India Languages, asked by yogeshmeda1981, 11 months ago

ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము పద్య లక్షణాలు వ్రాయండి​

Answers

Answered by kprasadsrada9515
96

above photos are answers

Attachments:
Answered by talasilavijaya
21

Explanation:

ఇచ్చిన వృత్త పద్యాలు ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము.

ఉత్పలమాల పద్య లక్షణాలు :

  • నాలుగు పాదాలుంటాయి.
  • ప్రతి పాదంలోనూ 20 అక్షరాలు, 28 మాత్రలు ఉంటాయి.
  • ప్రతి పాదంలోనూ భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలుంటాయి.
  • ప్రాస నియమం ఉంటుంది. ప్రాస యతి చెల్లదు.
  • ప్రతి పాదంలోని 10వ అక్షరం యతిస్థానం.

చంపకమాల పద్య లక్షణాలు :

  • నాలుగు పాదాలుంటాయి.
  • ప్రతి పాదంలోనూ 21 అక్షరాలుంటాయి.
  • ప్రతి పాదంలోనూ న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలుంటాయి.
  • ప్రాస నియమం ఉంటుంది. ప్రాస యతి చెల్లదు
  • ప్రతి పాదంలోని 11వ అక్షరం యతిస్థానం.

శార్దూలము పద్య లక్షణాలు :  

  • నాలుగు పాదాలుంటాయి.
  • ప్రతి పాదంలోనూ 19 అక్షరాలుంటాయి.
  • ప్రతి పాదంలోనూ మ, స, జ, స, త, త, గ అనే గణాలుంటాయి.
  • ప్రతి పాదంలో 13వ అక్షరం యతిస్థానం.
  • ప్రాస నియమం ఉంటుంది. ప్రాస యతి చెల్లదు

మత్తేభము పద్య లక్షణాలు :

  • నాలుగు పాదాలుంటాయి.
  • ప్రతి పాదంలోనూ 20 అక్షరాలుంటాయి.
  • ప్రతి పాదంలోనూ ‘స, భ, ర, న, మ, య, వ’ అనే గణాలుంటాయి.
  • ప్రతి పాదంలో 14వ అక్షరం యతిస్థానం.
  • ప్రాస నియమం ఉంటుంది, ప్రాస యతి చెల్లదు.
Similar questions