India Languages, asked by battuabhinavabhinav, 9 months ago

వివిధ పండుగల సందర్భంలో వివిధ మతాలు వారు చేసే పద్ధతులు. వారు చేసే దాన ధర్మాలు పట్టికలొ రాయండి​

Answers

Answered by ashauthiras
6

Answer:

భారత దేశములో ప్రధాన మతాలు  : మతం అంటే ఏమిటో వివరించవచ్చు గాని నిర్వచించటం సాద్యంకాదు. సృష్టిలో సహస సిద్దంగా జీవజాతులెలా పుట్టుకొచ్చాయో అదే విధంగా మతంకూడ తొలినాళ్ళలో మానవ సమాజంలో సహజంగా పుట్టుకొచ్చినదనే భావించ వలసి వస్తుంది. ఆది మానవుడు ప్రకృతి శక్తులను ఆరాధించే విధానమునుండి మతం పుట్టుకొచ్చి వుండవచ్చు. వివిధ ప్రాంతాలలో వివిధ ప్రకృతి శక్తుల ఆరాధనా పద్ధతులలోనుండి పుట్టినదే మతం. ఎలాగంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి శక్తులు ఒకే విధంగా వుంటాయి. అదే విధంగా అన్ని మతాల మూల సూత్రము ఒకటే. అందుకే మతాలలో ఇన్ని విధాలున్నాయి.

మతం అనగానే వెంటనే మనకు గుర్తుకు వచ్చేవి దేవుడు.. గుడి - గోపురం, పూజ - పూజారి, పవిత్ర గ్రంథం.ప్రార్థనా స్థలాలు, కొన్ని కట్టు బాట్లు మొదలగునవి.. మరి ఇవన్నీ గూడ అన్ని మతాలకు ఒక్కలాగ లేకుండా భిన్నంగా వుంటాయి.. అలాగే వివిధ మతాలకు వాటి వాటి సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ సిద్ధాంతాలు మానవునిలో ఎంత బలంగా నాటుకున్నాయంటే...... మత సిద్ధాంతాలను ఎదిరిస్తే సమాజం రక్త సిక్తం అవుతుంది. అందుకే వాటి జోలికెవరూ దురుసుగ వెళ్ళరు. మత రహిత మని చెప్పుకునే సమాజంలో మతము లేదని కాదు. ఎవరి మతాలను వారు గౌరవించు కోవచ్చుననేది మూల సూత్రం. ఒక మతం గొప్పది.... మరొక మతం తక్కువ అనే పోలిక వుండదు. ఎవరి మతం వారికి గొప్ప. అయినా కొందరు మత ప్రబోధకులు తమ మతమే గొప్పదని ప్రచారం చేస్తూ తమ మతంలో చేరండంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు..... కొంతవరకు వారు సఫలీ కృతులౌతున్నారు కూడ. గతంలో బలవంతపు మత మార్పిడులు జరిగిన దాఖలాలు లేక పోలేదు. నయానో, భయానో, వ్వక్తిగత అభిరుచి తోనో ఒక మతం నుండి మరో మతంలోనికి సులభంగా మారిపోగలిగితే ఈ భారత దేశము ఏనాడో హిందూయేతర మత ప్రాధాన్యత గల దేశంగా మారి పోయి వుండేది. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క మతం ఎంతో అభివృద్ధి సాందించి నట్లు మనకు ఆధారాలున్నా. ఒకప్పుడు బౌద్ధ మతం ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందింది. అదే వురవడి కొనసాగించి వుంటే ఈ నాడు ప్రపంచ మంతా బౌద్ధమత మయమై వుండేది. కాని అలా కాలేదే?

వైవిధ్యభరితమైన దేశంగా, ఉపఖండంగా పేరొందిన భారతదేశంలో హిందూమతం, ఇస్లాం, క్రిస్టియానిటీ, సిక్కుమతం, బౌద్ధమతం, జైనమతం వంటివి భారతదేశంలోని ప్రధాన మతాలు.

Explanation:

Similar questions