English, asked by sravya1785, 9 months ago

write an essay on swach barath in telugu​

Answers

Answered by Anonymous
2

Answer:

మన దేశం సహజ సిద్ధమైన వనరులతో ఎంతో సుందరమైనది. ఇందులో ఏ సందేహమూ లేదు. కొన్ని దశాబ్దాలనించి మనం మన దేశాన్ని , మన చుట్టుపక్కల ప్రదేశాలని చెత్త చెదారాలతో నింపేసి పాడుచేశాం. ఇప్పుడు ఇంక ఈ సమస్యని పరిష్కరించాల్సిన సమయం వచ్చింది.

స్వచ్చ భారతం అనే కార్యక్రమం మన భారత ప్రధాన మంత్రి శ్రీ గౌరవనీయులైన నరేంద్ర మోడి గారు 2014 సం. అక్టోబర్ 2 న మొదలు పెట్టారు. ఇది భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నది. శ్రీ మోడి గారే స్వయం గా ఢిల్లీ లో రోడ్డు ని ఊడ్చి శుభ్రం చేసి అందరికి మార్గదర్శకులయ్యారు. మహాత్మా గాంధి గారు భారత వాసులందరూ శుభ్రం, శుచి మరి ఆరోగ్యం గురించి బాగా తెలుసు కోవాలని, మరియు అశుభ్రం అనారోగ్యానికి కారణాలు తెలుసుకోవాలని ఆశించారు. ఈ కార్యక్రమం గాంధీ గారి కలని నిజం చేయాలని చేపట్టారు. ప్రజలందరూ ఇళ్లని, పరిసరాలని శుభ్రంగా ఉంచుకునే పద్ధతులు వాళ్ళకు తెలియ చెప్పడం కోసం, కొంత వరకూ శుభ్రం చేయడం ఆ మిషన్ ముఖ్యోద్దేశం.

శుభ్రమైన ఇల్లు పరిశుభ్రమైన పరిసరాలు , ఇదే స్వచ్ఛమైన మన భారత దేశం

క్లీన్ ఇండియా కోసం ప్రతి వారం శని , ఆది వారాలలో చాలామంది ప్రజలు, తారలు, గొప్ప వాళ్ళు, ప్రముఖులు రెండు మూడు గంటల సేపు వాళ్ళ ఇంటి చుట్టుపక్కల మరియు జనసమూహం ఉన్న చోట శుభ్రం చేస్తున్నారు. ఈ మిషన్ లో వచ్చే 5 ఏళ్లలో సుమారు 62,000 రూ. ఖర్చు తో దాదాపు 4,౦౦౦ చిన్న పట్టణాలు శుభ్రం చేస్తారు. నిర్మల్ భారట్ అభీయాన్ మిషన్ పల్లెలలో మంచి శుభ్రమైన నీటికోసం మరియు శుభ్రత కోసం పని చేస్తుంది. వాళ్ళు వేలాది టోయిలెట్లు (మరుగు దొడ్లు) అవి లేని ఇళ్ళలోను ఇంకా సామూహిక ప్రదేశాలలోను (మార్కెట్టు, సంత లలో ముఖ్యంగా) కడతారు. వాళ్ళు నగరంలో పొగయ్యే చెత్త ని కూడా తీసేసి శుభ్రం చేస్తారు.

వారానికి రెండే గంటల శ్రమ , అంతే మన అందరి ఆరోగ్యానికి రక్షణ.

మనం ఏం చెయ్యాలంటే, మనం చెత్త ఇక్కడ అక్కడ, ఎక్కడో వేయకూడదు. ఇంకొకళ్ళని వేయనీయకూడదు. ప్రతి వారం రెండే గంటలు మాత్రమే పని చేస్తే చాలు శుభ్రత కోసం. మరి ఈ కార్యక్రమం కోసం చెత్త కుండీలు అవి లేని చోటల్లా పెడుతున్నారు. కొత్తవి కొని ప్రతి కొలోని లోనూ ఉంచుతున్నారు.

ఈ మిషన్ వల్ల సమాజంలో అందరి ఆరోగ్యం బాగుపడుతుంది. జబ్బులు తగ్గుతాయి. మందులు మిగులుతాయి. బీదవాళ్ళ డబ్బులు మిగులుతాయి కూడా. దేశానికి ఖర్చు తగ్గుతుంది, కనుక ఆర్ధిక స్ఠ్ఠితి లో వృద్ధి కనిపిస్తుంది.

