Accountancy, asked by sreekarreddy91, 2 months ago

Write a paragraph on Carpenter ( వడ్రంగి ) in Telugu​

Answers

Answered by ItzDinu
7

\Huge\bf\maltese{\underline{\green{Answer°᭄}}}\maltese

\implies\large\bf{\underline{\red{VERIFIED✔}}}

విశ్వకర్మీయుల / విశ్వబ్రాహ్మణుల పంచ వృత్తులలో రెండవ వృత్తి ఈ వడ్రంగము. కలపతో వివిధ వస్తువులను తయారుచేయుట వీరి వృత్తి. వడ్రంగి పని చేయువారు ప్రతి ఊరున ఉంటారు. వీరు ఇళ్ళకు సంబంధించిన తలుపులు, కిటికీలు, ఇళ్ళ పైకప్పులు వంటివి మొదలుకొని ఇంట్లో సామాన్యంగా వాడుకకు ఉపయోగించు చెక్క పరికరములు అన్నీ చేస్తుంటారు. సాంప్రదాయకంగా భారతదేశంలో విశ్వబ్రాహ్మణులు మాత్రమే తమ కులవృత్తిగా వడ్రంగం చేస్తుండేవారు. ఆధునిక కాలంలో ప్రతి వారూ వడ్రంగం నేర్చుకొని చేయుట మొదలెట్టారు. చేతిలో పనివుంటే దేశంలో ఎక్కడికైనా పోయి బతకవచ్చు, కులవృత్తికి ఏదీ సాటిరాదు అని సామెతలు. చెక్క ముడిసరుకుగా ఉన్నప్పుడు వాటికి రూపమిచ్చేది వడ్రంగి. ఇంటి తలుపులు, కిటికీలు, డైనింగ్ టేబుల్లు, మంచాలు, వ్యవసాయానికి కావల్సిన నాగలి, కాడి మేడి, బండి, ఇలా ఒకటేంటి అన్నింటినీ వడ్రంగులు చేస్తారు. ప్రస్తుతం వడ్రంగితో పనిచేయించుకుంటే ఆలస్యం అవుతుందని భావించి రెడీమెడ్ తలుపులు, డైనింగ్ టేబుళ్ళను కొనుగోలు చేయడంతో ఈ రకం చేతి వృత్తులు అంతరించి పోతున్నాయి. అనంతపురం జిల్లాలో వేలాది ముస్లింలు వడ్రంగిపని చేస్తున్నారు. నెల పొడవునా పనిచేసినా కనీసం వెయ్యిరూపాయలు కూడా రాదని వడ్రంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కులవృత్తినే నమ్ముకుని వందలాది మంది తమ గ్రామాలు వదిలి పట్టణాలకు వలస వచ్చారు. చేసే పనికి కూలీ గిట్టుబాటు కాక నేడు వారు నౌకర్లుగా, గుమస్తాలుగా వేరే పనుల్లో పడుతున్నారు.

 \boxed{I \:Hope\: it's \:Helpful}

{\sf{\bf{\blue{@ℐᴛz ᴅɪɴᴜ࿐}}}}

Similar questions