Why old people lose power/ability to dream ?? ESSAY IN TELUGU
Answers
Answered by
4
I do not say that this is the only correct answer. This my guess. Actually this topic is from the subject of Psychology. It should be really be proven by statistics from observing dream conditions of old people in their sleep.
కలలు మనుషులందరికీ వారి వారి నిద్ర లో వస్తాయి. కలలు మనం చాలా మంచి నిద్రపోతేనే వస్తాయి. కలలు ఎలాంటివి వస్తాయి అనేది, నిద్రపోయే ముందు ఉన్న వారి వారి మానసిక స్థితి ని బట్టి ఉంటుంది. చాలా ఉత్సాహం, కోరికలు, అమాయకత్వం, ఉడుకు రక్తం కలవారికి ఒక రకం గా వస్తాయి. చల్లబడిన రక్తం, జీవితం లో చాలా అనుభవం, నిరాశ, నిస్పృహ కలవారికి మరియు కోరికలు లేని వారికి ఇంకొకరకం గా వస్తాయి. జీవితం లో సంతృప్తి కలవారికి , కులాసాగా బ్రతికేవారికి ఇంకొక విధమైన కలలు రావచ్చును.
స్వప్నాలు మన నిద్రావస్థ లో ని ఒక అవస్థ "REM" (Rapid Eye Movement") లో వస్తాయి. కల చూసేటపుడు మన కళ్ళలో కనుపాప చురుకు గా కదులుతుంది. సరిగ్గా మనం కళ్ళు తెరచుకొని ఎదుట నున్న కదిలే బొమ్మలు చూసేటపుడు ఎలా కదులుతాయో అలాగే కనుపాపలు కదులుతాయి.
పాలిచ్చే అన్ని జంతువులు , మనుషులు స్వప్నాలు చూస్తారు. కానీ చల్లటి రక్తం కల బల్లులు, తేళ్ళు, మొసళ్ళు కలలు కనవు. మన చిన్న పిల్లలు నిద్రలో సుమారు 50% (ఏభయ్ శాతం) వరకు REM స్థితి లో గడుపుతారు. పెద్దవాళ్ళు , ముసలివాళ్లు వారి నిద్ర లో సుమారు 20% (ఇరవై శాతం) కన్నా తక్కువగా మాత్రమే REM దశ లో ఉంటారు.
కలలు చూడడానికి మన నెర్వస్ కండిషన్ (నరాల శక్తి) బాగుండాలి. నరాల బలహీనత కలవారు కలలు తక్కువగా కంటారు. వారు చాలా లోతైన, దీర్ఘమైన, గట్టి నిద్ర లో ఉంటారు. కనుక కలలు కనడం తక్కువ. వృద్ధులలో చాలామందికి నరాల బలహీనత ఉంటుంది.
వృద్ధులు చాలా మందికి నిద్రలేమి జబ్బు ఉంటుంది. అందువల్ల వారికి తొందరగా నిద్ర పట్టదు. ఎపుడో అర్ధరాత్రి కొ లేక తెల్లవారికో నిద్ర పడుతుంది. కనక కలలు కనడానికి సమయం తక్కువ. నిద్రపోయే ఆ కొద్ది సేపు వారు గాఢమైన నిద్రలో ఉండొచ్చు. చాలా మంది కి దగ్గు రావడమో లేక చాలాసార్లు బాత్రూమ్ కి వెళ్లాల్సి రావడమో లాంటి ఇబ్బందులు రోగాలు ఉండవచ్చు. అలాంటి వారికి కలలు వచ్చే అవకాశం తక్కువే కదా.
కోరికలు ఉన్న యువకులకు , కలలు కనాలని ఉండే పిల్లలకు, ఊహ లో ఆనందం పొందే కుర్రవారికి కలలు తప్పక వస్తాయి. ఎందుకంటే వారు పడుకొనే ముందు అదే ఆలోచనలో ఉంటారు, అవే కోరుకొంటారు. ఒకొక్కసారి వారు వారి కలలో వారికి ఇష్టం వచ్చినట్లు గా కూడా కలలని నడిపించుకొనే (దర్శకత్వం చేసుకొనే) వీలు కూడా ఉంటుంది. కానీ వృద్ధులు అలాంటి కలలు కనాలని ఆశ పడకపోవచ్చు. ఎందుకంటే చాలమందికి కోరికలు తీరి ఉంటాయి. సుఖంగా మంచి నిద్రపోయి అలసట తీరి ప్రొద్దున్న లేవాలని ఉంటుంది. పెద్దవాళ్ళు కొంతమంది పగలు చాలా పని చేసి ప్రయాణం చేసి అలసి పోతారు. అందుకని మంచి గాఢ నిద్రలోకి తొందరగా వెళ్లిపోతారు. స్వప్నావస్థలో కి జారినా అందులోంచి తొందరగా బయట పడతారు .
వృద్ధులు కలలు కన్నా చాలామంది ప్రొద్దున్న లేవగానే అవి మరచిపోతారు. పడుచువాళ్లు నిన్నమొన్నటి కలలు కూడా గుర్తు పెట్టుకోగలరు. కావాలని కోరుకొని అవే కలలు మళ్ళీ మళ్ళీ కనగలరు. రాజకుమారుడు , రాజకుమారి , రాజ్యం, యుద్దాలు, గాలి లో ఎగరడాలు , సుపర్ మేన్ శక్తులు కల వారిగా అవాలని అనుకొనే పిల్లలు తప్పకుండా కలలు కంటారు. అందుకని పిల్లలలో కలలు కానే శక్తి , కోరిక ఉంటుంది. పెద్దలలో ఆ పట్టుదల ఉండక పోవచ్చు.
భయాందోళనలో ఉన్నవారికి , రాత్రి భయంకరమైన సినిమా చూసిన వారికి, రానున్న రోజులలో ఎపుడు తనకు తన వారికి ఏం జరుగుతుందో అని ఆదుర్దా పడే పెద్దలకి ఆ కలవరపాటుకి తగినట్లు గానే భయపెట్టే కలలు వస్తాయి.
ముగింపు కొస్తే, పెద్దవాళ్ళు ఒక జీవితానికి అలవాటుపడిపోయి ఒకే విధంగా రోజులు గడపడం వల్ల కొత్త కలలు కనరు. ఊహా స్వప్నాలు కనాలని అనుకోరు. పిల్లలు కోరుకొంటారు. పిల్లల మానసిక , శారీరిక , మేధా శక్తి ఇంకా వారి ఆరోగ్యం అన్నీ వారికి కలలు కనడం లో దోహదం చేస్తాయి. పెద్దలకి తక్కువ దోహదం చేస్తాయి.

kvnmurty:
:-) :-)
Similar questions