History, asked by Sravanthiluckky, 1 year ago

Write About Stephen Hawking in Telugu and English​

Answers

Answered by tinalalwani
1

Answer:

IN TELUGU:

స్టీఫెన్ విలియం హాకింగ్ (ఆంగ్లం: Stephen Hawking) 1942-2018 సుప్రసిద్ధ ఆంగ్లేయ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త. ఎమియోట్రోఫిక్ లేటరల్ స్కెర్లోసిస్ అనే నాడీమండలానికి సంబంధించిన జబ్బు వల్ల క్రమక్రమంగా దశాబ్దాల తరబడి అతని శరీరభాగాలు చచ్చుబడుతూ వచ్చినా, తన మెదడు పనిచేస్తూండడాన్ని దన్నుగా ఉపయోగించుకుని కృష్ణబిలాలకు సంబంధించిన అనేక అంశాలు మొదలుకొని సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేశాడు. హాకింగ్ రాయల్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్‌లో గౌరవ సభ్యుడిగా, పాంటిఫికల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో జీవిత కాల సభ్యునిగా ఉన్నాడు. ఆయన అమెరికా అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అందుకున్నాడు. టైమ్స్ పత్రిక వారి 100 మంది అత్యంత గొప్పవారైన బ్రిటీషర్ల జాబితాలో 25వ స్థానం అతనిదే. ఆయన రాసిన ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అన్న పుస్తకం ద బ్రిటీష్ సండే టైమ్స్ బెస్ట్ సెల్లర్ల జాబితాలో 237 వారాల పాటు నిలిచి రికార్డులు బద్దలుకొట్టింది, ఈ పుస్తకపు అమ్మకాలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ స్థానం సంపాదించాయి. శరీరం చాలావరకూ చచ్చుబడిపోయినా ఆయన జీవితాంతం ఒకే ఒక్క దవడ ఎముక కదులుస్తూ, దానికి అమర్చిన సంభాషణలు-ఉత్పత్తి చేసే పరికరం ఉపయోగించి సంభాషించేవాడు. శరీరం కదల్చడానికి కుదరని స్థితిలోనూ ఆయన చేసిన పరిశోధనా కృషి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిని తెచ్చిపెట్టింది.

IN ENGLISH:

Stephen William Hawking CH CBE FRS FRSA (8 January 1942 – 14 March 2018) was an English theoretical physicist, cosmologist, and author who was director of research at the Centre for Theoretical Cosmology at the University of Cambridge at the time of his death.[18][19][8] He was the Lucasian Professor of Mathematics at the University of Cambridge between 1979 and 2009.

Similar questions