uniqueness and features of pegion in telugu
Answers
Explanation:
కపోతం (ఆంగ్లం Pigeon) ఒక రకమైన పక్షి. ఇవి కొలంబిఫార్మిస్ క్రమంలోకొలంబిడే కుటుంబానికి చెందినవి. వీటిలో సుమారు 300 జాతులు ఉన్నాయి. వీటిలో పెద్దగా ఉండే జాతులను కపోతాలు అని, చిన్నగా ఉండే జాతులను పావురాలు అని అంటారు [1] పావురం (Dove) 'శాంతి'కి చిహ్నం.
ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి కానీ ముఖ్యంగా ఇండోమలేసియా, ఆస్ట్రేలాసియా ప్రాంతాలలో ఎక్కువ రకాలున్నాయి.
కపోతాలు పొట్టిగా లావుగా ఉండి, చిన్న మెడ, ముక్కు కలిగివుంటాయి. సామాన్యంగా మనం పట్టణాలలో ఇంటి పరిసరాల్లో చూసే కపోతాలను ఫెరల్ కపోతాలు (Feral Pigeon) అంటారు.
కపోతాలు చెట్లు, కొండచరియలు, ఆపార్టుమెంటుల మీద పుల్లలతో గూడు కట్టుకుంటాయి. ఇవి ఒకటి లేదా రెండు గుడ్లు పెడతాయి. పిల్లల్ని ఆడమగ పక్షులు రెండూ సంరక్షిస్తాయి. పిల్లలు 7 నుండి 28 రోజుల తర్వాత గూడు వదిలి ఎగిరిపోతాయి.[2] పావురాలు గింజలు, పండ్లు, చిన్న మొక్కల్ని తింటాయి. చాలామంది కపోతం అనే పేరు బదులు పావురం అనే పదం వాడతారు.