World Languages, asked by pavan8910, 9 months ago


చిన్న కుంటుంబం, పెద్ద కుటుంబం , ఉమ్మడి కుటుంబం వల్ల
కలిగే లాభనష్టాలు రాయండి?​

Answers

Answered by tennetiraj86
3

Explanation:

ఈ సమాజం కుటుంబాల సమూహము.

కుటుంబం తల్లి, తండ్రి, భార్య, భర్త, కూతురు ,కొడుకు ,కోడలు, అల్లుడు, మనుమలు, మనుమరాండ్రు వంటి బంధాల కలయిక.

కుటుంబం లో చిన్న కుటుంబం , పెద్ద కుటుంబం మరియు ఉమ్మడి కుటంబాలు గా ఉంటుంది.

చిన్న కుటుంబం :-

తల్లి , తండ్రి ఒకరు లేదా ఇద్దరు పిల్లలు కలిగి యున్న కుటుంబమే చిన్న కుటుంబం.

ప్రస్తుత సమాజంలో నేటి పరిస్థిలుకు అనుగుణం గా చాలా కుటుంబాలు ఈ చిన్న కుటుంబ వ్యవస్థను పట్టిస్తున్నాయి.

లాభాలు :-

  • చిన్న కుటుంబంలో ఉన్న వ్యక్తులకు కావలసిన వసతులను సమకూర్చుకోవచ్చును .
  • విద్య , ఆరోగ్యం మొదలైన విషయాల యందు ఇబ్బంది పడనవసరము లేదు.
  • ప్రభుత్వాలు ఇద్దరు ముద్దు అని లేక ఒకరు ముద్దు రెండు వద్దు అని పిల్లల కోసం అనేక రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నది.

నష్టాలు :-

  • చిన్న కుటుంబంలో ఆలనా పాలన చూడడానికి పెద్దవాళ్ళు మంచి విషయాలు చెప్పడానికి వీలు ఉండదు.
  • ప్రస్తుత సమాజంతో పరుగులు తీస్తున్న కాలంలో ఇవి మరుగున పడితున్నాయ్.
  • తల్లి తండ్రులు ఉద్యోగరీత్యా ఉన్నట్లయితే పిల్లల కు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి వీలు ఉండదు.
  • జీవితం పూర్తిగా యంత్రం (Mechanical) గా తయారు అవుతుంది.
  • వ్యక్తులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.

పెద్ద కుటుంబం :-

తల్లి తండ్రులు కు ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నట్లయితే దానిని పెద్ద కుటుంబం అంటారు.

లాభాలు :-

  • పూర్వం ఆచారాలు ప్రకారం సంతానం ఎక్కువగా ఉన్నట్లయితే వంశ వృద్ధి కలుగుతుందని అభిప్రాయం వలన సంతానాన్ని ఎక్కువగా చేసుకునే వారు.

నష్టాలు :-

  • కుటుంబ పాలన కష్టం అవుతుంది.
  • విద్య , వైద్య మొదలైన వాటిని చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది.
  • పిల్లల పోషణ కష్టం అవుతుంది.
  • అనారోగ్యా సమస్యలు తలెత్తుతాయి.
  • కుటుంబ పెద్ద కు ఏమైనా అయితే కుటుంబం ఆసరా లేకుండా ఇబ్బంది పడుతుంది.

ఉమ్మడి కుటుంబం :-

రెండు మూడు కుటుంబాలు కలిసి ఒకే కుటుంబం గా జీవించడాన్ని ఉమ్మడి కుటుంబం గా చెప్పవచ్చును.

లాభాలు :-

  • కుటుంబ పెద్ద కుటుంబ పోషణ చూస్తారు.ఇది కావాలన్న అతని లేదా ఆమె ద్వారానే జరుగుతుంది.
  • అందరి పై గురి ( భాద్యత ) ఉంటుంది.

నష్టాలు :-

  • తరాలు మారే కొద్దీ ఈ కుటుంబ వ్యవస్థ పట్ల అభిప్రాయం మారుతుంది.
  • కుటుంబము వివరాలు అన్ని తెలుసుకోవడం నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.
  • కొందరికి ఇష్టం ఉండకపోవచ్చు.

ముగింపు:-

  • భారత దేశం లో ఈ రకాలైన కుటుంబ వ్యవస్థలు అనాదిగా ఉన్నాయి.
  • ప్రపంచంలోనే భారతదేశం జనాభా పరంగా చైనా తరువాత రెండవ స్థానం లో ఉంది.
  • పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కావలసిన సదుపాయాలు లేకపోతే పేదరికం ,కరువు, నిరుద్యోగిత మొదలైన తీవ్ర సమస్యలు తలెత్తుతాయి.
  • వీటి కోసమే కుటుంబ నియంత్రణ వంటి కార్యక్రమాన్ని ప్రంపంచములో మొదటి సారిగా తీసుకొచ్చింది .

స్లోగన్స్:-

  • చిన్న కుటుంబం చింతలేని కుటుంబం
  • ఒకరు ముద్దు, ఇద్దరు వద్దు.
  • మనమిద్దరం , మనకు ఒకరు.
Similar questions