India Languages, asked by dhdjdjnd, 4 months ago

Write down in your own words the hard work your mother puts in for you in telugu​

Answers

Answered by Hemanthvasam123
3

Answer:

అమ్మ...! ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం ఇంకా ఎన్నెన్నో... ఎంత చెప్పినా తక్కువే.. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. కడుపులో నలుసు పడిన నాటి నుంచి నవ మాసాలు ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ‘అమ్మంటే తెలుసుకో, జన్మంతా కొలుచుకో’ అని ఒకరు, ‘ఎవరు రాయగలరూ అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం.. ఎవరు పాడగలరూ అమ్మా అనురాగం తీయని రాగం’అంటూ మరొకరు అమ్మ గొప్పదనాన్ని తన పాట ద్వారా వ్యక్తం చేశారు. అమ్మను మించి దైవం ఉందా? అవును మరి అవతారమూర్తి కూడా అమ్మకు కొడుకే కదా.

అమృతం ఎలా ఉంటుందో తెలియదు గాని అమ్మ ప్రేమ ముందు అది దిగదుడుపే. ఆమె ప్రేమ ఈ ప్రపంచాన్నే మరిపింపజేస్తుంది. ఆ పదానికి అంతటి మహత్మ్యం ఉంది. అంతేకాదు దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక, అమ్మను సృష్టించాడంటారు. ఈ విషయం తెలుసుకోని మనం జన్మనిచ్చి, ఇంతటి వారిని చేసిన దేవతను కళ్ల ముందు ఉంచుకుని, కనిపించని ఆ దేవుడు కోసం గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతాం

Explanation:

Similar questions