India Languages, asked by BrainlyGood, 1 year ago

vyaakaranam valla upayogam emiti ? udaharanalu eeyandi.

Answers

Answered by kvnmurty
1
వ్యాకరణం  ఏ  భాష కైనా  చాలా  అవసరం.   వ్యాకరణం  అనేది  ఒక  భాష లో  మాట్లాడేటప్పుడు  గాని  రాసేటప్పుడు గాని  పాటించవలసిన నిబంధనలు  చెపుతుంది.    మనం  వ్యాకరణం   సరిగా  పాటించకపోతే   మనం ఏం మాట్లాడుతున్నామో  ఎదుటి వాళ్లకు ఎలా అర్ధం అవుతుంది?   మనం రాసింది మనకు కూడా సరిగా అర్ధం కాదు.   


పెద్దవాళ్ళు   చక చకా  భాష లో  మాట్లాడేస్తూ ఉంటారు.   పిల్లలు   మాట్లాడడానికి  కొంచెం  తడబడుతుంటారు.   మంచి   భాషా జ్ఞానం  మరియు  వ్యాకరణం  బాగుగా వస్తే   పిల్లలు కుడా   చక్కగా   గల గలా   మాట్లాడేస్తారు.    ఎదుటి వాళ్లకు కూడా   వినడానికి  బాగుంటుంది.    

వ్యాకరణం  సరిగా   లేకపోతే   విన్నవాళ్ళకు   , రాసింది   చదివిన వాళ్లకు    వేరే  విధంగా  అర్ధం   అవుతుంది.   

ముఖ్యం గా   భూత కాలం ,  భవిష్యత్  కాలం  వాడినపుడు   వ్యాకరణం లో   చాల మంది  తప్పులు  చేస్తారు.  

నేను  ఎల్లుండి  మార్కెట్ కెల్లాను, తరవాత  ఇక్కడే నా పనులు చేసుకుంటూ ఉన్నాను.     ఈ వాక్యం లో  "ఎల్లుండి "  భవిష్యత్ కాలం. " ఉన్నాను " అనేది భూత కాలం.   ఎల్లుండి గురించి మాట్లాడు తున్నడా   లేక  నిన్నటి గురించ   మాట్లాడుతున్నాడా   అన్నది   తెలియదు.     నేను  ఎల్లుండి  మార్కెట్ కెల్లాను, తరవాత  ఇక్కడే నా పనులు చేసుకుంటూ ఉంటాను.    ఈ వాక్యం   సరియైనది.   

అతడు ఒక అమ్మాయి చూసాడు.     ఇక్కడ  అమ్మాయి తరువాత   " ని "  లేకపోతే అర్ధం సరిగా కుదరదు.  అతడు ఒక అమ్మాయి ని చూసాడు. రాధ రుక్మిణి చూసింది.      ఈ వాక్యం లో  ఎవరు ఎవరిని చూసారో  తెలియదు.   రాధ ను  రుక్మిణి చూసింది.   లేదా  రాధ రుక్మిణి ని చూసింది.  ఇది సరియైనది.     మళ్ళా, " రాధ రుక్మిణి ను చూసింది "  అనేది   సరిగా ఉండదు. 


Similar questions