English, asked by sksha5mu4skanbalja, 1 year ago

Want a essay on role of women in india's freedom struggle in telugu

Answers

Answered by kvnmurty
7
    మన భారత దేశ స్వతంత్ర పోరాటంలో ఆడవారి పాత్ర  చాలా ప్రాముఖ్యమైనది.  ముఖ్యంగా 19వ మరియు ఇరవైవ శతాబ్దంలో వారు ఇంటినించి బయటికి వచ్చి ఉద్యమాలు నడపడం వాటిల్లో పాల్గొవడం అంటే అది సామాన్యం కాదు.

   1857 గ్రేట్ సైనికుల విప్లవం (మ్యూటిని) కంటే ముందుగానే కొంత మంది తమ పరాక్రమాన్ని లోకవిదితం చేశారు.  భీమా బాయి హోల్కర్ రాణి కొలోనెల్ మాల్కం సైన్యం  పైన గెరిల్లా దాడి చేసి మెరుపు దెబ్బ తీసి వాళ్ళని ఓడించింది.   రాణి చన్నమ, రాణి హజ్రత్ మహల్ కూడా వారి వారి పరాక్రమాలు దేశభక్తి కదన రంగంలో చూపించి వీరనారీ మణులు గా కీర్తినొందారు.  ఇదే విధం గా బ్రిటిష్ వారి పై పోరాడిన వారు రాజ వంశాలకు చెందిన రాణి జిందన్ కౌర్ , రాణి తాసీ  బాయి , రాణి చౌహాన్.  తపస్వినీ మహారాణి,  బైజా బాయి రాణి 1857 లో రేగిన విప్లవం లో  తమ తమ సైన్యాలను యుధ్ధ రంగంలోకి ధాటి అయిన కత్తి ధరించి ధైర్యంగా నడిపించారు.  ఝాన్సి రాణి లక్ష్మీబాయి సంగతి అయితే అందరికీ తెలిసినదే.  

   ఇలా పోరాడిన వారిని బ్రిటిష్ వారు మోసం తోను అతి పెద్ద సైన్యం తోను ఫిరంగులతోనూ చుట్టుముట్టి ఒక్కొక్కొరిని ఓడించి చంపేశారు.  మన దేశం లో అప్పుడే ఐకమత్యం ఉంది ఉంటే ఓడిపోయే పరిస్తితి వచ్చేదే కాదు.   ఇక ఇరవైవ శతాబ్దం వచ్చే సరికి విజ్ఞ్యానవంతులైన, ధైర్యవంతులైన మహిళామణులు తమ తమ రాజకీయ జ్ఞ్యానమ్ తో, సాంఘిక చైతన్యం ప్రజలలో తెచ్చి బ్రిటిష్ వారికి అనేక మార్లు తలనెప్పి తగ్గించారు.
      మన తెలుగు తేజం సరోజినీ నాయుడు ఒక గొప్ప రచయిత, కవయిత్రి, ఉపన్యాసకర్త.  ఆమె అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు.  ముఖ్యం గా “సహాయనిరాకరణ ఉద్యమాన్ని నాయకురాలి గా నడిపించి సఫలీకృతం చేశారు.  కలకత్తా లో మేడమ్ కోమా (ఐరిష్ దేశస్థురాలు) ఉద్యమకారులకు, విప్లవకారులకు ఆహారం, ఆయుధాలు, మందులు తదితరమైన సామాన్లు అందించి తమ మంచితనాన్ని చాటారు.  బేగమ్ హజ్రత్ మహల్ (అవధ్ రాణి) లక్నో నగరాన్ని చుట్టుముట్టి బ్రిటిష్ సైన్యాన్ని ఓడించారు.  

    ఇక దేశంలోని సామాన్య ప్రజలు, శ్రామికులు, పల్లె ప్రజలు అమాయకులు.  వారిలో సామాజిక స్పృహ తేవడానికి అన్నీ బీసెంట్ న్యూ ఇండియా అనే వార్తా పత్రిక ని ప్రారంభించింది.  స్వరాజ్యంకోసం పిలుపునిస్తూ “ఇండియన్ హోమ్ రూల్ లీగ్” అనే సంస్థను స్థాపించింది.  గ్రాండ్ ఓల్డ్ లేడి ఒఫ్ ఇండిపెండెన్స్ అనబడే అరుణా ఆశ్రఫ్ అలీ నిరాహారదీక్షల ను నిర్వహించారు.  ఇంఖిలాబ్ అనే వార్తాపత్రిక ను కూడా మొదలుపెట్టారు.  అనేక సత్యాగ్రహలలో నాయకత్వం  వహించారు. 

   సైమన్ కమిషన్ భారత దేశం వచ్చినపుడు ఉషా మెహతా తన చిన్నప్పుడే బాలుర నాయకురాలిగా నిలబడి సైమన్ గో బాక్ అన్న నినాదాలు చేశారు.  అఖిలా భారతీయ (నేషనల్) కాంగ్రెస్ వారి కోసం రహస్య దూరవాణి (వైర్ లెస్ రేడియో) నడిపారు.  కాంగ్రెస్ నిర్వహించిన  క్విట్ ఇండియా  ఉద్యమంలో  బ్రిటిష్ వారి కార్యలయం ఎదుటనే  కాంగ్రెస్ పతాకాన్ని జయప్రదంగా ఎగురవేశారు.  మహాత్మా గాంధీ సతీమణి కస్తూరిబా ఆడవారికి సలహాదారు గాను, గాంధీగారు జైలులో ఉన్నప్పుడు ఆయన కార్యక్రమాలను నిర్వహించారు.  సత్యాగ్రహ ఉద్యమంలోను , నిరాహారదీక్షలలోనూ పాల్గొన్నారు.  

   నెహ్రూగారి భార్య కమలా  నెహ్రూ స్వతంత్ర ఉద్యమాలకోసం సభలను ఏర్పాటు చేశారు.  అనేక నిరసన ఊరేగింపులను నిర్వహించారు.  ముఖ్యంగా నో-టాక్స్ (పన్ను నిరాకరణ) ప్రచారం లో ముఖ్య భూమిక వహించారు. నెహ్రూ కుమార్తె విజయ లక్ష్మి పండిత్ అయితే సహాయ నిరాకరణ ఉద్యమం లో క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గొన్నారు.  

   ఇట్లా అనేక మంది తమ తమ స్వంత సుఖాలను త్యాగం చేసి , దేశం కోసం , ప్రజలకోసం , స్వపరిపాలన కోసం జైళ్లకు వెళ్లారు.  తమ పిల్లలను, భర్తలను, ఆస్తులను పోగొట్టుకున్నారు.  ఉద్యమకారులకు సహాయం చేశారు.  ఇంటిలోనే కాదు, ఇంటి బయట కూడా ప్రాణాలకు సైతం తెగించి బ్రిటిశ్వారి ఎదిరించారు.  మన స్వాతంత్ర్యం మనకు తిరిగి సంపాదించి తెచ్చారు.  

kvnmurty: please click on thanks box/link above
Similar questions