Hindi, asked by koushikrk, 1 year ago

write essay on gruha himsa chattam in telugu

Answers

Answered by amira93
4
వేధింపులకు గురవుతున్న మహిళలకు రక్షణ కవచంగా ప్రభుత్వం గృహహింస నుండి మహిళలకు (43/2005 చట్టం) రక్షణ చట్టానికి 2005లో పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఈ చట్టం మాత్రం 2007సం.లో రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది . జిల్లా స్త్రీ, శిశు సంక్షేమశాఖ దీన్ని అమలు చేస్తుంది. ఆ శాఖ జిల్లా పీడీని రక్షణాధికారిగా వ్యవహరిస్తున్నారు. కేసుల నమోదు, బాధితులకు న్యాయ సహాయం చేసేందుకు ఒక కౌన్సెలర్‌తో పాటు న్యాయవాదిని ప్రభుత్వం నియమించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని గుర్తించి, వారిని కోర్టుకు తీసుకెళ్లేందుకు పోలీసు హోంగార్డులను నియమించారు. వివక్షతో కూడిన ఆచారాలు, పద్ధతులు అభిప్రాయాలతో సమాజం లోనే కాకుండా ఇంట్లో కూడా స్ర్తీ, పురుష సంబంధాల్లో అసమానతలు ఏర్పడి గృహహింసకు దారితీస్తున్నాయి. నిత్యం కొందరు మహిళలు గృహహింసకు గురవుతున్నప్పటికి వారు సరైన న్యాయ సలహాలు తెలియక పోవటంతో ఇటువంటివి మరిన్ని పెరిగిపోతున్నాయి. ఈ చట్ట ప్రకారం భార్యలు హింసకు గురైన స్త్రీలు న్యాయం కోసం జిల్లా స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, సిడిపిఓలు, పోలీసు, రెవిన్యూ అధికారిని లేదా న్యాయ సేవా అధికారిని, సేవలందించే సంస్థలు, ఆశ్రయం అందించే సంస్థలు లేదా పోలీస్‌ను సంప్రదించాలి. చట్టపరమైన సహాయం, ఉచిత న్యాయ సేవలు, ఆర్థిక సహాయం, పిల్లల సంరక్షణ, ఆశ్రయం అందించే సంస్థలు వైద్య సహాయం గురించి సమాచారం బాధితురాలి రక్షణ, రక్షణ అధికారి బాధ్యతలు చేపట్టాలి. మెజిస్ట్రేట్‌కు దరఖాస్తు అందిన మూడు రోజుల్లో మొదటి వాదన వింటారు.60 రోజుల్లో తుది తీర్పు ఇస్తారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు అందిన తర్వాత బాధ్యులపై కేసు నమోదు చేయడం, తర్వాత కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో పాటు 60 రోజుల్లో కేసును పరిష్కరించాల్సి ఉంది.

amira93: mark as brainlist plz
Similar questions