Accountancy, asked by sreekarreddy91, 3 months ago

Write a paragraph on Handloom ( చేనేత ) in Telugu​

Answers

Answered by ItzDinu
6

\Huge\bf\maltese{\underline{\green{Answer°᭄}}}\maltese

\implies\large\bf{\underline{\red{VERIFIED✔}}}

చేనేత వివిధ రకాల చెక్క ఫ్రేమ్‌లను సూచిస్తుంది, వీటిని నైపుణ్యం కలిగిన చేతివృత్తులవారు సాధారణంగా కాటన్, సిల్క్, ఉన్ని, జనపనార వంటి సహజ ఫైబర్‌ల నుండి బట్టలు నేయడానికి ఉపయోగిస్తారు.

ఇది ఒక కుటీర పరిశ్రమ, ఇక్కడ మొత్తం కుటుంబం వస్త్ర ఉత్పత్తిలో పాల్గొంటుంది. నూలును తిప్పడం, రంగులు వేయడం, మగ్గం మీద నేయడం వరకు. ఈ మగ్గాల నుండి ఉత్పత్తి చేయబడిన బట్టను చేనేత అని కూడా అంటారు.

ఈ మొత్తం ప్రక్రియకు అవసరమైన సాధనాలు చెక్కతో తయారు చేయబడతాయి, కొన్నిసార్లు వెదురు మరియు వాటిని అమలు చేయడానికి వారికి విద్యుత్ అవసరం లేదు. ఫాబ్రిక్ ఉత్పత్తి యొక్క మొత్తం ప్రక్రియ మునుపటి కాలంలో పూర్తిగా మాన్యువల్. అందువల్ల బట్టలు ఉత్పత్తి చేసే అత్యంత పర్యావరణ అనుకూల మార్గం ఇది.

 \boxed{I \:Hope\: it's \:Helpful}

{\sf{\bf{\blue{@ℐᴛz ᴅɪɴᴜ࿐}}}}

Answered by tennetiraj86
8

Explanation:

చేనేత :-

చేనేత అనగా చేతి ద్వారా నేయుట అని అర్ధము.

చేతి ద్వారా దారులను ,నూలు పోగులను అందమైన వస్త్రాలుగా తయారు చేయుటను చేనేత అని ఆ వృత్తి ద్వారా జీవనం సాగించు జన సమూహాన్ని చేనేత వృత్తి వారు అని ఆ వృత్తి పై ఆధారపడు పని వారిని చేనేత కార్మికులు అని అంటారు.

చేనేత పరిశ్రమ అనేది మన దేశంలో అతి పురాతన పరిశ్రమ.

దీని ఆనవాలు అది మానవుడు తన వస్త్రాలు గా ఆకులను కట్టుకున్న దగ్గరనుండి మొదలైనది గ్రహించవచ్చు.

మానవుని మేధస్సు తన అవసరాన్ని తీర్చుకోవడానికి గొప్ప గొప్ప ఆవిష్కరణ లను కనుగొంది.

పురాతనకాలం నుండి వీరి కి గౌరవం మరియు వీరి వస్త్రాలు గొప్ప గిరాకీ ఉండేది.

విదేశాల నుండి మన దేశానికి సుగంధ ద్రవ్యాల తరవాత వస్త్రాల కోసమే ఎక్కువగా వచ్చారనడం అతిశయోక్తి కాదు.

మన చేనేత కార్మికుల గొప్పతనం ఒక మాటలో చెప్పాలంటే చిన్న అగ్గిపెట్టే లో పట్టగలిగిన చీరను సైతం తయారు చేసి చూపించగలిగారు.

చేనేత లో చాలా రకాల చీరలు ఉన్నాయి. వీరు నూలు దారులను ఉడికించి పొగులను వేరు చేసి మగ్గాలపై చీరను నేసి ,రంగులను అద్ది ఈ ప్రపంచానికి అందమైన చీరలను అందిస్తున్నారు.

కానీ ఈ ఆధునిక యుగంలో వీరికి వీరి ఉత్పత్తులకు గిరాకీ తగ్గింది అందరూ రకరకాల ప్రింటెడ్ చీరలు వాడుతున్నారు.

ప్రభుత్వాలు ఆప్కో పేరిట వీరి ఉత్పత్తులకు ప్రోత్సాహాలను ఇస్తున్నప్పటికి వీటిని కొనే వారు అతి తక్కువ మంది ఉన్నారు.

కాబట్టి వీరి ఉత్పతులకు గిరాకీ రావాలన్న , వీరి ఉత్పత్తులను కొనలన్న ప్రముఖ వ్యక్తుల ద్వారా వీరి ఉత్పత్తులను ప్రమోట్ చేయించుట మరియు ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఏదొక ఉత్పత్తులు ను కొనుగోలు తప్పనిసరి చేయుట ద్వారా వీరి వృత్తిని,వీరి ఉత్పత్తులను బలోపేతం చేయడమే కాక, మన గొప్ప వృత్తులను పరిరక్షించుకున్నవారము కాగలము.

Similar questions