English, asked by mtsikarwar7892, 1 year ago

write a few lines about yadigiri gutta in telugu

Answers

Answered by ghaimonicapc99ff
5
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ మైన దివ్య క్షేత్రం యాదాద్రికి సంబందించిన చ‌రిత్ర‌కు మూలం వాల్మీకి రామాయణంలో ఉన్నది. విభాండక అనే ఋషి కుమారుడు రుష్యశృంగుడు. రుష్యశృంగుడి కుమారుడు హాద ఋషి. అతనినే యాదర్షి అని కూడ అంటారు. యాదర్షి నరసింహ స్వామి భక్తుడు. అయ‌నికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయస్వామి సలహా మేరకు గోర తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహ మూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్షి కోరతాడు అప్ప‌డుప్పుడు స్వామి వారు కరుణించి లక్ష్మి సమేతుడై దర్శన మిచ్చి ఏంకావాలో కోరుకో అన‌గా యాదర్షి స్వామి వారిని  “శాంత మూర్తి రూపంలోనె కొలువై కొండపై ఉండి పొమ్మని కోరతాడు. ఆవిధంగా లక్ష్మి నరసింహ స్వామి అలా కొండపై కొలువై ఉండి పోయాడు. కొన్నాళ్ళ త‌రువాత‌ స్వామి వారిని వేర్వేరు రూఫాల్లో చూడాలనిపించి యాదర్షి మరలా తపస్సు చేశాడు. ఆ భ‌క్తుడి కోరిక మేరకు స్వామి వారు జ్వాలా, నంద, యోగా, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందువ‌ల‌న‌ ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అని కూడా అంటారు.

యాదర్షి అనే ఋషి పేరు మీద యాదగిరిగా ప్రసిధ్ధికెక్కింది. యాదర్షి అనే ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ కింద వున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చ‌రిత్ర‌కారులు చెబుతారు. ఆ యాద మహర్షి కోరిక మేర‌కు ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా కొలువున్నాడు. చాలామంది వారి కోరికల మేర‌కు కొన్నాళ్ళపాటు ఇక్కడే ఉండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని ధ‌ర్శిస్తారు. అంతేగాక  రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల ఉన్న కొండ‌ల‌ మీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానంమాచ‌రించి స్వామివారిని అర్చిస్తారట. దానికి నిదర్శనంగా వారు వచ్చే స‌మ‌యంలో మృదంగ ధ్వనులు వినిపిస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారని కూడా ప్ర‌తిది. వారు స్వామివారిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు.  



గుట్టకు ప్రవేశ ద్వారము మెట్ల మార్గాన వెళ్ళే దారిలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూవుగా (త‌న‌కుతానుగా) వెలిశాడని చ‌రిత్ర చెబుతుంది .. ఈ మెట్లు ఎక్కి స్వామిని ద‌ర్శించినవారి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల న‌మ్మ‌కం. యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రము నందు రెండు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయము. పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయము.

ఇంకో కథనం ప్రకారం లక్ష్మీ నరసింహస్వామి మొదట పాత లక్ష్మీనరసింహ స్వామి ఆలయం నందు వెలసి తర్వాత‌ కొత్త లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయమునికి గుర్రము మీద వెళ్ళేవారు. ఇప్పటికీ మనము ఆ గుర్రపు అడుగులు ఆదారిలో చూడవచ్చు. ఈ అడుగులు గుర్తులు పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుండి కొత్త లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయము వరకు ఉన్నాయి. పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయం నందు, ఆంజనేయ స్వామి వారి ఆలయము కూడా ఉంది. అక్కడ ఆ గోడ పై ఉన్న చిత్రములు చాలా అద్భుతముగా ఉన్నాయి. అక్కడ నుంచి కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయమునకు వెళ్ళే దారిలో ఆంజనేయ స్వామి యొక్క‌ మరొక గుడి ఉంది. ఈ ఆలయము గర్భగుడి వద్ద నిత్యము ఒక జల ప్రవాహము కలదు. ఈ జలముతోనే నిత్యము స్వామివారికి అభిషేకం చేస్తారు.

Answered by ottikulaphalguna
1

Answer:

About yadigiri gutta

Explanation:

ప్రధాన వ్యాసం: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక దివ్య క్షేత్రం. యాదాద్రికి సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు. అతని కుమారుడు హాద ఋషి. అతనినే హాదర్షి అని కూడా అంటారు. అతను నరసింహ స్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయస్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహ మూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్షి కోరగా స్వామి వారు కరుణించి లక్ష్మి సమేతుడై దర్శన మిచ్చి "ఏంకావాలో కోరుకో" మంటే యాదర్షి స్వామి వారికి "శాంత మూర్తి రూపంలోనె కొలువై కొండపై ఉండి పొమ్మని కోరాడు. ఆవిధంగా లక్ష్మి నరసింహ స్వామి కొండపై అలా కొలువై ఉండి పోయాడు. కొన్నాళ్ళకు స్వామివారిని వేర్వేరు రూఫాల్లో చూడాలనిపించి యాదర్షి మరలా తపస్సు చేశాడు. అతని కోరిక మేరకు స్వామి వారు జ్వాలా, యోగా, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అంటారు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిధ్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ క్రింద వున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, వగైరా కోరికలతో కొన్నాళ్ళపాటు ఇక్కడ వుండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారుట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పడు మృదంగ ధ్వనులువినిపిస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారుట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు. యాదగిరి గుట్టకు ప్రవేశ ద్వారము

Similar questions