సావిత్రి గారు రాసిన బందిపోట్లు కవిత పై అభిప్రాయం
Answers
కవిత :
“పాఠం ఒప్పజెప్పకపోతే పెళ్లి చేస్తాన”ని
పంతులు గారన్నప్పుడే భయమేసింది.
“ఆఫీసులో నా మొగుడున్నాడు!”
అవసరమొచ్చినా సెలవివ్వడ”ని
అన్నయ్య అన్నప్పుడే అనుమానమేసింది.
“వాడికేం మగమహారాజు” అని
ఆడా మొగా వాగినప్పుడే అర్థమైపోయింది.
“పెళ్ళంటే పెద్ద శిక్ష” అనీ
“మొగుడం”టే స్వేచ్చా భక్షకుడనీ
మేం పాలిచ్చి పెంచిన సగమే
మమ్మల్ని విభజించి పాలిస్తుందనీ!
అభిప్రాయం :
సావిత్రిగారు రచించిన చాలా వరకు రచనలు అన్ని ఆమె నిధనం తోనే మాయమైపోయాయి. ఇది ఒక్కటి తప్ప. ఈ కాలం వారికి సావిత్రి గారిని పరిచయం చెయ్యాలంటే ఈ కవితతోనైనా లేక పాత సినిమాలలో ఆమె నటనలను చూపించి పరిచయం చేయవచ్చు.
ఈ కవితలో ఆమె పెళ్లి అంటే ఒక శిక్ష అన్నది కళ్ళకు కట్టినట్లుగా చెప్పింది. ఆమె జీవితాన్ని నాశనం చేసింది జెమినీ గణేశన్ తో ఆమె పెళ్లి. ఆమె లాగానే ఈ లోకం లో చాలా మంది స్త్రీలు తమ దాంపత్య జీవితంలో ఎంతో హింసలు అనుభవిస్తున్నారు. అందరును అని చెప్పడం కూడా సమంజసం కాదు.
ఆవిడ ఈ రచనల వల్ల ఆవిడ పరిచితమైన మనిషిగానే అనిపించేవారు. ఎందుకంత ఇలాంటివి అనుభవిస్తున్న వారి సంఖ్య ఎక్కువ. పురుషాధిపత్యం నిత్యా జీవితంలో ఎక్కువైపోవడం అనేది వాస్తవం. కానీ దానిని మనం సావిత్రిగారి లాగా ధైర్యంగా ఎదుర్కొని ఈ చరిత్రను తిరిగిరాయాలి.
అలా ఎదుర్కొని చివరి వరకు నిల్చిన వాళ్ళు జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లారు. ఏదైనా మన మనోబలం లోనే ఉంటుంది. విజయం ఐన పరాజయం ఐన. స్త్రీ పురుషులను సమంగా చూసే సమాజం సృష్టించడంలో ప్రతి ఒక్కరు తమ పాత్రను పోషించాల్సిందే.
Learn more :
1. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు
brainly.in/question/16302876
2. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి
brainly.in/question/16289469
Answer:
సావిత్రిగారి రచనలంటే ‘బందిపోట్లు’ కవిత గుర్తుకు వస్తుంది. ఆమె దాదాపు పాతిక కవితలు, అనేక వ్యాసాలు, సమీక్షలు రాశారు. అన్నీ సామాజిక సమస్యల మీదే రాశారు. 1984లో ‘బందిపోట్లు’ కవితను చేకూరి రామారావు గారు ‘చేరాత’లో సమీక్ష చేసి ప్రాచుర్యం కల్పించారు. అనేక సదస్సులలో సార్వత్రిక విశ్వవిద్యాలయం తెలుగు సిలబస్‌లో పాఠ్యాంశంగా చేర్చారు. ఇంగ్లీషులో కూడా అనువదించారు. అనువదించబడిన కవిత ‘బందిపోట్లు’ మార్చి 1984 అంధ్రజ్యోతి వారపత్రికలో అచ్చయింది.
Explanation
‘బందిపోట్లు’ కవితలో
‘పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్ళి చేస్తానని పంతులుగారన్నప్పుడు భయమేసింది
‘ఆఫీసులో నా మొగుడున్నాడు, అవసరమొచ్చినా సెలవు ఇవ్వడ’ని అన్నయ్య అన్నప్పుడే అనుమానం వేసింది.
‘వాడికేం మగమహారాజ’ని ఆడ, మగా వాగినప్పుడే అర్థం అయిపోయింది.
‘పెళ్ళంటే పెద్ద శిక్ష’ అని మొగుడంటే ‘స్వేచ్ఛా భక్షకుడ’ని
మేం పాలిచ్చి పెంచే, పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోందని.