what is the snonym of hospitalityko
Answers
Answer:
మరోక 5 విషయాలు
*అంశం:పిల్లలు - క్రమశిక్షణ*(4)
5⃣ *వేషధారణ:*
▪మనము వేషధారణ (నటన) అంతటిని కడుగుకొనవలెను. అనగా మనకు మనముగా చేయని దానిని వారిని చేయుమని మన బిడ్డలకు ఎప్పుడైనను చెప్పకుండుట మన బిడ్డలు చూడవలెను.
ఇటువంటి విషయాలలో మనమెక్కడ తప్పిపోవు చున్నామో చూపుమని దేవునినడిగి మనము పశ్చాత్తాపము చెందవలెను. *మనము వేషధారులమైతే మన బిడ్డలు కూడా వేషధారులు అగుదురు.*
6⃣ *దురాశ:*
మనము కడుగు కొనవలసిన మరియొక మరణకరమైన పాపము దురాశ.
*దేవుడు మనకు ఇచ్చుటకు ఎంపిక చేసిన భూ సంబంధమైన వస్తువులతో మనము సంతృప్తి పొందనట్లు మన బిడ్డలు చూచినట్లయితే, వారుకూడా దురాశ కలిగి యుందురు.*
ఆడపిల్లలు మరి ముఖ్యముగా వారి తల్లులు ఏమికొంటున్నారు లేక ఏమి కొనాలని ఆశ కలిగియున్నారనేది చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు.
*దేవుడు మనకు ఒకటి ఉండాలని తలస్తే, దానిని కొనుటకు కావలసిన సొమ్మును ప్రభువు ఇస్తారు. ఒకవేళ ఆయన అలా చేయనట్లయితే, దాని అవసరం నిజానికి మనకు లేదని ఆయన మనకు చెప్పే పద్ధతులలో ఇది ఒకటి. దానిని కొనుటకు మనకు సామర్థ్యముండినా, అది మనకంత అవసరమైనది కాకపోవచ్చు.*
అటువంటప్పుడు దానిని కలిగి యుండక పోవుటయే ఉత్తమము.
*ఉన్నదానితో సంతృప్తి పడకపోవుటయే దురాశ.*
* ఈ లోకములో ఉండిన వస్తువులన్నిటి కంటె మంచి మనస్సాక్షి కలిగియుండుట ఎంతో విలువైనదని పిల్లలకు చెప్పాలి.
*మన పిల్లల కొరకు మనము కొనగలిగిన సామాన్యమైన తక్కువ ఖరీదు బొమ్మలు, ఆట వస్తువులతో వారు సంతృప్తి పడడం నేర్చుకొనగలరు.
అంతే కాకుండా వారికి కావలసిన వస్తువులుగాని ఆట బొమ్మలు గాని వారికి వారే తయారు చేసికొనుట నేర్చుకొంటారు.
7⃣ *చాడీలు:* *కొండెములాడుట.*
*మనము మన గృహములలో ఎవ్వరి గూర్చి చాడీలు చెప్పుకొనుట కాని లేక చెడుగా మాట్లాడుట కాని చెయ్యకుండునట్లు జాగ్రత్త పడవలెను.*
వారి స్వంత గృహములలో వారి సంఘములో నుండిన ఇతర విశ్వాసులను గూర్చి కొండెములు లేక చెడ్డగా మాట్లాడుట వినుట వలన ఆ విశ్వాసులను తృణీకారముగా చూచే పిల్లలను నేను చూచాను.
తల్లిదండ్రులే వారి పిల్లలను ఈ విధముగా విషతుల్యం చేసి వారి మనస్సులను పాడుచేయుట ఎంత దు:ఖకరమైన విషయం!
యేసు ప్రభువు తప్పనిసరిగా ఇటువంటి తల్లిదండ్రుల గూర్చియే, ఎవరైనా చిన్న బిడ్డలను అభ్యంతరము కలుగజేసిన యెడల *''వారు మెడకు ఒక తిరుగటి రాయి కట్టుకొని సముద్రములో దూకుట మేలు''* (మత్తయి 18:6) అని చెప్పెను.
