what is the summary of chitragreevam lesson?
Answers
Answer:
i don't no
Explanation:
sorry dygdfucgghuhho
బాల సాహిత్యం’ అనగానే కేవలం నీతి సూక్తులూ ఉపదేశాలూ దెయ్యాలూ మాయలమంత్రాలూ గుర్తుకురావడం, అవే అందుబాటులో ఉండటం అనే దురవస్థ ఈనాటిది కాదనుకుంటాను. అంతకుమించిన బహుళమైన ఆసక్తులు పిల్లలకు ఉంటాయని తల్లిదండ్రులతో పాటు రచయితలు ప్రచురణకర్తలు సైతం మరిచిపోవడం దౌర్భాగ్యం కాక మరే మిటి? పేరుకేమో మన దగ్గర పిల్లల కోసం వేల పుస్తకాలు ప్రచురితమవుతున్నాయి. ముందుచెప్పుకొన్న అంశాలుకాక మరేవీ లేకపోవడం వల్లనే పిల్లలను అవి అంతగా ఆకర్షించలేకపోతున్నాయనుకుంటాను.
అన్ని ప్రకృతి వనరుల వలెనే మన దేశంలో వృక్ష సంపద, పక్షి సంపద అపారం. వీటి గురించి విషయాలను ఆసక్తికరంగా చెబుతూ చదివించగల పుస్తకాలు ఎన్ని అందుబాటులో ఉన్నాయి చెప్పండి? ఉన్న కొన్నీ చెట్లవో పిట్టలవో పేర్లు, శాస్త్రీయ నామాలూ, అడవుల విస్తీర్ణమూ వంటి ‘విజ్ఞానదాయక సమాచారం’తో నిండి ఉంటాయి. ఏ చెట్టు ఏదో, ఏ పిట్ట ఎక్కడుంటుందో సమాచారం తెలియడం అవసరమే. కాదనను. పక్షులను గుర్తించడం ఎలాగో తెలుసుకోవడం కన్నా పక్షుల పాటలను విని ఆనందించే శక్తి పిల్లలకు ముఖ్యం. ఇప్పుడు పరిచయం చెయ్యబోతున్న పుస్తకం ‘చిత్రగ్రీవం’ సరిగ్గా ఆ శక్తినే పిల్లలకు అందించగలుగుతోంది. ఈ పుస్తకంలో సాంకేతిక వివరాలు కథాగమనంతోనూ, వాస్తవాలు కల్పనతోనూ ఎంతో చక్కగా మిళితమై ఉన్నాయి. ఇంత మంచి పుస్తకం పునర్ముద్రణకు అరవయ్యేళ్లు పట్టిందన్నమాట భారతదేశంలో బాలసాహిత్యం ఎలాంటి స్థితిలో ఉందో చెప్పకనే చెబుతుంది. ఈ పుస్తకం 1928లో ‘న్యూ బెరీ మెడల్’ను గెలుచుకుంది. బాలసాహిత్యంలో విశిష్ట కృషి చేసిన వారికి అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్‌వారు ప్రతి సంవత్సరమూ ఇచ్చే గొప్ప పురస్కారం ఈ న్యూబెరీ మెడల్. ఇంతకీ పుస్తకంలో విషయం ఏమిటి?
కథాకాలం 1920లు. అప్పట్లో కలకత్తా జనాభా పదిలక్షలయితే ఇరవై లక్షల పావురాలుంటాయని రచయిత అంచనా. ‘ప్రతీ మూడో కుర్రాడి దగ్గర కనీసం ఒక డజను వార్తలు మోసే పావురాలు, గిరిక్‌ల పావురాలు, పిగిలిపిట్టలూ, బంతి పావురాలూ ఉండటం కద్దు…’ అన్న వాక్యంతో మొదలవుతుందీ పుస్తకం. అలాంటి నగరంలో పదహారేళ్ల కుర్రాడి పెంపుడు పావురం చిత్రగ్రీవం. దాని తల్లిదండ్రులెవరు, అదీ లోకంలోకి ఎలా వచ్చింది, దాని చదువెలా సాగింది, దిశాజ్ఞానంలో శిక్షణ ఎలా పొందింది, దాని ఆకతాయితనం, అది తప్పిపోయినప్పుడు ఈ కుర్రాడు వెతుక్కున్న వైనం ఇవన్నీ మొదటి భాగం. రెండో భాగంలో చిత్రగ్రీవానికి ఇచ్చిన యుద్ధ శిక్షణ, అది చేసిన సాహసాలు, శతృస్థావరాలను కనిపెట్టిన తీరు ఉంటాయి. స్థూలంగా కథ ఇంతే. ఏదైనా మిఠాయి తిన్నప్పుడు మనకెలా అనిపించిందో మాటల్లో ఎంత చెప్పినా చదివే వాళ్లకు ఆ రుచి అందదు. అలాగే పుస్తకాల గురించి ముఖ్యంగా చిత్రగ్రీవం, వనవాసి వంటి పుస్తకాలు చదివితే తప్ప పాఠకులకు వాటి రుచి అందదు. అయితే ఒక్కమాట చెప్పుకోవాలి. ‘చిత్రగ్రీవం’ కేవలం ఓ పావురానికి శిక్షణనివ్వడం, అది అనేకరకాల సాహసాలు చెయ్యడం వీటి గురించిన కథే కాదు. ధైర్యం, విశ్వప్రేమ అన్న విశిష్ట సందేశాలను అందరికీ చేరవేసే వాహిక కూడాను. యుద్ధంలో గాయపడిన చిత్రగ్రీవానికి భయాన్ని తగ్గించి స్వస్థత కలిగించే బౌద్ధాచార్యుల మాట చూడండి…
“ప్రపంచంలోని సకల ప్రజానీకపు శాంతిసౌఖ్యాల కోసం రోజుకు రెండుసార్లు
#twinkle....✌️