History, asked by tejassuteja23, 2 months ago

.
vaల్మొకి రామాయణ రచనకు శ్రీకారం చట్టిన విధానం
తెల్పంది. ​

Answers

Answered by SAIMINISHA
0

Valmiki Started Writing Ramayana..When Lord Brahma Ordered him...He Wrote it with the help of instructions Given by Naradha..(Saint)

Answered by tejeswarteju
0

సమస్త శాస్త్రాలను తెలిసిన వాల్మీకి మహర్షి..

నారదుడు ఉపదేశించిన రామకథలో వేదాంత అర్ధాలని గ్రహించి పరవశించిపోయాడు. వాల్మీకికి బ్రహ్మ తత్వాన్ని ఉపదేశించి, గురుపూజలు అందుకుని నారదుడు దేవలోకానికి వెళ్లిపోయాడు. అనంతరం వాల్మీకి మహర్షి భరద్వాజాది శిష్యులతో కలిసి తమసా నదీ తీరానికి వెళ్లాడు. నిర్మలమైన నీటి గురించి వర్ణిస్తూ.. శిష్యా భరద్వాజా! సత్పురుషుల హృదయంలా ఈ నదీ జలాలు నిర్మల మనోహరంగా ఉన్నాయి చూడు అన్నాడు. చుట్టూ ఉన్న ప్ర‌కృతి రమణీయతకు పులకించిపోయిన వాల్మీకి.. సమీపాన ఎడబాటు లేకుండా కలిసి ఎగురుతూ ఉన్న రెండు పక్షులని చూశాడు. ఇదే సమయంలో ఓ బోయవాడు మగ పక్షిని తన బాణంతో కూల్చాడు. శరం తగిలిన ఆ మగ పక్షి గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచింది. దీంతో ఆడపక్షి వియోగంతో అతి దీనంగా ఏడవసాగింది .

దీనంగా విలపిస్తున్న ఆడ పక్షిని చూసిన వాల్మీకి ‘మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమశ్శాశ్వతీస్సమా.. యత్క్రౌఞ్చ మిథునాదేకమవధీ కామమోహితమ్’ అనే శ్లోకాన్ని ఉచ్చరించాడు.‘రతి కాలంలో చంపడం ధర్మం కాదు అని తలచి, బోయవాడితో నిర్భాగ్యుడైన బోయవాడా! రతి కాలంలో ఉన్న క్రౌంచ పక్షులలో ఒకదానికి నీ బాణంతో నేలకూల్చావు.. నీవు కూడా చాలాకాలం జీవిస్తావని అని దీని అర్థం. శిష్యుడు భరద్వాజుడు వెంటనే గురువు మనోభావాన్ని గ్రహించి ఆ శ్లోకాన్ని అక్కడికక్కడే కంఠస్థం చేసి, ఆశ్రమానికి వెళ్లి తోటి శిష్యుల చేత మననం చేయించాడు. శిష్యులందరూ ఆ శ్లోకాన్నే లయబద్దంగా ఆలపిస్తుంటే వాల్మీకి మహర్షి మహదానందం పొందాడు.

ఆ సమయంలో బ్రహ్మ ప్రత్యక్షం కావడంతో వాల్మీకి ఆశ్చర్య పోయాడు. బ్రహ్మకి సాష్టాంగ నమస్కారం చేసి, అర్ఘ్యపాద్యాది ఉపచారాలు చేసి, ఆయన పక్కనే నిలబడ్డాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వాల్మీకిని తన పక్కనే కుర్చోబెట్టుకున్నాడు. ఇలా కూర్చున్నాడే కానీ మనసంతా పక్షి, తాను ఉచ్చరించిన శ్లోకంపైనే లగ్నమైంది.

వాల్మీకి అంతరంగాన్ని గ్రహించిన బ్రహ్మ... ఓ మహర్షి! నీవు పలికింది శ్లోకమే అందులో సందేహం లేదు.. నా అనుమతి పొందిన తరువాత సరస్వతి నీ నాలుకపై కొలువుదీరి దానిని పలికించింది . ఋషి కానీ వాడు కావ్యం రాయలేడు కాబట్టి, ఈ కావ్య రచనకు శ్రేష్టుడివి.. నీతో రచింపబడే ఈ కావ్యం కావ్యాలన్నిట్లోనూ శ్రేష్ఠం అవుతుంది. నీవు రచించిన రామాయణ కావ్యం ఆచంద్రార్కం ముల్లోకాల్లోనూ వ్యాప్తి చెందుతుంది.

రాముడు ధర్మ స్వరూపుడు లోకంలో ప్రశస్తమైన గుణాలు అతడిలో ఉన్నాయి. నీవు నారదుని ద్వారా విన్నది అంతా యథాతధంగా చెప్పు... రామలక్ష్మణులు, సీతాదేవి కథ, భారతాదుల చరిత, రాక్షసుల చరిత్ర ఇత్యాదులన్నీ రహస్యమే అయినా ఇది వరకు తెలియని విషయాలు కూడా నీకు స్పష్టమవుతాయి. ఈ కావ్యంలో నీవు చెప్పబోయే ఏ ఒక్క వాక్యం అసత్యం కాదు . రామకథ విన్నవారికి, చదివిన వారికీ కూడా పుణ్యం లభిస్తుంది. రామకథని శ్లోకబద్దం చెయ్యి అని బ్రహ్మ దేవుడు చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. వాల్మీకితోపాటు శిష్యులు ఆ శ్లోకాన్ని మళ్లీ మళ్లీ గానం చేయసాగారు. అప్పుడు వాల్మీకి ‘ఈ రామాయణ కావ్యం అంతటిని ఈ శ్లోక వృత్తంలో రచిస్తాను’ అని భావించాడు.

Similar questions