గ్రామ అభివృద్ధిలో విద్య పాత్ర
Answers
hi I'm from Andhra
హోమ్ / విద్య / పధకాలు మరియు స్కీములు / పాఠశాల విద్యాభివృద్ధి - సామాజిక బాధ్యత
పంచుకోండి
చూపుము ఎడిట్ సూచించండి విషయ రచన భాగస్వామి
స్థితి: సవరణ కు సిద్ధం
పాఠశాల విద్యాభివృద్ధి - సామాజిక బాధ్యత
CONTENTS
73వ రాజ్యాంగ సవరణ
ఉచిత, నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం – 2009
రాజీవ్ విద్యా మిషన్ (ఎస్. ఎస్.ఎ) - లక్ష్యాలు
రాజీవ్ విద్యా మిషన్ (ఎస్. ఎస్.ఎ) లో అమలుతున్న కార్యక్రమాలు
పాఠశాలలు అందుబాటు
బడిఈడు పిల్లల నమోదు మరియు నిలకడ
గుణాత్మక విద్య సాధించాలంటే.....?
పాఠశాలలకు అందజేసే వివిధ గ్రాంట్లు – నిధుల వినియోగం – మార్గదర్శకాలు
బాలికల విద్య
బడి బయటి పిల్లలకు విద్యావకాశాలు
పాఠశాల భవన నిర్మాణాలు
ప్రత్యేకావసరాలు గల పిల్లలకు విద్యావకాశాలు
పాఠశాల అభివృద్ధి మరియు గుణాత్మక విద్యాసాధనలో ప్రజల భాగస్వామ్యం
పాఠశాల సమగ్రాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం సందేహాలు – సమాధానాలు
అందరికీ విద్య
పిల్లలందరికీ విద్యనందించడం మనందరి సామాజిక బాధ్యత. సమాజంలోని ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే దేశం – అభివృద్ధి చెందుతుంది. తమ పిల్లలు బాగా చదువుకుని ఎదగాలని, ప్రయోజకులు కావాలని ప్రతి తల్లి, తండ్రి కోరుకుంటారు. అలాంటి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు పాఠశాల విద్యాభివృద్ధిలో భాగస్వాములైతే ప్రాధమిక విద్య అన్ని విధాలుగా అభివృద్ధి చెందడమే గాక విద్యా ప్రమాణాలు మెరుగవుతాయి.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 ప్రకారం 6 – 14 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించవలసిన బాధ్యత ప్రభుత్వంతో పాటు మనందరిపైన ఉంది. అలాగే 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం ఆర్టికల్ 21 ఎ విద్యను ప్రాథమిక హక్కుగా పరిగణించాలని నిర్దేశించడమైనది. ఆర్టికల్ 51 ఎ ప్రకారం దేశంలోని ప్రతి తల్లి / తండ్రి లేదా సంరక్షకుడు తమ పిల్లలకు 6 నుండి 14 సంవత్సరాల వయస్సులోని వారందరికీ విద్యావకాశాలు కల్పించటం ప్రాథమిక విధిగా పేర్కొనబడినది. దీనిలో భాగంగానే 6 – 14 సంవత్సరాల వయస్సులోని బాలలందరికీ విద్యను అందించడానికి ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం, 2009 ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చట్టం ఏప్రిల్ ఒకటి 2010 నుండి భారతదేశమంతటా (జమ్ముకాశ్మీర్ మినహా) అమలులోకి వచ్చింది.
విద్యాహక్కు చట్టం అమలు ద్వారా పిల్లలందరికీ విద్యావకాశాలు కల్పించుటకు మరియు సార్వత్రిక ఎలిమెంటరీ విద్యా సాధన కోసం భారత ప్రభుత్వం సర్వ శిక్షా అభియాన్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తొంది. ఈ కార్యక్రమాల అమలుకు సహకరించి ఎలిమెంటరీ విద్యాసాధనకు మనవంతు కృషి చేద్దాం.
భారతదేశంలో విద్య వేల సంవత్సరాల పూర్వంనుండి తన వైభవాన్ని కలిగి ఉంది. ప్రాచీన కాలంలో నలంద, తక్షశిలమొదలగు విశ్వవిద్యాలయాలను పరిశీలిస్తే, భారత్ లో విద్య, విజ్ఞానము సర్వసాధారణమని గోచరిస్తుంది. నేడు, ఐఐటీ లు, ఐఐఎస్ లు, ఐఐఎమ్ లు, ఏఐఐఎమ్ఎస్, ఐఎస్ బిలుప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినవి. భారతదేశంలో విద్య, 100% సాధించేందుకు ఓ సవాలుగా తీసుకొని ముందుకు పోతూ ఉంది. భారతదేశంలో అవిద్య లేదా నిరక్షరాస్యత అభివృద్ధికి పెద్ద అడ్డుగోడలా తయారైంది. నిరక్ష్యరాస్యతకు పేదరికం జీవాన్నిస్తూవుంది. పేదరికం, సామాజిక అసమతుల్యతల మూలంగా, సహజవనరులను సరైన ఉపయోగించే విధానాలు లేక, విద్యకొరకు అతితక్కువ బడ్జెట్ కేటాయించడంవల్ల, ప్రాథమిక విద్య పట్ల నిర్లక్ష్య వైఖరి వలన, నిరక్ష్యరాస్యత వెక్కిరిస్తూవున్నది. కేరళ లాంటి రాష్ట్రాలలో అక్షరాస్యతస్థితులను చూసి భారతదేశంలో విద్య పట్ల కొంచెం ఆశ చిగురిస్తుంది. భారత్ లో మానవవనరుల అభివృద్ధి శాఖ, ఉన్నత విద్యా శాఖ, పాఠశాల విద్య మున్నగు శాఖలు విద్య కొరకు పాటుపడుతున్న సంస్థలు. విద్య కొరకు, సరైన పెట్టుబడులు, బడ్జెట్ లు లేని భారత్, ఇతరదేశాలనుండి, నేరుగా పెట్టుబడులు ఆహ్వానించేందుకు సిద్ధమవుతోంది