History, asked by udanykiran720, 5 months ago

write about jhansi lakshmi bai in telugu​

Answers

Answered by sachimeshram
3

Answer:

ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు నెల19 న వారణాసిలో విక్రమ నామ సంవత్సరం బహుళ చతుర్దశి నాడు జన్మించింది. తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే మరియు భాగీరథీబాయిలు. వీరిది మహారాష్ట్రలోని సతరా. ఈమె జన్మించిన సంవత్సరం గురించి కూడా భిన్నాభిప్రాయాలున్నవి.. వీళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆమె తల్లి చాలా తెలివైనది మరియు ఆధ్యాత్మిక దోరణి మెండుగా కలది. రాణి అసలు పేరు మణికర్ణిక. ముద్దు పేరు మను. ఝాన్సీ తల్లి ఝాన్సీ నాలుగేళ్ళ ప్రాయంలో ఉండగానే మరణిస్తుంది. ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది.

ఇలాంటి క్లిష్ట సమయంలో బాజీరావు పీష్వా మోరోపంత్ ను బిఠూర్ కు పిలిపించి ఆశ్రయమిచ్చి ఆదుకుంటాడు. బాజీరావుకు సంతానం లేకపోవడంతో నానాసాహెబ్ అనే బాలుని దత్తత చేసుకున్నాడు. నానా సాహెబ్, అతని పినతండ్రి కుమారుడు రావుసాహెబ్ మనూబాయిని తమ చెల్లెలిగా భావించి కలసిమెలసి ఉంటారు. వీరు ముగ్గురూ కలిసే విద్యలన్నీ నేర్చుకున్నారు. కత్తిసాము, గుర్రపుస్వారీ, తుపాకీ పేల్చడం వంటి విద్యలంటే మనూకు మక్కువ ఎక్కువ. ఖడ్గం ధరించి, కళ్ళెం బిగించి గాలి విసురుకు ఉవ్వెత్తుగా ఎగిరే కురులతో గుర్రపు స్వారీ చేస్తూ దూసుకొని పోయేది. లక్ష్మీబాయికి 13 ఏళ్ళ వయసులోనే 1842లో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నెవల్కార్ తో వివాహం జరుగుతుంది. దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయింది. అప్పటి ఆచారాల ప్రకారం మహారాణి అయిన తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయిగా మారుతుంది. 1851లో లక్ష్మీబాయికి ఒక కుమారుడు జన్మిస్తాడు. దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు నాలుగు నెలల వయసులోనే కన్నుమూశాడు. 1853 లో గంగాధర రావుకు విపరీతమైన అనారోగ్యం సోకుతుంది. ఎవరినైనా బిడ్డను ఎవరినైనా దత్తత తీసుకోమని అందరూ సలహ ఇస్తారు. దాంతో ఆయనకు దూరపు బందువైన వాసుదేవ నేవల్కర్ కుమారుడైన దామోదర్ రావు అనే పిల్లవాడిని దత్తత తీసుకుంటారు. కానీ ఆ మరుసటి రోజునే అనగా 1853, నవంబర్ 21 వ తేదీన గంగాధరరావు మరణిస్తాడు.

తర్వాత మూడు రోజులకు బ్రిటీష్ వారు గ్వాలియర్ ను ఆక్రమించుకుంటారు. ఈ యుద్ధం గురించి జనరల్ రోస్ ప్రస్తావిస్తూ విప్లవ కారుల్లోకెల్లా ఆమే అత్యంత ధైర్య సాహసాలతో పోరు సల్పిందని మెచ్చుకుంటారు. దాని వల్లనే ఆమె భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాక 19వ శతాబ్దంలో మహిళా సాధికారతకు ఆదర్శ ప్రాయంగా నిలిచింది.

తరువాత కొన్ని రోజులకే లక్ష్మీబాయి తండ్రి మోరోపంత్ ను బ్రిటీష్ వారు పాశవికంగా ఉరితీస్తారు

Explanation:

hope it helps you!!!!!!!

you can skip unimportant points !!!!

Similar questions