English, asked by upendaru25, 9 months ago

సంధులు సంధులు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి వాటి ఉదాహరణ సంధులు ఎన్ని ఉన్నాయి వాటి ఉదాహరణ​

Answers

Answered by jack6778
22

  <bullet>

తెలుగులో సంధి అనగా : పూర్వ పరస్వరంబులకుం బరస్వరం బేకాదేశంబగుట సంధియనం బడు.

వివరణ :పూర్వస్వరం మరియు పరస్వరం కలిసేటప్పుడు పూర్వస్వరం లోపించి పరస్వరం ఒకటే మిగులుతుంది.దీనిని సంధి అంటారు.

ఉదా : అతడిక్కడ= అతడు+ఇక్కడ ఇందులో అతడు పూర్వపదం. ఇక్కడ అనునది పరపదం లేదా ఉత్తర పదం. పూర్వపదంలోని చివరి అక్షరం డులో ఉకారం ఉంది. (డ్+ఉ=డు) ఈ ఉకారమే పూర్వస్వరం.

ఇకపోతే ఇక్కడ అనేది పరపదం.ఇది ఇ అనే హ్రస్వక్షరంతో మొదలయింది.ఇదే పరస్వరం.

ఇట్లా ఈ పూర్వస్వరం పరస్వరం రెండూ కలిసేచోట సంధి ఏర్పడి పూర్వస్వరం పోయింది.పరస్వరం ఒక్కటే మిగిలింది.

అతడిక్కడ

అతడు+ఇక్కడ (పూర్వపదం+పరపదం)

అతడ్+ఉ+ఇక్కడ (పూర్వస్వరం ఉ)

అతడ్+ఇక్కడ (పూర్వస్వరం లోపించింది)

అతడ్+ఇక్కడ (పరస్వరం మిగిలింది)

అతడి+క్కడ (పరస్వరం, పూర్వస్వరం స్థానంలో చేరింది)

అతడిక్కడ (పదాలు రెండూ పరస్వరంతో ఒకే పదంగా మారాయి)

ఇదే సంధి ప్రాథమిక సూత్రం.

సంధి అనగా రెండు పదముల కలయిక. మొదటి పదములోని చివరి అచ్చు పోయి రెండవ పదములోని మొదటి అచ్చు వచ్చిన సంధి అగును.

ఉదా: రాముడు + అతడు = రాముడతడు. ఇందులో ' రాముడు ' మొదటి పదము అతడు రెండో పదము. మొదటి పదమైన ' రాముడు ' లోని ఉకారము పోయి రెండవ పదములోని ' అ ' కారము వచ్చింది.

రాముడు + అతడు = రాముడతడు అయినది.

సంస్కృతంలో సంధి అనగా రెండు అచ్చుల కలయిక.

పూర్వ పర వర్ణాలు రెండు పూర్తిగా కలిసిపోవడాన్ని సంధి అంటారు.

మరికొన్ని ఉదాహరణలు:

1.రామ+అయ్య=రామయ్య, 2.మేన+అత్త=మేనత్త.

వర్ణాలబట్టి సంధులు రెండు రకములు: 1.అచ్సంధి, 2.హల్సంధి.

భాషనిబట్టి సంధులు రెండు రకములు: 1.సంస్కృత సంధులు, 2.తెలుగు సంధులు.

Answered by Ntgmmmm
2

Explanation:

Samskrutha sandhulu

1.సవర్ణదీర్ఘ సంధి - ఆ,ఇ,ఉ,ఋ లకు సవర్ణములగు అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘములు ఏకాదేశంబగును. ఉదా - రాజు + ఆజ్ఞ = రాజాజ్ఞ,ముని + ఇంద్ర = మునీంద్ర

2.గుణసంధి - అకారమునకు ఇ,ఉ,ఋ లు పరమయినపుడు ఏ,ఓ,ఆర్ లు ఏకాదేశముగా వచ్చెను. ఉదా - దేవ + ఇంద్ర = దేవేంద్ర, రాజ + ఋషి = రాజర్షి

3.వృధ్ది సంధి - అకారమునకు ఏ,ఐలు పరమైన ఐ కారమును ఓ,ఔ లు పరమైన ఔ కారమును ఏకాదేశముగా వచ్చును. ఉదా - ఏక + ఏక = ఏకైక,దేశ + ఔన్నత్యము = దేశౌన్నత్యము

4.యణాదేశ సంధి - ఇ,ఉ,ఋ లకు అసవర్ణములగు అచ్చులు పరమగునపుడు వరుసగా య,వ,ర ఔ ఆదేశముగా వచ్చెను. ఉదా - అతి + అంతము = అత్యంతము, మను + అంతరము = మన్వంతరము

5.అనునాశిక సంధి - క,చ,ట,త,ప లుకు స,మ లు పరమైనపుడు వరుసగా జ,ణ,జ్ఞ,మ లు వికల్పముగా ఆదేశమగును ఉదా - వాక్ + మయము = వాజ్మయము

6.శ్చత్య సంధి - స,త,థ,ద,ధ,స లకు శ,చ,చ,జ,ఝ,జ్ఞ లు పరమైనపుడు వరుసగా జ్ఞ,ణ,మ లు వికల్పముగా ఆదేశంగును. ఇదా - మనస్ + శాంతి = మనశ్శాంతి,జగత్ + జనులు = జగజ్జనులు

