India Languages, asked by BrainlyGood, 1 year ago

Yoga - Uses

Please write an essay about uses of Yoga in Telugu language.

Answers

Answered by kvnmurty
7
లాభాలు:

   యోగా వల్ల మనకేన్నో లాభాలు ఉన్నాయి.  ప్రత్యేకంగా ఎవరైతే ఆటలు ఆడలేరో, ఆడడం కుదరాదో, లావుగా ఉంటారో, ప్రొద్దున్నే బయటకు నడవడానికి కుదరదో , ఏక్షరాసైజ్ చేయలేరో, అనారోగ్యం గా ఉన్నారో,  వారందరికి  యోగా వల్ల చాలా ఉపయోగం ఉంది.  
   
    యోగా వల్ల ఆస్త్మా రొగులకు ఉపశమనం కలుగుతుంది.  యోగా వల్ల మన శారీరిక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం చక్కబడతాయి.  యోగా మన మానసిక శక్తి ని పెంచుతుంది, ఆలోచనా శక్తి ని పెంచుతుంది.  ఏకాగ్రత ను పెంచుతుంది.  అధైర్యాన్ని, కలవరాన్ని, నిద్ర లేమితనాన్ని, వాటివల్ల వచ్చే ఇబ్బందిని ప్రతికూలతని  తగ్గిస్తుంది.  మన శరీరం లోని అవయవాలు, లోపల ఉన్న హృదయం , కాలేయం, గాలి తిత్తులు  ఇలా అన్నీ సరిగ్గా పని చేసేలా చేస్తుంది.

    మనం మానసికం గా ఒక తృప్తి ని పొందుతాం.  మన మెదడుని ఆలోచనను, మనసు ను  అదుపు లో ఉంచుకో గలుగుతాం.   కోపం, అలాంటి భావాలు తొలగి  చల్లబడతాం.  అంతే కాదు కాలు పట్టేయకుండా , నొప్పులు రాకుండా, ఉంటాయి.  యోగా , ప్రాణాయామాలు  రోజు చేసే పురాణ కాలం లో ఋషులు వందల వేల సంవత్సరాలు బ్రతికేవారు. 

   రక్త ప్రసారం చక్కగా జరుగుతుంది.  శరీరం లోని అన్నీ ప్రదేశాలకు  రక్తం సమంగా ప్రసరించి అవయవాలన్నీ ఆరోగ్యం గా పని చేసెట్లు చేస్తుంది  యోగా.   గాలి లోని ఆక్సీజెన్ అన్నీ అవయయాలకు సరిగ్గా అంది అన్నీ శక్తివంతంగా పని చేస్తాయి.  బద్దకం పోతుంది.   ఆయువు పెరుగు తుంది.


యోగా  అంటే

    యోగా మన ప్రాచీన భారత దేశం లో అనాది గా ప్రాచుర్యం లో ఉన్నటువంటి తపస్సు , ధ్యానం చేసేటందుకు సువిధమైన విధి  విధానం.  యోగా లో ఎన్నో ఆసనాలు ఉన్నాయి.  ఆసనం అంటే కాళ్ళు, చేతులు , నడుము, మెడ, తల అన్నీ ఒక్కొక్క స్థ్తితి లో, పొజిషన్ (భంగిమ) ప్రత్యేక విధానం అనుసరించి  ఉంచాలి. ఒక నిముషం నించి అనేక నిముషాల వరకు అలా ఒకే  పోజు (భంగిమ) లో కదలకుండా ఉండాలి.  ఒక్కొక్క ఆసనానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి . వాటికి ఒక నిర్దుష్టమైన  వరుసక్రమం  ఉంటుంది. 

      వేల సంవత్సారాల క్రిందట  మహానుభావులైన  మన ఋషులు  యోగా ని కనిపెట్టారు.  యోగా  ఒక అందమైన కళ.   ఖర్చు లేని  మందు , వైద్యం.  .ఎవరిని ఏది అడుగక్కరలేదు. మనంతట మనం గాలి వెలుతురు చక్కగా వచ్చే చోట ఒక దుప్పటి గాని చాప గాని  పరచి  అరగంట రోజు చేయడమే. 

    యోగా చేసుకోడానికి ఎక్కువ చోటు గాని , పరికరాలు గాని అవసరం లేదు.  ఖాళీ కడుపు తో చేయడం మంచిది.  అన్నం తిన్న తరువాత చేయద్దు.  మన స్నేహితులతో కలిసి యోగా చేస్తే మనకు సంతోషం గా ఉంటుంది.  కాలక్షేపం అవుతుంది.  

