writh about javaharlal nehuru in telugu
Answers
Answer:
జవాహర్ లాల్ నెహ్రూ, (హిందీ: जवाहरलाल नेहरू) (నవంబర్ 14, 1889 – మే 27, 1964) భారత దేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్యపోరాట నాయకుడు. పండిత్‌జీ గా ప్రాచుర్యము పొందిన ఈయన రచయిత, పండితుడు , చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు.
Answer:
పండిట్ జవహర్లాల్ నెహ్రూ 14 నవంబర్ 1889న ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో జన్మించారు. ఆయన తొలి విద్యాభ్యాసం ఇంటి దగ్గర ప్రైవేటు ఉపాధ్యాయుల వద్దే నడిచింది. ఉన్నత విద్యాభ్యాసం కోసం 15 ఏళ్ల వయసులో నెహ్రూ ఇంగ్లండ్కు వెళ్లారు. కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయంలో ప్రకృతిశాస్త్రాలను చదివారు. అనంతరం ఇన్నర్టెంపుల్ అనే పేరున్న ప్రఖ్యాత న్యాయ విద్యాసంస్థలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. విద్యార్థిగా ఉన్న ఈ దశలోనే నెహ్రూ.. విదేశీ పాలనలో మగ్గుతున్న వివిధ దేశాల జాతీయ పోరాటాలను అధ్యయనం చేశారు. నాడు ఐర్లాండ్లో జరుగుతున్న షిన్ ఫెయిన్ ఉద్యమాన్ని ఆసక్తితో గమనించారు. ఈ అనుభవంతో 1912లో స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే ఆయన స్వాతంత్రోద్యమంలోకి చేరారు.
1912లో బీహార్లోని బంకీపూర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు ప్రతినిధిగా నెహ్రూ హాజరయ్యారు. అనంతరం 1916లో మహాత్మాగాంధీని తొలిసారిగా కలిశారు. ఆ తొలి సమావేశంలోనే గాంధీజీ ప్రభావం ఆయనపై అమితంగా పడింది. హోంరూల్ లీగ్ అలహాబాద్ శాఖకు నెహ్రూ 1919లో కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1920లో ఆయన ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో మొట్టమొదటిసారిగా రైతుల ర్యాలీని నిర్వహించారు. అనంతరం ప్రారంభమైన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమం సందర్భంగా 1920-22 మధ్య కాలంలో నెహ్రూ రెండుసార్లు జైలుకు వెళ్లారు.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నెహ్రూ 1923 సెప్టెంబర్లో ఎన్నికయ్యారు. 1926లో ఇటలీ, స్విట్జర్లాండ్, ఇంగ్లండ్, బెల్జియం, జర్మనీ, రష్యా దేశాలలో పర్యటించారు. బెల్జియంలో జరిగిన ” అణగారిన జాతుల మహాసభలకు” భారత కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా హాజరయ్యారు. అదే ఏడాది మద్రాస్లో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో.. దేశస్వాతంత్ర్య సాధనకు పోరాడే సంకల్పాన్ని కాంగ్రెస్ తీసుకోవటంలో నెహ్రూ కీలకపాత్ర పోషించారు. 1927లో రష్యాలోని మాస్కోలో జరిగిన సోషలిస్టు విప్లవం 10వ వార్షికోత్సవాలకు హాజరయ్యారు. 1928లో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా లక్నోలో ఒక ప్రదర్శన నిర్వహిస్తూ బ్రిటీష్ పోలీసుల చేతుల్లో లాఠీ దెబ్బలు తిన్నారు. 29 ఆగస్టు 1928న జరిగిన అఖిలపక్ష కాంగ్రెస్కు నెహ్రూ హాజరయ్యారు. భారత రాజ్యాంగ సంస్కరణలపై తన తండ్రి మోతీలాల్నెహ్రూ రూపొందించిన నివేదికపై ఇతర నేతలతో కలిసి నెహ్రూ సంతకం చేశారు. అదే ఏడాది ”భారత స్వాతంత్ర్య లీగ్ ” అనే సంస్థను స్థాపించి దాని ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్తో సంబంధాలను పూర్తిగా తెంచేసుకోవాలని ఈ సంస్థ డిమాండ్ చేసింది