what are problems faced by the farmers in telugu
answers in english will be reported
Answers
Answer:
తెలంగాణలో కౌలు రైతు కష్టాలు రెట్టింపు అయ్యాయి. పంట సరిగా పండక, ప్రభుత్వ పథకాల్లో ఆర్హత లేక ఇబ్బందులకు గురౌతున్నారు. దీనికి తోడు కౌలు రైతుల పట్ల ప్రభుత్వం ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకోకపోవడంతో దిక్కు తోచని పరిస్థితిలో పడ్డారు తెలంగాణ కౌలు రైతులు. రైతు బందు పథకం లాంటి ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే పథకం తమకు కూడా కావాలని డిమాండ్ చేస్తున్నప్పటికి పట్టించుకునే నాథుడు కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కౌలు రైతలు.
రైతు బంధు స్కీంపైన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వైఖరి ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. ఎకరానికి నాలుగు వేల రూపాయల సాయం చేస్తు అన్నదాత అభిమానాన్ని ఆయన పొందుతున్నారు.భూమి ఉన్న ప్రతి రైతుకు చెక్ లు పంపించిన కేసీఆర్ కౌలు రైతు విషయంలో మాత్రం చాలా కఠినంగా వ్యవహారిస్తున్నారు. గుంట భూమి నుంచి అరవై ఎకరాల బడా భూస్వామి వరకు రైతు బంధులో సాయం అందుతోంది. ఒక్కొక్కొ భూస్వామ్య కుటుంబం లక్షల్లో ప్రభుత్వ డబ్బును ఈ స్కీం ద్వారా ఆయాచితంగా అందుకుంది.