India Languages, asked by harshith823, 1 year ago

write the history of Telugu in telugu

Answers

Answered by sap000006
12
మాతృభాష ఏదైనా అది తల్లి తో సమానం.  మనం తల్లిని
ఎంత గౌరవము ఇస్తామో, మన మాతృభాష  ని కూడా అంతే  గౌరవించాలి.  అది తెలుగు
కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హింది  కావచ్చు.
ఎవరి భాష వారికి అది గొప్పది.  మనం తెలుగు భాష తక్కువ అని  అనుకో కూడదు.  తెలుగు భాష
కి చాలా చరిత్ర ఉంది.  తెలుగు భాష  సామాన్యమైన ప్రజల
కోసం క్లిష్టమైన సంస్కృతం నుండి ఆవిర్భవించింది.   అందులో ఎందరో
కవులు, రచయితలు  గ్రంధ కర్తలు
చాలా చాలా రచనలు చేశారు.

 

   మన తెలుగు లో
56 అక్షరాలు ఉన్నాయి. అంటే ఇంగ్లీష్ కన్నా ఎక్కువ శబ్దాలు, పదాలు మనం తెలుగు లో మాట్లాడొచ్చు.  తెలుగు అక్షరాలు పలకడంలో మనకు ఇంగ్లీషు లో ల తికమకలు ఉండవు.  మనలోపలి అనుభూతులను పైకి చెప్పడానికి తెలుగు భాషలో అన్నీ సాధనాలు ఉన్నాయి.  పలికే విధానం బట్టి కూడా మనం  ఎదుటివారికి మన భావం తెలియచెప్పగలగడం తెలుగు లో ప్రత్యేకం.  ఏదైనా విషయం తెలుగులో ఇంగ్లీషు కన్నా క్లుప్తంగా ను , ఇంగ్లీషు కన్నా ఎక్కువ భావసమ్మితం  గాను మనం తెలుగులో చెప్పగలం.

  తెలుగు భాష గొప్పతనం
తెలియాలంటే తెలుగులో సంభాషించాలి.  గొప్పవాళ్లు
రాసిన రచనలు పద్యాలు, గద్యాలు, గేయాలు, కథలు, కవితలు, పల్లెగీతాలు, కూనిరాగాలు, ఇంకా హాస్య రచనలు, విప్లవ రచనలు
, విప్లవ గీతాలు చదవాలి.  ఎన్నిటిలోనూ
వారు చేసే భావ ప్రకటన, కొత్త కొత్త
పదాలు, ప్రాసలు, సంగీతాలంకారాలు, జ్ఞానం, చరిత్ర తెలుస్తాయి.

 

   మన తెలుగు భాష విజయనగర
సామ్రాజ్యం చక్రవర్తి సామ్రాట్టు శ్రీ కృష్ణదేవరాయలు కాలం లో చాలా అభివృద్ధి చెందినది.  తెలుగు భాష లోకి ఎన్నో గ్రంధాలు అనువదింపబడ్డాయి.
నన్నయ తెలుగు లో మొదటి కావ్యం రచించారు.  అందుకని
ఆయనని ఆదికవి అంటారు. కృష్ణదేవరాయల సభలో అష్టదిగ్గజాలు  అని ఎనిమిది కవులుండేవారు . అందులో వికట కవి తెనాలి
రామకృష్ణ, నంది తిమ్మన మొదలైన కవులుండే వారు. శ్రీ రామదాసు
కృతులు , శ్రీ త్యాగరాజ కృతులు , జయదేవుని
అష్టపదాలు ఇలా ఎన్నో గొప్ప రచనలు తెలుగు లో మన కు కనిపిస్తాయి. శ్రీ బమ్మెర పోతన భాగవతం
చదువుతుంటే ఎవరిలోనైనా భక్తి భావం పొంగి పొరలుతుంది.  వేమన శతకం (పద్యాలు) పామరులకు నీతి బోధిస్తుంది.  శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి తెలుగు లోనే చెప్పిన
మాటలు ఎన్నో మహత్వపూర్ణమైనవి.  నండూరి సుబ్బారావు
గారి ఎంకి పాటలు ఎంతో ఆదరాన్ని పొందాయి.  శ్రీ
తాళ్ళపాక అన్నమాచార్యుల కీర్తనలు విని పరవశించని వారు ఎవరూ ఉండరు అంటే అతిశయోక్తి లేదు.

I hope it will help you if you like it please please please mark it as a brainlist answer
Answered by ruthsasi2007
2

Answer:

575 CE నుండి భాషలో మొదటి వ్రాత పదార్థాలు. తెలుగు లిపి 6 వ శతాబ్దపు కాలూక్య రాజవంశం నుండి ఉద్భవించింది మరియు ఇది కన్నడ భాషకు సంబంధించినది. తెలుగు సాహిత్యం 11 వ శతాబ్దంలో రచయిత నన్నయ భట్టా చేత హిందూ ఇతిహాసం మహాభారతం యొక్క సంస్కరణతో ప్రారంభమవుతుంది.

సంగీతం ఆంధ్రాలు, మరియు తెలుగు చాలా కంపోజిషన్ల భాష. ద్రావిడ కుటుంబంలోని నాలుగు సాహిత్య భాషలలో ఒకటైన తెలుగు, భారతీయ భాషలలో ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని ఆక్రమించింది, దాని ప్రాచీనతకు ప్రసిద్ధి చెందింది మరియు దాని మెల్లిఫులస్ నాణ్యతకు చాలా మంది ఆరాధించారు. తెలుగు సాహిత్యం ప్రముఖమైనది…

Explanation:

hope it is helpful

Similar questions