write a story about police and thief in telugu
Answers
ఒకప్పుడు ఒక దొంగ నివసించాడు… ”కాలాలు మారుతున్నాయి మరియు అద్భుత కథలు. పోలీసు ఫైళ్ళ నుండి ఒక న్యాయమూర్తి రాసిన కథల సమాహారం సాంప్రదాయిక క్లాసిక్ల కంటే నేటి వాస్తవికతను ప్రతిబింబిస్తుంది మరియు సేకరణ యొక్క లక్ష్యం వినోదభరితమైన రీతిలో పిల్లలకు తప్పు నుండి నేర్పించడం.
దొంగలే ఖంగుతిన్నారు: పోలీసులనే మోసగించబోయింది, ఇదో వెరైటీ క్రైమ్ స్టోరీ
By Suvarnaraju M
Published: November 12 2017, 10:49 [IST]
అమరావతి: గుంటూరు లో జరిగిన బంగారు నగల దోపిడీ ఉదంతం పోలీసులకే చుక్కలు చూపించింది. గోల్డ్ అనుకొని రోల్డ్ గోల్డ్ కొట్టేసి బుక్కయిపోయారు ఇద్దరు. నగలు పోయాయని బోరుమంటుంటే పాపం వృద్దురాలనే సానుభూతితో అహర్నిశలు శ్రమించి ఆ దొంగలను పట్టుకున్నారు పోలీసులు.
ఆ తరువాత అసలు విషయం తెలిసి నివ్వెరపోయారు. బాధితురాలనే కనికరం చూపించిన తమనే ఆమె మోసగించబోయిందని తెలుసుకొని తెల్లబోయారు. మొత్తంగా ఈ దోపిడీ వ్యవహారం చూస్తే వెరైటీ కామెడీ క్రైమ్ స్టోరీని తలపించినా పోలీసులకు మాత్రం ట్రాజెడీలా మారింది.
చిన్ననాటి స్నేహితులు
వివరాల్లోకి వెళితే కొర్నెపాడు గ్రామానికి చెందిన నేలటూరి దాసు,బొడ్డపాటి ప్రసాద్ చిన్ననాటి స్నేహితులు. నేలటూరి దాసు మంగళగిరి ఓరియెంటల్ బ్యాంకులో అటెండర్ గా పనిచేస్తుండగా బొడ్డపాటి ప్రసాద్ గుంటూరులో బిఎస్సీ ఫైనలియర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో మంగళగిరికి చెందిన తాడిపత్రి ఇందుమతి అనే మహిళ భారీగా నగలు ధరించి తరుచు బ్యాంకుకు వస్తుండేది. ఆమె ఎప్పుడూ బంగారు నగలతోనే కనిపించడం గమనించిన అటెండర్ దాసు అవి ఎలాగైనా కొట్టెయ్యాలనుకున్నాడు.
ప్లాన్ ప్రకారం
ఆమెని మాటల్లో పెట్టి వంటల పోటీలంటే బాగా ఆసక్తి అని తెలుసుకున్నాడు. దీంతో ఆ బంగారు నగలను దొంగిలించడానికి తన స్నేహితుడైన ప్రసాద్ తో కలసి పథకం రచించాడు. ప్లాన్ ప్రకారం దాసు ఆమెకి అపరిచితుడిలా ఫోన్ చేసి గుంటూరులో వంటల పోటీల నిర్వాహకులమని మీరు వంటలు బాగా చేస్తారని తెలిసి ఫోన్ చేస్తున్నామని చెప్పారు. ఈ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిస్తే భారీ బహుమతులు ఉంటాయని నమ్మించారు. దీంతో ఇందుమతి పోటీల్లో పాల్గొంటానని , పోటీలు ఎప్పుడు, ఎక్కడ అనే వివరాలు తెలపాలని కోరింది. దీంతో తమ పథకం పారుతుందని సంతోషించిన దాసు అక్టోబర్ 27 తేదీన గుంటూరు బస్టాండ్ కు రావాలని, అక్కడకు వచ్చి ఫోన్ చేస్తే తామే పోటీల ప్రదేశం వద్దకు తీసుకెళతామని చెప్పారు.