VIII. కింది అంశాల్లో ఒక దానిని గురించి పన్నెండు పంక్తుల్లో రాయండి.
14) అ) దూరదర్శన్
ఆ) మాతృభాషలో విద్యాబోధన.
Answers
Answer:
తెలుగు చదవడంలో రెండు ముఖ్య అంశాలున్నాయి. (1) తెలుగును ఒక భాషగా చదవడం (2) శాస్త్ర విజ్ఞానానది విషయాలను తెలుగులో చదవడం.
1964-66 నాటి కొఠారి కమిషన్ మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని సూచించింది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1969లో ఇంటర్మీడియట్ స్థాయిలో బోధనాభాషగా తెలుగును ప్రవేశపెట్టింది. 1971నుండి డిగ్రీ స్థాయిలో తెలుగు బోధనాభాష అయ్యింది. పాఠశాలల్లో మాతృభాష ద్వారా విద్యాబోధన జరపడానికి క్రింది అంశాలను ప్రాతిపదికగా గ్రహించాలని తెలుగు అకాడమి ప్రచురించిన "తెలుగు - బోధన పద్ధతులు" గ్రంథంలో పేర్కొన్నారు. అవి
జ్ఞానార్జనకు మాతృభాష చక్కని పునాదిగా నిలిస్తుంది.
విద్యార్థులు తమ మనోభావాలను వెల్లడంచడానికి మాతృభాష తోడ్పడినంతగా మరే ఇతర భాషా అనుకూలం కాదు.
మాతృభాషాభిమానం దేశాభిమానానికి ప్రథమ సోపానం.
విషయ గ్రహణ చేసేందుకు పరభాష కంటే మాతృభాష సరైనది.
వ్యక్తి వికాసానికి, కళాపోషణకు, సాహిత్యాభిరుచి, సృజనాత్మకత, వివేచనాశక్తి మొదలైన సామర్ధ్యాలు పెంపొందడానికి మాతృభాష తోడ్పడుతుంది.
please mark me as a brianliest and follow me