వలస కూలీలు పెరగకుండా వుండలనంటే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలి
Answers
Answer:
ఎక్కువ డబ్బులు ప్రజలకు ఇవ్వాలి
Explanation:
లేదా అన్ని ఫ్రీ గా ఇవ్వాలి
Answer:
లాక్‌డౌన్‌తో తమ స్వస్థలాలకు నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలు, సైకిళ్ల మీద వెళ్తున్న కూలీలు, రైళ్లు ఎక్కటానికి గుంపుగా రైల్వే స్టేషన్లకు చేరుకున్న కూలీలు ‘కాస్త అసహనం’గా ఉన్నారని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యానించారు.
ఆయన శనివారం బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఆ కూలీలు వేచివుండాల్సింది’’ అని అభిప్రాయపడ్డారు.
దేశంలో తొలి విడత లాక్‌డౌన్ ప్రణాళికను రూపొందిస్తున్నపుడు.. వలస కూలీల సంక్షోభాన్ని ప్రభుత్వం ముందుగా అంచనా వేసిందా? రాగల పర్యవసానాలపై చర్చించిందా? అని ప్రశ్నించగా.. కేంద్ర మంత్రి స్పందిస్తూ ‘‘జనం మెరుగైన ఆర్థిక అవకాశాల కోసం ఒక చోటు నుంచి మరొక చోటుకు వలస పోతుంటారని ప్రభుత్వానికి ఎల్లప్పుడూ తెలుసు. పూర్తి సమాచారం ఉంది. లాక్‌డౌన్ పరిస్థితుల్లో జనం అభద్రతలో ఉన్నట్లు భావించటం చాలా సహజం. జనం ఇంటికి వెళ్లాలనుకోవటమూ సహజం. అదే జరిగింది’’ అని చెప్పారు.
కానీ ఇంత భారీ సంఖ్యలో జనం వలస పోతుండటం, పోయిన ప్రాణాల సంఖ్య, కనిపించిన దయనీయ పరిస్థితులు.. ప్రణాళికా లోపాన్ని, అమలు చేయడంలో లోపాన్ని ఎత్తి చూపడం లేదా?
ఇంటికి వెళ్లటానికి ప్రయత్నిస్తున్న వలస కార్మికుల్లో మే 26వ తేదీ నాటికి కనీసం 224 మంది చనిపోయారని బీబీసీ నిర్ధారించుకోగలిగింది.
‘‘క్లిష్ట సమయాల్లో అందరూ సమస్యలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ జనం సహకరించారు. లాక్‌డౌన్‌కు సంబంధించి కానీ, ఆరోగ్య విషయాలకు సంబంధించి కానీ మార్గదర్శకాలను పాటించారు. నడుచుకుంటూ వెళుతున్నపుడు, రైలు పట్టాల మీద ప్రాణాలు పోవటం నిజంగా దురదృష్టకరం. అయితే.. ప్రతి వ్యక్తీ చాలా తొందరగా ఇళ్లకు చేరుకోవాలని అనుకుంటారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరముంది. ఇప్పుడు ఒక చోటుకు వెళ్లటానికి ఒక రైలు అందుబాటులో ఉంది. కానీ.. పది చోట్ల నుంచి జనం పోగవుతారు. కాబట్టి తర్వాతి రైలు వచ్చే వరకూ జనం వేచి ఉండకతప్పదు. కొన్నిచోట్ల మన కార్మిక సోదరులు కొంత అసహనంగా ఉన్నారు. అందుకే వేచివుండకుండా కొందరు సైకిళ్ల మీద, కొందరు నడుచుకుంటూ బయలుదేరారు. కష్టాలు అందరూ ఎదుర్కొన్నారు. చివరికి ఇళ్లలో ఉన్న వాళ్లు కూడా.’’