మీ పాఠశాలకు క్రికెట్ క్రీడాకారుడు
వచ్చారును కోండి. ఆయనకు
ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళి
తయారుచేయడం
Answers
నమస్కారం .
మొదట ఎవరైనా, వారి బాగోగులు గురించి అడుగుతాము . అందుకని వాటిని తొలగించి, కేవలం ప్రశ్నలను తయారుచేద్దాము.
౧. మంచి స్థాయిలో వున్నారు...., ముందు ముందు ఏం చేయాలని అనుకొంటున్నారు ???
౨. వారిని ఇంత గొప్ప స్థాయిలో మనం చూడగలగటానికి, వెనుక ఉన్న - కథ, కృషి, మనుషుల గురించి ప్రశ్నిస్తాము.
౩. క్రికెట్ ఆట లోని వారి గెలుపోటములు గురించి, నైపుణ్యం గురించి అడుగుతాము .
౪. క్రికెట్టు పై వారి అభిప్రాయం గురించి కూడా అడుగుతాము .
౫. సరదాగా సాగడానికి, వారి కుటుంబం గూర్చి, ఇంట్లోని సరదాల గూర్చి, పెళ్లి కాకపోతే - పెళ్లి విషయం (వ్యక్తిగత మైన విషయం అనే చెప్పాలి )
౬. అలవాట్లు, రుచులు, ఇష్టాల గురించి....... .
అన్నీ ప్రశ్నలు పూర్తయిన తరువాత పిల్లలకు వారి సందేశాన్ని ఇవ్వమని ప్రాధేయపడి, ఆ సమావేశాన్ని ముగిస్తాము .
వారు, తిరిగి ప్రయణమయ్యే ముందు వారి ఆశీర్వాదం కూడా తీసుకొంటాము .
మీ ప్రశ్న వలె, మా విద్యాలయానికి ఒకసారి, పి . వి . సింధు వారి తల్లిదండ్రులు వచ్చారు. ఆ అనుభవంతో జవాబు ఇచ్చాను .