India Languages, asked by karthik979, 10 months ago

what is diwali eassay in telugu

Answers

Answered by aakarsh23
2

Answer:

Explanation:

హిందువుల పండుగలలో దీపావళి ప్రత్యేకమైంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారనేది పురాణ ప్రాశస్త్యం. దీపావళి పండుగ అనగానే మనం తెలియకుండానే చిన్నతనంలోకి వెళ్లి పోతాం. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని అయిదు రోజుల పండుగగా జరుపుకుంటారు. ఆశ్యయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు, కార్తీక శుద్ద విదియ ‘భగినీహస్త భోజనం’తో ముగుస్తాయి.

ధన త్రయోదశిఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసి, వాడని పాత సామాన్లను శుభ్రం చేస్తారు. కొత్త వెండి, బంగారు ఆభరణాలు ఈ రోజున పూజలో పెడితే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ రోజున ధనలక్ష్మీ, కుబేరులను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. బంగారం, వెండి కాకుండా ధన త్రయోదశి రోజు ఏ వస్తువు కొనుగోలు చేసి శుభం జరుగుతుందంటారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించినప్పుడు ధన త్రయోదశి రోజునే లక్ష్మీ దేవి ఉద్భవించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఈ రోజున తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఏ వస్తువు ఇంటి

Similar questions