*పిల్లలతో తల్లి ఎక్కువ సమయాన్ని గడుపును కాబట్టి ఈ విషయంలో తల్లులైనవారే బహు జాగ్రత్త కలిగి యుండవలెను.*
తల్లి హృదయములో ఎవరిపైనైనా నిష్ఠూరముంటే పిల్లలు సులువుగా గ్రహించ గలరు.
*ఒక పాత్రలో నుండిన పాలనన్నిటిని కొంచెం పుల్లనైన పాలు గాని పెరుగు గాని పులుపుగా చేయును* -
ఆ పులిసిన పెరుగు కాలం గడిచే కొద్దీ చేదుగా మారును.
హృదయంలో చేదైన వేరు మొలచుట వలన అనేకులు కల్మషపర్చబడుదురని బైబిలు హెచ్చరిస్తుంది (హెబ్రీ 12:15).
గనుక *మనము ఇతరులపై నుండిన చెడు వైఖరిని వెనువెంటనే తీసివేసుకొన వలెను.*
8⃣ *అపార్థములు:*
ఈ లోక సంబంధమైన దగ్గర బంధుత్వాలలో అపార్ధాలు వచ్చును. అయితే దేవుని సహాయముతో వాటిని మనము సాధ్యమైనంత వెంటనే తీసివేసుకొనవలెను.
*పసి పిల్లలు కూడా మంచికి మరియు చెడుకు సంగీతానికి, శబ్దానికి, ఐక్యతకు విబేధానికి మొదలైన వాటి మధ్య వ్యత్యాసాన్ని గ్రహించగలరు.*
9⃣ *పక్షపాతాలు:*
*పిల్లల మధ్య పక్షపాతం చూపుట.*
పిల్లలుమాటలు నేర్చుకొనుటకు ఎంతో ముందే అర్థము చేసికోగలరు.
గనుక *మనము వారి మనస్సులను పక్షపాతం ద్వారా కల్మష పర్చకుండునట్లు జాగ్రత్తపడాలి.*
*మనము అన్ని విధములైన పక్షపాతము నుండి కడుగు కొనవలెను. మన పిల్లలలో ఎవరిపైన ప్రత్యేక అభిమానము కలిగి యుండకూడదు. వారందరు మనకు ఒకే విధముగా నుండి అందరు సమానమైన విలువ గలవారుగా నుండవలెను. ఏ బిడ్డను కూడా ప్రత్యేకమైన విధముగా చూడకూడదు.*
మన బిడ్డలలో నుండిన సౌందర్యము లేక ప్రవర్తన లేక తెలివితేటలు లేక వేరే దేని గూర్చియైనను వారియెడల పక్షపాతం చూప కూడదు.
*దీని వలన కలుగు గర్వము పిల్లలకు ప్రమాదం. ఇది మనము జాగ్రత్తగా గమనించుకొనాల్సిన వేరొక పాపము.*
వారి జీవితాలలో నుండిన దేని గూర్చియైనా మనము గర్వించినట్లయితే వారిని మనము పాడుచేసిన వారమగుదుము.
మన బిడ్డలను మంచి మార్గములో పెంచుటలో గల ఉద్దేశ్యము మన స్వంత మహిమ కొరకు కాకుండునట్లు మనము జాగ్రత్త పడాలి. ఒకవేళ అదే ఉద్దేశ్యమైతే, ఆ విషయాన్ని మన పిల్లలు గ్రహించి వారు కూడా కేవలము ఇతరుల యొద్ద మంచి అభిప్రాయము కలుగునట్లు ప్రవర్తించుటకే చూచుదురు.
*మన పిల్లలు కేవలము దేవునిని మహిమపర్చుటకు మాత్రమే జీవించునట్లు మనము నేర్పించాలి.*
మన జీవితకాలము చివరి వరకు మన మనస్సాక్షి పదునుగా సునిశితముగా నుండునట్లు మన శరీరాత్మలకు కలిగిన ప్రతి కల్మషము నుండి పవిత్రులగునట్లు మనము నిరంతము పశ్చాత్తాపముతో జీవించునట్లు కృప కొరకై దేవునిని వెదకుదుము (2కొరిందీ¸ 7:1).
ఓపికతో పూర్తిగా చదివిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు
this is your answer hope it's helpful.....