Write a paragraph on Tailor ( దర్జీ ) in Telugu
Answers
దారంతో బట్టలు లేదా దుస్తులు కుట్టే టైలర్ దర్జీ.
- దర్జీల చేతికి తమ బట్టలు ఇస్తే సరైన సమయానికి బట్టలు కుట్టించి ఇవ్వలేరని, చాలా మంది అప్పటికప్పుడు రెడిమెడ్ షాపులలోకి వెళ్ళి తమకు కావాల్సిన దుస్తులను ఎంపిక చేసుకొంటున్నారు.
- దీని ప్రభావం దర్జీల పై చాలా పడింది. గతంలో మాదిరిగా కాకుండా నేడు మహిళలకు కుట్టుమిషన్లు శిక్షణఇవ్వడంతో మహిళలకు కావాల్సిన దుస్తులను మహిళలే తమ ఇళ్ళవద్ద కుట్టుకొంటున్నారు.
- కొంతమంది పేద దర్జీలు కుట్టుమిషన్లు అమ్ముకొని ప్రతి రోజు 5 రూపాయల అద్దెతో కుట్టుమిషన్లను తెచ్చుకొని జీవనం సాగిస్తున్నారు.రెడీమేడ్ దుస్తులు రాని సమయంలో వారికి కావాల్సిన దుస్తులను నెల ముందుగా ఇచ్చే వారు.
- పండగ సీజన్‌లు వస్తే వారం ముందు మాకు కుట్టేందుకు వీలు కాదు అనేవారము. నేడు ఆ పరిస్థితి లేదు. కుట్టే దుస్తుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి.
Explanation:
దర్జీ:-
.దర్జీ అనగా బట్టలు కుట్టు వ్యక్తి అని అర్థము.
ఇది ఒక వ్యక్తి చక్కగా దర్జాగా బట్టలు కొలతలు అనగా ఆది తీసుకుని అనువైన రీతిలో కుట్టుట వలన దర్జీ అన్నారని అర్థం కూడా ఉన్నది.
దర్జీ అతని చేతులు దాదాపు నులుపోగులను మలచగల శక్తి గలవి అతని కాలు కుట్టు మిషన్ ను అలుపు సోలుపు లేకుండా తొక్కుతూ అద్భుతమైన వస్త్రాలు సృష్టించగల శక్తిసాలి.
ఈ వృత్తి అనాదిగా ప్రపంచం మొత్తం ఉంది .దర్జీ లేని లోకం ఉహించలేము.
1846లో 11 నెలలు ఎంతో కష్టపడి ఫిబ్రవరి 28వ తేదీన కుట్టుమిషన్‌ను కనిపెట్టారు. అప్పటినుంచి ప్రపంచ వ్యాప్తంగా కుట్టుమిషన్లు వినియోగంలోకి వచ్చాయి. అందువల్లనే ఫిబ్రవరి 28న ప్రపంచ వ్యాప్తంగా దర్జీల దినోత్సవం జరుపు కుంటారు.
అందమైన ,అనువైన , విలక్షణమైన బట్టలను కుట్టటంలో వీరి శైలి ఆమోఘము .
ఆది మానవుడు ఆకులతో బట్టలు కట్టుకున్న దగ్గరనుండి ఆధునిక మానవుడి వేషధారణ కొత్త పుంతలు తొక్కుతోంది దీనికి ప్రధాన కారణం దర్జీ.
ఫ్యాషన్ రంగం లో ప్రతి దేశం కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్న తరుణంలో దర్జీలు ఫ్యాషన్ డిజైనర్, పెర్సొనల్ ఫ్యాషన్ డిజైనర్ గా తమ ప్రతిభను చాటుకుంటున్నారు.
కానీ గ్రామాలలో వీరి పరిస్థితి పూర్వం చాలా వెలుగు వెలిగింది కానీ ఇప్పుడు వీరి పరిస్థితి చాలా దుర్భరం గా ఉన్నది ,
రెడీ మేడ్ వస్త్రాలు తక్కువ ధరకు వస్తున్న తరుణం లో వారితో పోటీ పడలేక పోతున్నారు .
కావున ప్రభుత్వాలు వీరి పట్ల చొరవ తీసుకుని వీరికి పరిశ్రమలలో పనికి అవకాశం కల్పించి వారికి పూర్వ వైభవాన్ని తీసుకు రావలసిన భాద్యత ఉన్నది.