India Languages, asked by foolbird7500, 10 months ago

Today's education system in essay in Telugu

Answers

Answered by simmujosan
0

Explanation:

The current education system is teaching us outdated skills designed for the industrial era, and ignoring modern history; a modern history that will dictate the career paths of current students. Lumping our students together and teaching as if they are an individual has only taught students to conform and not to learn.

Answered by dreamrob
2

ఈ రోజులలో విద్యా వ్యవస్థ:

మన దేశంలో విద్య వ్యాపారం అయిపోయాక ర్యాంకుల కోసం విద్యాసంస్థలు, తల్లిదండ్రులు విద్యార్థుల పై తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్న తెలిసిన విషయమే విద్యార్థులు ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం మనం ఈ రోజుల్లో పేపర్లో టీవీ లో చాలా చూస్తూ ఉన్నాము.

మన భారతదేశంలో విద్యా వ్యవస్థ చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నది. విద్య అంటే కేవలం పుస్తకాల్లో ఉన్నది చదవటం మాత్రమే కాదు విద్య అంటే ఒక విద్యార్థి యొక్క సమగ్ర వ్యక్తిత్వం ఈ రోజుల్లో ఆ విషయాన్ని మర్చిపోయి చాలా మంది విద్యను ప్రైవేటీకరణ చేస్తున్నారు.

విద్యను కూడా డబ్బుతో కొనుక్కోవలసిన పరిస్థితి ఈ రోజు విద్యార్థులకు సంభవించినది ఈ రోజులలో విద్యార్థులు వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అనేది వాళ్ళకే తెలియటం లేదు కేవలం పుస్తకాల్లో ఉన్న దాన్ని చదవటం వ్రాయటం అదే చదువు అని అనుకుంటున్నారు. ఇటువంటి చదువు వారి జీవితాలకి ఏ విధంగానూ ఉపయోగకరం కాదు. అందువలన మన విద్యా వ్యవస్థలో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఎంతో ఉన్నది.

విద్యార్థులకు కేవలం పుస్తకాల్లో ఉన్నది కాకుండా ప్రపంచ జ్ఞానాన్ని కూడా నేర్పించ వలసిన బాధ్యత ఉపాధ్యాయులకు ఎంతైనా ఉన్నది. తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి తేవటం మంచిది కాదు అది వారి భవిష్యత్తు పై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రభుత్వాలు కూడా దీని పై కఠిన చర్యలు తీసుకొని విద్యావ్యవస్థలో తగినన్ని మార్పులు తీసుకొని వస్తే రేపటి విద్యార్థులు జీవితం చాలా బాగుంటుంది.

Similar questions