India Languages, asked by sai8045, 7 months ago


బాగా చదివేటట్లు మిమ్ములను ప్రేరేపించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాయండి.

Answers

Answered by shalini123451
12

Explanation:

బాగా చదివేటట్లు నన్ను ప్రేరేపించిన మా అక్కకు లేఖ :

తేదీ : 17 - 07 - 2020,

స్థానం : విజయవాడ.

ప్రియమైన అక్కకు ,

ప్రేమతో నీ చెల్లెలు రాయునది ఏమనగా , నేను బాగున్నాను. మీరందరు కూడా క్షేమంగానే ఉన్నారని ఆశిస్తున్నాము. నేను బాగా చదువుతున్నాను. మొన్ననే మా పరీక్షలు కూడా జరిగాయి. వాటి గురించి చర్చించడానికే మీరు ఈ ఉత్తరం రాస్తున్నాను.

అక్కా! ఈ నెల జరిగిన పరీక్షల ఫలితాలు నిన్న వెలువడ్డాయి. ఈ సరి మా తరగతి లో నేను ద్వితీయ శ్రేణిలో నిలుచున్నాను. మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మా ఉపాధ్యాయులు నన్ను ప్రశంసించారు. వీటి అన్నిటికి కారణం నువ్వు ఇచ్చిన ప్రేరణ నే అక్కా! ఇంతకుముందులాగా నేను ఈసారి పరీక్షా గదిలో భయపడలేదు. ప్రతి పాఠ్యము మొత్తం అర్థంచేసుకుని చదివాను. నన్ను నేను నమ్మాను. అందుకేనేమో, ప్రతిసారి ప్రశ్నపత్రం చూసి భయపడే నా కళ్ళు, ఈ సారి ఆనందంతో నవ్వాయి.

నువ్వు అన్నది నిజమే అక్కా. మనం ఏదైనా పూర్తి మనసుతో అనుకుంటే సాధించగలం. నా వరకు నువ్వే నా స్ఫూర్తి. నన్ను నమ్మి, నా ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటూ ప్రదిదానిని చక్కగా ఎదుర్కొని గెలిచే తత్వాన్ని నాలో నువ్వే నింపావు. నేను కూడా నీలానే ఉన్నత స్థాయికి రావడానికి కృషి చేస్తాను. నన్ను ఎప్పుడు ప్రేరేపిస్తూ ఉన్నందుకు కృతఙ్ఞతలు.

త్వరలోనే మాకు సెలవులు ప్రకటిస్తారు. ఇంటికి వచ్చి మిగతా విషయాలు చెప్తాను. అమ్మానాన్నలకు నా ప్రణామములు, తమ్ముడికి నా ఆశీర్వాదములు తెలియచేస్తావని ఆశిస్తున్నాను.

ఇట్లు,

ని ప్రియమైన చెల్లెలు,

బి. సరోజినీ.

చిరునామా :

బి. అఖిల,

బి. మధుసూదన్,

డోర్ నెంబర్ : 15-బి,

ఎం. ఆర్. పేట్,

ఏలూరు,

పశ్చిమ గోదావరి జిల్లా.

Similar questions