమైన మిత్రురాలు,
సీత.
చిరునామా :
శ్రీ,
ఇంటి నెం : 5-4-2005,
జుపిటర్ కాలిని,
సుచిత్ర సర్కిల్,
బాసర.