V.సృజనాత్మకత ఆ మీ తిరిగి వచ్చాక మీ స్నేహితులకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాయండి. వేసవి సెలవుల్లో మీరు మీ స్నేహితుల ఇంటికి వెళ్ళారు. ఆ కుటుంబం మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంది.
Answers
Explanation:
స్నేహం అద్భుతమైంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు. అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది. వికాసానికి బాటలు వేస్తుంది. మంచి మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యం ఉంటుంది.జీవితమనే ఉద్యానవనంలో అందమైన పుష్పం స్నేహం'. హృదయపు తలుపును ఒక్కసారి తడితే.. అందులోని మాధుర్యమంతా ప్రతి హృదిలో గుబాళిస్తుంది. ప్రతిఫలాన్ని ఆశించని ఆ బంధం మొగ్గలా ప్రారంభమై.. మహావృక్షంగా ఎదిగి జీవితాంతం తోడునిస్తుంది... ఇద్దరు వ్యక్తులకు, ఇరువురి మనసులకు సంబంధించిన ఈ 'స్నేహం' తరతరాలకు తీపిని పంచుతోంది.. కాలాలకతీతంగా మైత్రి మధురిమను పెంచుతోంది...కన్నవారితో, కట్టుకున్నవారితో, తోడబుట్టిన వారితో చెప్పుకోలేని విషయాలను మిత్రులతో చెప్పుకోవడం మిత్రత్వం గొప్పదనం. కష్టసుఖాల్లో అండగా ఉండేవారు.. నిస్వార్థంగా సాయం అందించేవారు నిజమైన మిత్రులు
Answer:
సృజనాత్మకత
* వేసవి సెలవుల్లో మీరు మీ స్నేహితుడి ఇంటికి వెళ్ళారు. ఆ కుటుంబం మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంది. ఇంటికి తిరిగి వచ్చాక మీ స్నేహితులకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాయండి.
జవాబు:
విజయవాడ,
x x x x x x x
ప్రియమైన మిత్రుడు అఖిల్ కు,
నీ స్నేహితుడు వ్రాయు ఉత్తరం. ఇక్కడ నేను క్షేమం. అక్కడ నీవు కూడా అలాగే ఉంటావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా ఉత్తరం వ్రాయుట ఏమనగా నేను ఇటీవల వేసవి సెలవులలో మీ ఇంటికి వచ్చాను కదా ! అప్పుడు మీ కుటుంబంలోని వారందరూ నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. నన్ను మీలో ఒకరిగా చూశారు. ముఖ్యంగా మీ అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు నన్ను ఆదరించిన విధానం నాకు చాలా నచ్చింది. నన్ను దిగుడు బావి దగ్గరకు తీసుకువెళ్ళి మీ మామయ్య చక్కగా 15 రోజులు ఈత నేర్పించారు. అలాగే మీ మామయ్య వాళ్ళ పిల్లలు, మనం కలిసి క్రికెట్, కబడ్డీ మొదలగు ఆటలు చక్కగా ఆడుకున్నాము. వారందరికీ నా కృతజ్ఞతలు తెలియచేయవలసినదిగా కోరుకుంటున్నాను. ఈసారి వేసవి సెలవులకు నీవు మా ఊరికి తప్పక రావాలి.
ఇట్లు,
మీ మిత్రుడు,
అఖిలేశ్వర్.
చిరునామా :
బి. అఖిల్,
S/0 బి. రంగనాథం,
7-8-63, 8/4,
నైనవరం, పశ్చిమగోదావరి జిల్లా.
(లేదా)
* తాతయ్య, నాన్నమ్మ, అమ్మానాన్నలు, పిల్లలూ అంతా కలిసి ఉంటేనే కుటుంబం అంటారు. కాని నేటికాలంలో ఎంతోమంది వృద్ధులను, వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు. ఇది సరికాదని ప్రజలందరికీ తెలియజేయడానికి కరపత్రం తయారుచేయండి.
(లేదా)
వృద్ధులను వృద్ధాశ్రమాల్లో చేర్చడం మంచిది కాదని తెలియజేస్తూ ప్రజలందరికీ తెలియజేయడానికి “కరపత్రం” తయారు చేయండి.
జవాబు:
కన్నవారిని కళ్ళల్లో పెట్టి చూసుకుందాం
సోదరసోదరీమణులారా! ఒక చిన్న విన్నపం. మనం ఇలా పెరిగి పెద్దవారమై, విద్యాబుద్ధులు నేర్చుకొని, ఉద్యోగాలు చేస్తూ, ఆస్తిపాస్తులు సంపాదించుకొని, సుఖంగా ఉండడానికి వెనుక కారణం ఎవరో, ఒకసారి ఆలోచించండి. గట్టిగా ఆలోచిస్తే, మనలను చేతులు పట్టుకు నడిపించి, బడిలో చేర్పించి, చదువులు చెప్పించి, గోరుముద్దలు తినిపించి, అవసరానికి ఆదుకొని, మనకోసం వారి సుఖ సంతోషాలన్నీ త్యాగం చేసిన, మన తల్లిదండ్రులే అని, మీకు గుర్తు వస్తుంది.
ఈ మధ్య చాలామంది తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు. అక్కడ తిండి పెడతారు. వినోదాలు కూడా ఉండవచ్చు. కానీ అక్కడ తమ పిల్లలతో మనవలతో, కోడళ్ళతో తిరిగిన సుఖ సంతోషాలు, మమతానురాగాలు మన తల్లిదండ్రులకు దొరకవు. తమ పిల్లలు తమను పట్టించుకోవడంలేదనే బెంగతో, వారు క్రుంగిపోతారు.
మీ పిల్లలకు మంచి పురాణ కథలు చెప్పి ఆదరంగా చేరదీసే తాతామామ్మలు వారికి దొరకరు. కనుక మిమ్మల్ని కనిపెంచిన తల్లిదండ్రుల్ని ఆదరించండి. మీ ఇంట్లోనే వీరిని ఉంచుకోండి. నిరాదరణకు గురిచేసి, వృద్ధాశ్రమాలకు పంపకండి. మరువకండి. లేదా మీకు మీ పెద్దల గతే, అని గుర్తుంచుకోండి.
ఇట్లు,
జె.ఎమ్.ఎస్.యువజన చైతన్య సమితి.
hope it helps you if not then sorryyyyyyyyy