7. విసర్గ సంధి - విసర్గమునకు శ,ష,స లు పరమైనపుడు వరుసగా శ,ష,స లు ఆదేశబగును ఉదా - చతు + శతాబ్దములు = చతుశ్శతాబ్దములు

Telugu sandhulu

1.అకార సంధి - అత్తునకు సంధి బహుళము. ఉదా - మేన + అత్త = మేనత్త, రామ + అయ్య = రామయ్య

2.ఇకార సంధి - ఏమ్యాదుల ఇత్తునకు సంధి వికల్పము ఉదా - ఏమి + అంటివి = ఏమంటివి

3.ఉకార సంధి - ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యము. ఉదా - రాముడు + అతడు = రాముడతడు

4. యడగమ సంధి - సంధిలేని చోట స్వరంబుకంటే పరంబయిన స్వరంబునకు యడాగమంబగు రెండు అచ్చులకు సంధి జరగనపుడు వాని మధ్య 'య్' అనునది ఆగమముగా వచ్చును.

5.ఆమ్రేడిత సంధి - అచ్చునకు ఆమ్రేడితము పరమగునపుడు సంధి తరచుగానగును. ఉదా - కడ + కడ = కట్టకడ, ఏమి + ఏమి = ఏమేమి, మొదట + మొదట = మొట్టమొదట

6.త్రిక సంధి - ఆ,ఈ,ఏ,యను సర్వనామములకు త్రికమని పేరు. ఉదా - ఈ + త్తనవు = ఈత్తనువు.

7.గసడదవాదేశ సంధి - ప్రదము మీది పరుషములకు గ,స,డ,ద,వ లు బహుళములగును. ఉదా - రాజ్యము + చేయు = రాజ్యముసేయు, వాడు + వచ్చె = వాడొచ్చె

8.పుంప్వాదేశ సంధి - కర్మధారయ సమాసమున సువర్ణమునకు పుంపు లగును. ఉదా - సరసము + మాట = సరసపుమాట

9.రుగాగమ సంధి - పేదాదుల కాలు పరమయినపుడు రగాగము వచ్చును. ఉదా - పేద + ఆలు = పేదరాలు

10.పడ్వాది సంధి - పడ్వాదులు పరమగునపుడు సువర్ణమునకు లోప పూర్ణబిందువులు వికల్పములగును. ఉదా - భయము + పడు = భయపడు

11.టుగాగమ సంధి - కర్మధారయ సమాసమునందు ఉకారాంత పదమునకు అచ్చు పరమైనపుడు టుగాగమంబగు. ఉదా - చిగురు + ఆకు = చిగురుటాకు, పండు + ఆకు = పండుటాకు

12.సుగాగమ సంధి - షష్టీ తత్పురుష సమాసమునందు ఉకార ఋకారాంత శబ్దములకు అచ్చు పరమగునపుడు సుగాగమము వచ్చును. ఉదా - చేయి + అతడు = చేయునతడు

13. ప్రాతాది సంధి - సమాసములందు ప్రాతాదుల తొలి అచ్చుమీది వర్ణములకెల్ల లోపంబు బహుళముగానగును ఉదా - ప్రాత + ఇల్లు = ప్రాత యిల్లు

14. ఆమ్రేడిత సంధి - అచ్చునకు ఆమ్రేడితము పరమయునపుడు సంధి తరచుగానగును. ఉదా - ఏమి + ఏమి = ఏమేమి

15.ద్రుత సంధి - ద్రుత ప్రకృతికముల మీద పరుషములకు సరళమగును. ఉదా - పూచెను + కలువలు = పూచెను గలువలు

16.ము వర్ణలోప సంధి - లు,ల,న లు పరమగునపుడు ము వర్ణమునకు లోపంబు తత్పూర్వస్వరమునకు ధీర్ఘము విభాషమగు. ఉదా - పొలము + లు = పొలాలు.

17.ద్విగు సమాస సంధి - సమానాధికారణంబగు ఉత్తరు పదంబు పరంబగునపుడు మూడు శబ్దములలో డు వర్ణమునకు లోపంబగును. మీది హాల్లునకు ద్విత్వంబగును. ఉదా - మూడు + లోకములు = ముల్లోకములు

18.బహువ్రిహి సమాస సంధి - బహువ్రీహిని స్త్రీ వాచ్యంబునగుచో ఉపమానంబు మీది మేనునకు జొడి అగును ఉదా - అలరు + మేను = అలరు జొడి

19.అల్లోప సంధి - అది, అవి శబ్దముల అకారమునకు సమాసమున లోపము బహుళముగానగు. ఉదా - నా + అది = నాది

20.దుగాగామ సంధి - నీ,నా,తన శబ్దములకు ఉత్తర పదము పరమగునపుడు దుగాగమము వికల్పముగా వచ్చును. ఉదా - నీ + చూపు = నీదు చూపు

21.డు వర్ణలోన సంధి - సమానాధికరణంబగు ఉత్తరపదంబు పరంబగునపుడు మూడు శబ్దములోని డు వర్ణమునకు లోపంబగును. మీది హల్లునకు ద్విత్వంబును విభాషనగు. ఉదా - మూడు + లోకాలు = మూడు లోకాలు

Similar questions