what is the speciality of gonds in telugu
Answers
Answer:
I don't know what is the answer because I study in class 8
Answer:
భారతదేశంలోని ఆదివాసుల్లో గోండులకు ప్రత్యేక స్థానమూ, ప్రాధాన్యతా ఉన్నాయి. గోండులలో ప్రధానంగా మూడు రకాలున్నాయి. (1) మరియా గోండ్లు (Marias) (2) కొండ మరియలు ( Hill Marias) (3) భిషోహార్ మరియలు (Bisonhorn Marias) ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని బస్తర్ ప్రాంతమే ఈ మూడు రకాల గోండ్లకు పుట్టినిల్లు. గోండులు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కూడా గణనీయంగా ఉన్నారు. వీళ్ళను ప్రధానంగా రాజగోండు (koitur) అంటారు. మహారాష్ట్రలోని చందాను పరిపాలించిన శక్తివంతమైన గోండురాజుల ఆస్థానం ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాద్ జిల్లా వరకు వ్యాపించి ఉండేది. చత్తీస్‌ఘఢ్ లోని చాలా ఆస్థానాల్లో, 1947 వరకు కూడా గోండురాజుల పాలన వుండేది. బ్రిటిషువాళ్ళు భారతదేశాన్ని వదలి వెళ్ళిన తర్వాత గోండు సంస్థానాలన్నీ, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విలీనమైపోయాయి.
గోండుల ప్రాచీన చరిత్ర గురించిన చారిత్రిక ఆధారాలు చాలా తక్కువ. కొంతకాలం క్రితం వరకూ కూడా, ఆదిలాబాద్ జిల్లాలో రాచరికపు ఛాయలు కనిపించాయి. గోండు వీరులు, రాజులు, ఏ ప్రభువూ, బయటి రాజుకూ, జవాబుదారీ కానీ, సామంతుడు కానీ, కాదని అక్కడి గోండులు చెబుతారు. గోండులు ఆ కాలంలోనే నాగలి, ఎద్దులతో వ్యవసాయం చేసేవారు. గోండుల సామాజిక వ్యవస్థకు మూలం వారి నాలుగు గోత్రాలు (phratries) . ఇందులో మళ్ళీ ఉపగణాలు (clans) కూడా వుంటాయి. ముఖ్యంగా రాజగోండులలో వున్న నాలుగు phratries కు నాలుగు పేర్లున్నాయి.
ఎర్వెన్ సాగా (Yerwen saga : Seven brother phratry)
సెర్వెన్ సాగా (Serwen saga : Six brother phratry)
సివెన్ సాగా (Sewen saga : Five brother phratry)
నల్వెన్ సాగా ( Nalven saga : Four brother phratry)
హిందువులు ఎలాగైతే సగోత్రీకులను వివాహం చేసుకోరో, అలాగే గోండులు కూడా ఒక phratryకి చెందినవారు మరొక phratryకి చెందిన వారిని వివాహం చేసుకోరు. ఈ వ్యవస్థకు మూలపురుషుడిగా గోండులు ఒక వీరుడిని కొలుస్తారు. అతడే పెర్సపేన్ (Persapen = Great God) .
బస్తర్ ప్రాంతంలో నివసించే గోండులంతా ఒకలా ఉండరు. అబుఝమర్ కొండల్లో (Abujhamar Hills) పోడు వ్యవసాయం చేసుకొని జీవిస్తున్న కొండ మరియలు వ్యవసాయ పద్ధతుల రీత్యా, కొండ రెడ్లు లాగా, కొలాములులాగా కనిపిస్తారు. వీరు ఎక్కువగాచంద్రాపూర్ జిల్లాలోని భామ్రగఢ్ ప్రాంతంలో విస్తరించి ఉన్నారు. ఈ మధ్య కాలంలో వస్తున్న మార్పుల వల్ల, వీళ్ళు కొండప్రాంతం నుండి మైదాన ప్రాంతాల్లోకి తరలి వచ్చి, అక్కడి వ్యవసాయ పద్ధతులను నేర్చుకొని, బియ్యం పండిస్తున్నారు. భిషోహార్ మరియాలు, వ్యవసాయ పద్ధతుల్లోనే కాక, యితర ఆచార వ్యవహారాల్లో, సంప్రదాయాల్లో కూడా ఆదిలాబాద్‌లోని రాజగోండులను పోలి వుంటారు. వీరి వివాహాల్లో, ప్రత్యేకంగా ఎద్దుకొమ్ములతో తయారుచేసిన ఒక రకమైన టోపీని పెట్టుకొని నృత్యం చేసే సాంప్రదాయం వుండటం వల్లే, వీళ్ళకు (Bisonhorn Mariyas) ఆ పేరు వచ్చి వుంటుందని, మానవ పరిణామ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. గోండులు చేసే నృత్యాన్ని గుసాడి అంటారు.
నాగలి, ఎద్దులతో దున్నుకొని వ్యవసాయం చేసిన గోండులు, క్రమంగా భూమినంతా కోల్పోయి, ప్రస్తుతం కౌలుదారులుగానో, వ్యవసాయ కూలీలుగానో బతుకుతున్నారు. ఆదివాసీ అస్థిత్వాన్ని కోల్పోయే క్రమం (Detribalization Process) గోండులలో వేగంగా జరుగుతోంది