    అంతర్జాతీయ సమైక్య రాజ్య సమితి  (UNO) యోగా ని  అంగీకరించి ప్రతి సంవత్సరం 21,జూన్ న  అంతర్జాతీయ యోగా దినం గా ప్రకటించింది.  ఇప్పటికీ అపుడే రెండు యోగా దినాలు గడిచేయి.  లక్షలాదిమంది  సామూహికంగా యోగా చేశారు.  ప్రపంచం లో అందరూ  యోగా కి జోహార్లు అర్పించారు.  

  యోగా ఆసనాలు నెమ్మదిగా చేయాలి. గాలి ఎక్కువగా పీల్చాలి, లోపల పట్టి ఉంచాలి.  తరువాత నెమ్మదిగా వదలాలి.  ప్రాణాయామం అంటే ఇదే.  చాలామంది గురువులు ఇంకా పతంజలి గారు యోగా ని కనిపెట్టి అందులో ఆసనాలు తయారు చేసి అవి గ్రంథాలలో నో ఫలకాలలోనో పొందు పరిచారు.  బుద్దుడు , ఇంకా జైన మాట గురువులు కూడా యోగాసనాలు పాటించి, మెళకువలు తెలిసి యోగని అభివృద్ధి చేశారు.


       బమ్ చికి  బమ్ చికి  చేయి యోగా   , ఒంటికి యోగా మంచి దేగా ,   అన్నాడు  ఒక మహా కవి అందరికీ అర్ధం అయ్యే భాషలో.

         

kvnmurty: please click on thanks box/link above
kvnmurty: select brainliest answer
Answered by ankushkumar14043
0

Answer:

I HOPE IT HELP YOU

PLEASE MARK ME BRAINLIEST

Explanation:

యోగా శరీరానికి దివ్యౌషధం. అయితే, యోగా చేయడం కొన్ని నియామాలు పాటించాలి. అప్పుడే అనుకున్న ఫలితాలు వస్తాయి. ఆ నియామాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

yoga

yoga

యోగా.. శరీరానికి యోగాసనాలు మేలు చేస్తాయని తెలుసు. అయితే, యోగా చేస్తున్నామని ఎలా పడితే అలా చేయకూడదు. వాటికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆసనాలు వేసే ముందు తీసుకోవాల్సిన ఆహారం, జాగ్రత్తలపై అవగాహన ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే అనుకున్న ఫలితాలు వస్తాయి. లేకపోతే ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

యోగా ముందు ఆహారం, నీరు..

యోగా చేసే ముందు ఆహారం విషయంలో జాగ్రత్త చాలా అవసరం. మామూలుగా ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాత యోగా చేయాలి. అంతే కానీ, ఆహారం తీసుకున్న వెంటనే యోగా చూయకూడదు ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. అదే విధంగా తీసుకునే ఆహార పరిమాణం విషయంలోనూ ఖచ్చితమైన అవగాహన ఉండాలి. సుష్ఠుగా భోజనం చేసి యోగా చేయడం సరికాదు. కాబట్టి.. భోజనానికి, యోగా చేసేందుకు మధ్య సమయం ఉండేలా చూసుకోండి. మరీ ఆకలి అనుకుంటే యోగా చేసే ఓ అరగంట ముందు చిన్న పండు తీసుకోవచ్చు. దీనితో పాటు నీరు తాగే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆసనాలు వేసే ఓ అరగంట ముందు చిన్న గ్లాసు నీరు తాగొచ్చు. అంతకు మించి తాగకూడదు. అయితే, యోగా చేస్తున్న సమయంలో దాహం వేస్తే మధ్య మధ్యలో కొన్ని కొన్ని నీరు తాగొచ్చు. ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించాలి. యోగా చేయడంవల్ల శరీరంలో పెరిగిన రక్తప్రసరణ నెమ్మదిస్తుంది.

యోగా అలానే మొదలు పెట్టకూడదు. ఖచ్చితంగా ముందుగా శ్వాస ప్రక్రియలు, ప్రాణాయామంతో మొదలుపెట్టాలి. ఇలా చేస్తే.. యోగా ఎక్కువ సమయం చేయొచ్చు. అందులోని ఎక్కువ ఫలితాలను మనం పొందొచ్చు. కాబట్టి ఆ విధంగా చూసుకోండి. ముందుగా ప్రాణాయామంలో శ్వాసపై ధ్యాస పెట్టండి. మనం ఎక్సర్‌సైజెస్ చేసేటప్పుడు వార్మప్ ఎలానో యోగాలో ఈ ప్రాణామాయాలు అలాంటివే. ఇలా చేయడం వల్ల ఆసనాలన్నీ అలుపు లేకుండా చేయొచ్చు.

