India Languages, asked by MrT0NY, 15 days ago

WRITE DIFFERENCE BETWEEN

VILLAGE AND CITY IN TELUGU LANGUAGE

Answers

Answered by kalyanchintu831
4

Answer:

పల్లె–నగరం మధ్య తేడాలు:

అందమైన సహజ ప్రకృతి.. పల్లె – కృతకమైన అందాల ముల్లె.. పట్నం.

పల్లె ఆత్మీయతల సంగమం – నగరంలో ఎవరికి వారే ఏకాకి.

పల్లెలో స్వచ్ఛమైన ప్రకృతి – నగరంలో సమస్తం కలుషిత భరితం.

పల్లెల్లోని మనుషుల మనసుల్లో మలినం లేదు – నగరాల్లో కుట్రలు, దగాలు, వంచనలు.

పల్లెల్లో పరిమళించే మానవత్వం – నగరంలో అంతా యాంత్రికత.

పల్లెల్లో డబ్బులేకున్నా పరిచయాలతో పనులు సమకూరుతాయి. నగరంంలో పైసా లేకుండా ఏ పనీ జరగదు.

పల్లెల్లో పరస్పర గౌరవ మర్యాదలు – నగరంలో ఎవరూ ఎవ్వరినీ లక్ష్యపెట్టరు.

నగర జీవికి తీరిక దొరకదు, కోరిక చిక్కదు. ఇక్కడ జీవితం చాలా ఖరీదైంది. ఎంత సంపాదించినా చాలదు. ఎంత డబ్బున్నా అంతకు మించిన విలాసవంతమైన జీవితం ఊరిస్తూ ఉంటుంది. అందుకే ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకొని డబ్బు సంపాదించాలనుకుంటారు. దీంతో తీరిక సమయం దొరకదు. ఏ కోరికలు నెరవేర్చుకోవడానికి అంత కష్టపడుతుంటారో ఆ అవకాశాలు మాత్రం ఎప్పటికీ అందని ద్రాక్షలాగే ఉండిపోతాయి. ఖరీదైన జీవనశైలి ఇక్కడి మనుషులకు పెను సవాలుగా నిలుస్తుంది.

నగర జీవితంలోని ప్రతికూలాంశాలు – కఠిన వర్ణన: జగిత్యాలలో స్వేచ్ఛగా జీవిస్తూ తనకిష్టమైన కవిత్వం, కళారాధనలో హాయిగా గడిపే అలిశెట్టి ప్రభాకర్‌.. నగర జీవితంలో ఇరుక్కుపోయారు. పేదరికాన్ని, దీనస్థితినే కడుపారా అనుభవించిన ఈ యువ కవి తన అనుభవాలను అక్షరాయుధాలుగా చేసి కవితలు రాశారు. అందుకే ఆయన అనుభవాల్లో నగరంలోని ప్రతికూలాంశాలే ఎక్కువగా ఉన్నాయి. అవి ‘సిటీలైఫ్‌’ కవితల్లో ప్రతిఫలించాయి.

నగరంలో జీవన విధానం: నగరంలో మనిషి జీవితం అంతుచిక్కని అయోమయం. కాలుష్యం కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతుంటుంది. నిరంతరం ప్రమాదాల అంచున ప్రయాణం. ఎప్పుడు, ఎక్కడి నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో చెప్పలేం. కాలంతో పోటీపడుతూ ఉరుకులు–పరుగులు పెట్టడం ఇక్కడి ప్రత్యేకత. ఎవరికీ తీరిక చిక్కదు. తీరని కోరికల చిట్టా పెరుగుతూనే ఉంటాయి. సహజమైన ఆనందం దుర్లభం. అంతా కృత్రిమం, యాంత్రికం, వంచనలమయం. అంతుచిక్కని రసాయనశాల లాంటి నగరంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఒకసారి ఈ పద్మవ్యూహం లాంటి నగరంలో ప్రవేశిస్తే బయటపడటం కష్టం.

Am Soumya

10th Stnd

Telangana ,suryapet

Kinda Introvert...xD

N uh??

Attachments:
Answered by xXItzSujithaXx34
0

{\huge{{\tt{\color {blue}{జవాబు}}}}}

పల్లెటూరు కన్నతల్లి ఒడిలాంటిది. మనకు హాయిని ఇస్తుంది. పల్లెటూరి వాతావరణం అమోఘమైనది. ఎటుచూసినా ఆప్యాయంగా పలకరించే వారే! ఒకరితో ఒకరికి విడదీయలేని సంబంధం ఏర్పడుతుంది . ఒకరి కష్టసుఖాలను మరొకరు పంచుకుంటారు. ఎటువంటి కష్టాన్నైనా కలిసి ఎదుర్కుంటారు. సాయంత్రం కాగానే అందరును ఒకచోట కలిసి జరిగిన విషయాలను తలుచుకుంటూ , నవ్వుకుంటూఉ ఆనందంగా గడుపుతారు. పల్లెటూర్లలో కాలుష్యం ఉండదు. ఎటుచూసినా చెట్లు, పొలాలు. చల్లని గాలి మన సేదతీరుస్తుంది. మనసుకి ఉల్ల్లాసాన్ని ప్రశాంతతని ఇస్తుంది. ఊరంతా పచ్చదనంతో వెదజల్లుతూ కళకళలాడుతుంది.

ఇక నగరాల విషయాలికి వస్తే ఇక్కడ ఒకరిని పట్టించుకోవడానికి మరొకరికి తీరిక ఉండదు. ఎవరికీ వారే యమునా తీరే! అన్నట్లు ప్రవర్తిస్తారు. ఒకరికి ఏమైనా మనకు అనవసరం, మనం బాగుంటే చాలు అనే తీరుతో వ్యవహరిస్తారు. సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వరు. నిరన్తరో పనిలో నిమగ్నమయ్యేవారికి లోకపాట్లు గురించి పట్టించుకునే తీరెక్కడుంటుంది. వీలైతే వారాంతంలో కుటుంబంతో గడుపుతారు లేకపోతే లేదు. ఇక్కడి గాలి కాలుష్యం. గాలితోపాటే మనుషుల మనసులు కూడా దురలవాట్లతో త్వరగా కాలుష్యమయ్యే ప్రదేశం ఇదే. ఫ్యాషన్ ఫ్యాషన్ అంటూ సంస్కృతిని పాడుచేసే తీరుకు నాంది పలికే చోటు ఇదే. ఇక్కడ ప్రశాంతతకు చోటు ఉండదు.

పల్లెటూర్లలో మంచి ఆదాయం రాకపోవచ్చు, కానీ మంచి జీవితమైతే దొరుకుంతుంది. దీనిని అర్థంచేసుకోక పట్నాలకు వెళ్లే నాధుడిని కాపాడువారెవరో?

Similar questions