Tiger information in telugu
Answers
Answered by
0
Answer:
పులి (పాంథెరా టైగ్రిస్) ఫెలిడే కుటుంబంలో కెల్లా అతిపెద్ద జాతి. ఇది పాంథెరా ప్రజాతిలో భాగం. ఆరెంజి-బ్రౌన్ చర్మంపై చిక్కటి నిలువు చారలు దీని ప్రత్యేకత. ఈ నిలువుచారలు కిందికి వెళ్ళే కొద్దీ పలచబడతాయి. ఇది, ఆహారపు గొలుసులో శీర్షభాగాన ఉండే వేటాడే జంతువు. ప్రధానంగా జింక, అడవి పంది వంటి ఖురిత జంతువులను (గిట్టలు కల జంతువులు) వేటాడుతుంది. ఇది ఒక ప్రదేశానికి పరిమితమై ఉంటుంది. సాధారణంగా ఒంటరిగా జీవించే వేట జంతువు. దీనికి విశాలమైన, తగినంత ఆహారం లభించే, తన సంతానాన్ని పోషించుకునేందుకు వీలైన ఆవాస ప్రాంతాలు అవసరమవుతాయి. పులి పిల్లలు స్వతంత్రంగా మారడానికి ముందు, రెండేళ్లపాటు తల్లితో కలిసి ఉంటాయి. ఆ తరువాత, విడిపోయి, తల్లి ఇంటి పరిధిని దాటి వెళ్ళి, స్వతంత్రంగా జీవిస్తాయి.
Similar questions