write essay on savithri bai phule in telugu....please
Answers
Answered by
13
సావిత్రిబాయి ఫూలే (3 జనవరి 1831 – 10 మార్చి 1897) భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని మరియు రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫులే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆమె ఆధునిక విద్యద్వారానే స్ర్తీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన సావిత్రిబాయి భర్తతో 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది.[1] కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసారు.[2]25 6 2001
amrutha66:
tq
Answered by
0
Essay on Savithri bai Phule in telugu :
Explanation:
- సావిత్రిబాయి ఫులే ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి.
- ఫులే దంపతులు వీరి జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు.
- సావిత్రిబాయి ఫూలే, (1831 జనవరి 3– 1897 మార్చి 10) భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి.
- ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి.
- సావిత్రి బాయి ఫులే పుట్టిన రోజైన జనవరి 03 ను జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము.
Similar questions