World Languages, asked by narrakoushikreddy, 1 year ago

ప్రగతి మార్గకులని ఎవరిని అని అన్టారు ఇటలంటి వారి పేర్ల కొనీ చెప్పన్థ సమాజానికి అవసరం ఏమిటి​

Answers

Answered by Umar1324
10

Answer:

hope it's helpful to you mark as branliest and follow me

Explanation:

మానవ ప్రగతి – మహిళ . ప్రకృతి

maanava pragati divided by mahiLa dot prakRti

పెద్దలందరికి నమస్కారం.

ఇంత మంది నిపుణులు నిష్ణాతులు సమవేశ మైన ఈ వేదిక మీదకు నన్ను ఆహ్వానించారంటే ,

బహుశా పల్లెలతో నాకున్న సజీవ సంబంధమే కారణం కావచ్చు.

ఎంతో ఆదరం తో నన్ను ఆహ్వానించిన Dr కాత్యాయని గారికి ధన్యవాదాలు.

నాకున్న పరిమితులలోనే, నాకు తెలిసిన చిన్న విషయాలను కొన్ని మీతో పంచుకొనే ప్రయత్నం చేస్తాను.

***

మానవ ప్రగతి గురించి మాట్లాడ వలసినప్పుడల్లా…

మన శాస్త్రీయ ప్రగతి గురించి.. సాంకేతిక విజయాల గురించి … మనం ఎంతో సంతోషంతో మాట్లాడు కొంటాం.

ఒక్క రవ్వ అతిశయం తో కూడా మాట్లాడుకోగలం.

మానవ ప్రగతి గురించి చర్చించ వలసి నప్పుడల్లా…

ఆర్ధిక స్థిరత గురించి…సామాజిక భద్రత గురించి … వివరం గానే చర్చించుకొంటాం.

ఒకింత తీవ్ర స్థాయి లోనే విశ్లేషించుకో గలం.

మహిళల గురించి మాట్లాడ వలసి వచ్చినా.. .చర్చించ వలసి వచ్చినా..అంతే.

ప్రకృతి గురించి కూడా అంతే.

మానవ ప్రగతి ని మహిళ తోనూ ప్రకృతి తోనూ భాగించే ప్రయత్నం ఈ నాటి సమావేశం లో జరుగుతున్నది.

ఇది ఎంతో ప్రత్యేకమైన విషయం .

ఎందుచేతనంటే … మానవ ప్రగతి, మహిళ ,ప్రకృతి .. ఈ మూడు అంశాలు వేటికవే విడి విడి గా ఆలోచించ వలసిన విషయాలు కావు. అవినాభావమైన విషయాలు. విడదీయలేన0తగా ఒక దానిలో ఒకటి అల్లుకుపోయిన విషయాలు.

అందుకే,

ఈ మూడింటికి నడుమన ఉన్న సంబంధం విభాజ్యమైనది కాదు. భాగఫలం ఏదైనా ఈ సమావేశం

సశేషం కాగలదని మనం ఆశిద్దాం.

ఇంతటి ముఖ్యమైన సమావేశం లో, ఈ విషయం పై నాకు తెలిసిన కొన్ని విషయాలను

మీ వంటి పెద్దలు విజ్ఞుల ముందు పంచుకొనే అవకాశం ఇచ్చి నందుకు

మరొక్క మారు మీ అందరికి నా ధన్యవాదాలు.

*

ఈ మధ్య తరుచు గా వింటున్నాం ..పతాక శీర్షికలలో చదువుతున్నాం.

” ఫలాన ప్రాజెక్టుకు పర్యావరణ అడ్డంకులు తొలగి పోయాయి“

“ఫలాన ప్రగతి కార్యక్రమానికి పర్యావరణ ఉద్యమకారులు అడ్డుపడుతున్నారు“

“పర్యావరణ ఉద్యమాలు దేశ ప్రగతి ని అడ్డుకొనేందుకు విదేశీ శక్తులు పరోక్షం గా పన్నిన కుట్రలు“

మరో వైపున …

మనలో బోలెడంత పర్యావరణ స్పృహ … . ముఖ్యం గా పిల్లల పా ఠాల్లో పెద్దల మాటల్లో.

ఇవన్నీఎందుకు ప్రస్తావించ వలసి వచ్చిందో మీకు అర్ధమై ఉంటుంది.

పర్యావరణాన్ని గురించి ..మాట్లాడాలంటే మనలో కలిగే ద్వైదీ భావం ఇదీ.

ఎవరికైనా… ఆర్దిక పరమైన ప్రగతి కనబడేంతగా

ఆ ఆర్ధిక ప్రగతి బాటలో కొల్పోయిన ప్రాకృతిక సంపద కనబడదు.

లాభనష్టాల బేరీజులో ఆర్ధిక లాభాల వెలుగుల మిరుమిట్ల లో ప్రాకృతిక నష్టాల చీకటి కంటికి ఆనదు.

భారీ జలాశయం కలిగించే ఉద్వేగం ముందు, ఆ మడుగున దాగిన లక్షలాది ఎకరాల అడవి , అందులొనే నిక్షిప్తమై కనుమరుగైన అమూల్య జీవ సంపద సహజం గానే గుర్తుకు రావు .

““ప్రగతి పథం లో ధృఢం గా స్థిరం గా ధైర్యం గా అడుగు వెయాలన్న దేశ సంకల్పానికి ఇది చిహ్నం !” భాక్రా నంగల్ ప్రారంభోత్సవ సమయంలో నెహ్రూ లో కలిగిన ఉద్వేగమే ఎవరికైనా కలుగుతుంది.

Similar questions