India Languages, asked by anmolprtp7468, 10 months ago

Vruthyanuprasa alamkaram examples

Answers

Answered by Naisha28
42
ఉదా:
కాకీక కాకికి కాక కేకికా?
కం: అడిగెదనని కడువడిఁజని
యడిగినఁదన మగడు నుడువడని నెడ యుడుగన్
వెడవెడ సిడిముడి తడబడ
నడుగిడి నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్!
ఘల్లు ఘల్లు ఘల్లుమంటూ మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు
నల్లమబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు
ఎల్లలన్నవే ఎరుగని వేగంతో వెళ్ళు
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్కా,
ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవె చప్పున చక్కగ,
టక్కున టక్కరి పిట్టా, నిన్ను పట్టేదెట్టా? ఎట్టా?


Hope it helps...
Please mark my answer as the brainliest...
Answered by poonammishra148218
0

Answer:

ఒక హల్లు అనేక పర్యాయములు వచ్చునట్లు చెప్పబడినది. ఈ హల్లు ఒకే అచ్చుతో గాని లేదా వివిధ అచ్చులతో కలసినవి అయినా ఉండవచ్చును.

Explanation:

Step 1 : "చొక్క పుటుక్కు క్రిక్కిరిసి స్రుక్కక పెక్కువ నక్క జంబుగన్." ఇందులో 'క్క' అనే హల్లు అనేకసార్లు తిరిగి వచ్చినది.

Step 2 : "ఇందువదన కుందరదన మందగమన సొగసులలనవే" అను సినిమా పాటలోని పల్లవి. ఇందులో బిందుపూర్వక దకారం 'ంద' అనేక సార్లు తిరిగి తిరిగి రావడం జరిగింది.

Step 3 : "కామాక్షీ! నీ కుక్షికి శిక్షగా కక్షతో అన్నం అక్షయ రక్షగా ప్రత్యక్షం నీ అక్షికి కనబడేలా చేయించనా ?" ఇందులో 'క్ష' అనే హల్లు అనేక సార్లు తిరిగి తిరిగి వచ్చింది.

Step 4 : "అడుగులు తడబడ బుడతడు వడివడి నడిచెను?" ఇందులో డ అనే హల్లు అనేక సార్లు తిరిగి తిరిగి వచ్చింది.

Step 5 : "ఆ జెర్రి మర్రి తొర్రలో బిర్రబిగిసి పరుండి యున్నది?" ఇందులో ర అనే హల్లు అనేక సార్లు తిరిగి తిరిగి వచ్చింది. "అమ్మల గన్నయమ్మ ముగురమ్మలగన్న మూలపుటమ్మ" మ్మ అని ప్రాసలో నాలుగు సార్లే కాకుండా మరొక ఆరు సార్లు మ్మ కారం ప్రయోగించబడింది.

"నిష్టల పోష్టు మాష్టారు గారి కనిష్ట పుత్రుడు అష్టకష్టాలు పడి హిష్టరీలో ఫష్టు మార్కులు తెచ్చు కొనెను" ఇందులో 'ష్ట' అనే హల్లు పలుమార్లు వచ్చింది.

Learn more about similar questions visit:

https://brainly.in/question/15687467?referrer=searchResults

https://brainly.in/question/8238476?referrer=searchResults

#SPJ3

Similar questions