యోగా చేసే ప్రదేశం..

అదే విధంగా.. యోగా ఎక్కడ పడితే అక్కడ చేస్తే అనుకున్న ఫలితాలు రావు. నిశ్శబ్ధమైన ప్రదేశంలోనే యోగా సాధన చేయాలి. వీటితో పాటు.. తొందర తొందరగా, ఆదరాబాదరాగా ఆందోళనతో యోగా చేయకూడదు. నెమ్మదిగా, మనసు ప్రశాంతంగా ఉంచుకుని యోగాభ్యాసం చేయడం మంచిది. యోగా ముగిసిన అనంతరం కూడా అదే ప్రశాంతతో శవాసనం వేయాలి. ఇలా వేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.

యోగా ప్రారంభంలో..

యోగా ఆసనాలు ప్రారంభించినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అడ్డంకులు దరిచేరతాయి. దీనివల్ల అంతరాయం కలుగుతుంది. అయితే, వాటికే ఇబ్బందిగా అనిపించి యోగాని మధ్యలో ఆపేయకూడదు. దృఢ సంకల్పంతో సాధన చేయాలి. అసలు ఆ అడ్డంకులు ఏంటి? వాటిని ఎలా అధిగమించాలో ఇప్పుడు చూద్దాం.

చాలా మందికి యోగా చేయాలని కోరిక ఉంటుంది.. అయితే, ఆచరణలో వచ్చేసరికి ప్రతీరోజూ రేపట్నుంచీ అంటూ ఓ దాటవేత ధోరణిని చూపుతారు. అలా కాకుండా ఈ రోజు నుంచే చేయాలి అని పట్టుదలని పెంచుకోండి. రోజు రోజుకీ యోగాసనాలు చేయడం ఆలస్యం అవుతుందని గుర్తు పెట్టుకోండి. దాని వల్ల మీరు ఏం కోల్పోతున్నారో తెలుసుకోండి. దీని వల్ల ఎప్పటికప్పుడు మీలో చేయాలనే కసి పెరుగుతుంది.

కొన్ని సందేహాలు..

కొంతమంది ఏం చేయాలి.. ఎలా చేయాలని అలా ఆలోచిస్తూ ఉండిపోతారు. కానీ, అలా కాకుండా చేస్తూ పోవాలి. ఏవైనా అనుమానాలు వస్తే యోగా గురించి తెలిసిన వాళ్లని ఆరా తీయడం లాంటివి చేయడం, లేదా ఎక్స్‌పర్ట్స్‌ని కలిసి సందేహాలు తీర్చుకోవడం చేయండి. అంతేకానీ, అదే సాకుతో ఆసనాలు చేయడంలో అలసత్వం చేయొద్దు.

ఇక యోగ సాధనలో ఆలస్యం, సోమరితనం ఎప్పుడూ ఉండకూడదు. రేపు, చూద్దాం, చేద్దాం కంటే చేయడం ముఖ్యం. ఈ విషయం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. టైమ్ బాలేదు..అంటూ సాకులు చెబుతూ ఉన్న టైమ్‌ని వేస్ట్ చేసుకోవద్దు.

అదే విధంగా.. అనారోగ్యంగా ఉన్న సమయంలో ఆసనాల జోలికి వెళ్లకపోవడం మంచిది. జ్వరం, దగ్గు, నీరసం, తలనొప్పి ఉన్న సమయాల్లో ఆసనాలు వేస్తే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి ఆ సమయంలో యోగా చేయొద్దు.

ఇక యోగా చేసే సమయంలో గ్యాడ్జెట్స్‌కి దూరంగా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా మొబైల్‌కి దూరంగా ఉండండి. ఎందుకంటే దాని వల్ల మీ కాన్సట్రేషన్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎవరైనా మెసేజ్ చేశారా? కాల్ చేశారా అంటూ చెక్ చేసుకోవడమే సరిపోతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది.

వీటితో పాటు సోషల్ మీడియా అంటూ అటూ సమయాన్ని వేస్ట్ చేయకండి. చేసే కాస్తా సమయమైనా కుదురుగా ఉండి చేసుకోండి. దీని వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

కొంతమంది టీవీని మ్యూట్ చేసి దాని ముందు కూర్చుని యోగా ఆసనాలు వేస్తుంటారు. అది ఎప్పుడు కూడా మంచిది కాదు. టీవీలో వచ్చే ప్రోగ్రమ్స్‌పై మనసు మళ్లితే మనం సరిగా కాన్సట్రేషన్ చేయలేం. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.

Similar questions