Write about maradha Venkayya
Answers
Answer:భాస్కర శతకము
వికీపీడియా నుండి
భాస్కర శతకము రచించిన మారయ (మారవి) వెంకయ్య కవి 1550-1650 కాలంలో శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతంలో నివశించిన కళింగ కవి. ఆ ప్రాంతంలో ఉన్న అరసవిల్లి సూర్యదేవాలయంలోని సూర్యభగవానుడిని సంబోధిస్తూ భాస్కర శతకము వ్రాశాడు. అందులోని నీతి బోధలవల్ల, కవిత్వ సౌందర్యము వల్లా ఈ శతకము బాగా ప్రాచుర్యము పొందింది. దృష్టాంతాలంకారములు మెండుగా వాడిన మొదటి శతకాలలో ఇది ఒకటి అని విమర్శకుల అభిప్రాయము. ప్రతి విషయాన్నీ చక్కని పోలికతో ఈ కవి వర్ణించాడు.
కొన్ని ఉదాహరణలు:
శ్రీగల భాగ్యశాలిఁ గడుఁ జేరఁగవత్తురు తారుదారె దూ
రాగమన ప్రయాసము కాదట నోర్చియైన నిల్వ న
ద్యోగము చేసి; రత్న నిలయుండని కాదె సమస్త వాహినుల్
సాగరుఁ జేరుటెల్ల ముని సన్నుత మద్గురుమూర్తి భాస్కరా!
ఓ సూర్యభగవానుడా! సాగరుడు రత్ననిలయుడు కనుకనే నదులన్నీ సముద్రములో చేరుటకు పొర్లివచ్చును. అలాగే సదూరప్రాంతాలనుండి కూడ జనులు ధనవంతుని ఆశ్రయిస్తారు.
ఊరక సజ్జనుండొదిగి యుండిననైన, దురాత్మకుండు ని
ష్కారణ మోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా;
చీరలు నూరు అంకములు చేసెడివైనను బెట్టెనుండగాఁ
జేరి చినింగిపోఁ గొఱుకు చిమ్మట కేమి ఫలంబు భాస్కరా!
ఎంతో ఖరీదైన చీరలను పెట్టెలో పెడితే చిమ్మెట పురుగు వాటిని తెగ కొరుకుతుంది. అలాగే మంచివాడు తనమానాన తానున్నా దుష్టుడు పూనుకొని ఏదో హాని తలపెడతాడు.
చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం;
బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడొ నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చు నటయ్య భాస్కరా!
ఎంత గొప్పగా వండినా ఉప్పు లేని కూర రుచించదు. అలాగే ఎంత చదివినా, ఆ చదువు సార ము గ్రహించలేకపోయినట్లయితే ఆ చదువు నిరుపయోగము. ఎవరూ మెచ్చుకొనరు