India Languages, asked by naveenkumarkolla, 2 months ago

రుగాగమ సంధి సూత్రం .wrong answer will be reported.
If you don't know the answer or language please don't say​

Answers

Answered by yakannathokala
2

రుగాగమ సంధి: కర్మధారయంబున ‘పేరాది’ శబ్దాలకు ‘ఆలు’ శబ్దం పరమైనప్పుడు రుగాగమంబగు.

పేరాది శబ్దాలు: పేద, బీద, ముగ్ధ, కొమ, జవ, మనుమ, ఐదవ మొదలైనవి.

ఉదా:

పేద (ర్) + ఆలు = పేదరాలు

పరస్వరానికి ముందు ‘ర్’ కారం చేరి పేదరాలు రూపం వచ్చింది.

మనుమ(ర్) + ఆలు = మనుమరాలు

కర్మధారయంబున తత్సమ పదాలకు ‘ఆలు’ శబ్దం పరమైనప్పుడు అత్వంబునకు ఉత్వంబు రుగాగమవుతుంది.

(తత్సమ శబ్దాలు: ధీర, గుణవంత, ధనవంత, సంపన్న, గంభీర, ధైర్యవంత మొదలైనవి)

ఉదా:

ధీర + ఆలు = ధీరు+ ర్ + ఆలు = ధీరురాలు

గుణవంత + ఆలు = గుణవంతు + ర్ +ఆలు= గుణవంతురాలు

mark me as brainlist

Similar questions