పాఠశాల లో చదివే విద్యార్థులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఇందుకోసమని ప్రభుత్వం చాలా పాఠశాల బోర్డు లకు (సి.బి.ఏస్.సి., ఐ.సి.స్.సి., రాష్ట్ర బోర్డు తదితరులకు ) ఉత్తర్వూలిస్తూ ఉత్తరాలు రాసింది. ఆ బోర్డులు తమ పాఠశాలలకు ఉత్తర్వులు ఇచ్చాయి. చాలామంది విద్యార్ధులు చేట, బుట్ట, తట్ట పట్టుకొని చాలా ప్రదేశాలను శుభ్రం చేసారు. మరుగుదొడ్లు లేని 25,000 పాఠశాలల్లో వాటిని నిర్మిస్తారు. పాఠశాలలు చేయాల్సిందల్లా, వాటిని మరియు వాళ్ళ ఆవరణ ని శుభ్రం గా ఉంచకోవడం, అంతే.

పిల్లలు శుభ్రమైన వాతావరణంలో చదువుతూ పని చేయడానికి అలవాటు పడతారు. వాళ్ళకు పాఠాలలో శుభ్రత, ఆరోగ్యం మరియు వాటి లాభ నష్టాల గురించి శిక్షకులు గురువులు బోధిస్తారు. చిత్ర పటాల పోటీలు, మాటల భాషణల పోటీలు, స్లోగెన్ (క్యాప్షన్) పోటీలు, వాచ్య రచనల పోటీలు నిర్వహించి అందరిలో అశుభ్రత నష్టాల గురించి అందరికి తెలిసేలా చేస్తున్నారు.

ఈ పని లో మునిసిపాలిటీ కి చాల ముఖ్యమైన పాత్ర ఉంది. ఎక్కడైతే మునిసిపాలిటీ ఆ పనిని మంచి గా చేయలేకపోతోందో, అక్కడ ప్రైవేటు సంస్థలకో, వ్యక్తులకో ఈ పని అప్పగించితే ఇంకా బాగుంటుంది. శుభ్రంగా ఉండే పల్లెలకు, పాఠశాలకు, నగరాలకి ప్రతి సంవత్సరం బహుమతులు కూడా ఇస్తారు.

మనం చేయాల్సిందల్లా మన టేబులు, గది, ఇల్లు, మరుగుదొడ్డి, ఆవరణ అన్నీ శుభ్రంగా ఉంచుకోవడమే. చాలు. మన పరిసరాలలో చెత్త వేయకుండా చూసుకోవడం మన కర్తవ్యం. మనం చేయడం మరి అందరినీ అలా చేయమని చెప్పడం. మంచి పౌరులు గా నిరూపించుకుందాం. శుభ్రమైన ఇల్లు పరిశుభ్రమైన పరిసరాలు, ఇవే స్వచ్ఛమైన భారతానికి ఆభరణాలు. ఈ స్వచ్చ భారతం నిరాటంకం గా పూర్తి అవుతుంది.

Answered by sravya17
1

Explanation:

essay on swach bharath

మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా గురువారం 2014, అక్టోబర్ 2 న ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 2014 సెప్టెంబరు 24న భారత కేంద్ర కేబినెట్, పట్టణప్రాంతాలలో స్వచ్ఛ భారత్ మిషన్ కు ఆమోదం తెలిపింది. ఈ మిషన్ 2014 అక్టోబర్ 2నుంచి ప్రారంభమై ఐదేళ్ళ పాటు అమలు చేయబడుతుంది.

మిషన్‌ను దేశంలోని 4041 పైగా పట్టణాల్లో అమలు చేస్తారు. మొత్తం ఖర్చు 62,009 కోట్ల రూపాయలలో 14623 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.

ఈ స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని పట్టణాల్లో పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ అమలు చేస్తుంది. గ్రామాల్లో, కేంద్ర తాగునీరు పారిశుద్ధ్య మంత్రిత్వశాఖ అమలు చేస్తుంది

స్వచ్ఛ భారత్ పథకం కింద అందజేసే స్వచ్ఛ సర్వేక్షణ 2017 ర్యాంకులను కేంద్రం విడుదల చేసింది. కేంద్రం ప్రకటించిన ఈ ర్యాంకుల్లో తొలి రెండు స్థానాలు మధ్యప్రదేశ్‌‌లోని నగరాలకు దక్కడం విశేషం. ఇండోర్‌ మొదటి స్థానం, భోపాల్ రెండో స్థానం దక్కించుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నానికి మూడో స్థానం, తిరుపతికి తొమ్మిదో స్థానం దక్కాయి

i hope it will helps you☺

thank u

Similar questions