Write a paragraph on చేనేత వృత్తి in Telugu
Answers
Explanation:
చేనేత వృత్తి:-
మన దేశం అనేక వృత్తుల సమ్మేళనం. అనాదిగా చాలా వృత్తులు ఉన్నప్పటికీ అందులో కొన్ని వృత్తులు ఇప్పటి వరకు వాటి మూలాలతో ముడిపడి ఉన్నాయి.అందులో చేనేత వృత్తి పురాతనమైనది.
చేతితో నేయుట అని అర్థం వచ్చు పదము చేనేత.
చేతితో దారాలు మరియు నూలుపోగులను అందమైన , విలక్షణమైన వస్తువులుగా మలించు వారిని చేనేత కార్మికులు అని ఆ వృత్తి ని చేనేత వృత్తి అని అంటారు.
ఆది మానవుడు చెట్లు ఆకులతో తన వస్త్రాలుగా మలుచుకున్న దగ్గరనుండి నేటి ఆధునిక మానవుడి వస్త్ర ధారణ వరకు వీరి కృషి అభినందనీయమ మరియు హర్షణీయము.
కేవలం చిన్న అగ్గి పెట్టెలో ఒక చీరను చుట్టి పెట్టగల వీరి సృజనాత్మకతకు మచ్చుతునక. వీరు నూలు దారాలు గెంజి నీళ్లలో ఉడికించి ,మగ్గం పై నేసి వాటికి రంగులు అద్ది అందమైన మరియు రకరకాల వస్త్రాలను అహర్నిశలు శ్రమించి తయారు చేస్తారు అందుకే వీరిని చేనేత కార్మికులు అని అంటారు.
వీరి వస్త్రాలుగా మలిచిన వాటికి దేశ ,విదేశాల్లో మంచి గిరాకీ ఉంది . ఎంత ఆధునిక యుగంలో ఉన్న వీరి వస్త్రాలు కు మంచి పేరుంది.
కానీ ఆధునిక సాంకేతికంగా తట్టుకోలేక కొన్ని ప్రదేశాల్లో వీరు సంచార జీవితం గడుపుతున్నారు మరి కొందరూ ఈ వృత్తిని వదిలేలా రోజులు మారాయి.
కావున సమాజంలో పెద్దవాళ్ళు, గొప్ప వాళ్ళతో ఈ ఉత్పత్తులను ప్రమోట్ చేయడం అలాగే ప్రభుత్వం "ఆప్కో "
పేరిట ఈ ఉత్పత్తులను ప్రోత్సహించు మాదిరిగా అందరూ తప్పనిసరిగా కొనుగోలు చేయువిధంగా చొరవ తీసుకోవాల్సివుంది.
ప్రభుత్వాలు తగిన ప్రోత్సాహకాలు వలన అతి ప్రాచీన ఈ వృత్తిని బలోపేతం చేయుట ద్వారా అనాదిగా వస్తున్న మన వృత్తులను కాపాడుకోవాల్సిన భాద్యత ఉన్నది.