త్యాగం చేయటంలో ఉన్న గొప్పతనాన్ని అనుభూతిని వివరించండి
Answers
త్యాగమనేది ఒక గొప్ప శక్తి. ఈ శక్తి కలిగినవారు ఎంతో గొప్పవారవుతారు. చాలామంది త్యాగం చేయటం ఒక పిరికితనంగా భావిస్తారు. సహనాన్ని కూడా పిరికితనమనుకొని తమను తాము వంచన చేసుకుంటారు. త్యాగంతో పాటు సహనం కూడా ఎంతో గొప్ప శక్తి, త్యాగమంటే వస్తు వైభవాలు వ్యక్తులు, పరిస్థితులపైన మన అధికారాన్ని వదిలిపెట్టడం. ఎన్నోసార్లు ఈ అధికారాన్ని వదిలిపెడతాం కానీ ఇష్టంతో సంతోషంతో ఇతరుల సుఖాన్నాశించి సమాజ శ్రేయస్సు కోసం చేస్తే అది సత్వ గుణమనబడుతుంది భయం, స్వార్థం, మొండితనాలతో బలవంతంగా చేసిన త్యాగం రజోగుణం, తమోగుణాలతో కూడిన త్యాగమనబడుతుంది.
కొన్నిసార్లు వ్యక్తి మొండితనంగా త్యాగం చేస్తాడు.
నిజానికి త్యాగమనేది ఎంతో లోతైనది విలువైనది. ఒకసారి త్యజించిన వస్తువు గురించి మనసులో ఆలోచన కూడా రాకపోవడమే త్యాగానికి సరైన అర్థం. అంటే త్యాగాన్ని కూడా త్యాగమే ఆధారం. మోహాలోభాలలో దేనికైనా కష్టమనేమీ ఉండదు. ఎందుకంటే దీని ఆధారంతో భాగమే. అప్పుడే మనకు సత్యమైన శాంతి త్యజించాలి. ఒకవేళ ఎవరికైనా త్యాగం చేసి నేనేమైనా తక్కువగా త్యాగం చేశానా ఏమిటి అనే సంకల్పమొచ్చినా కూడా చేసిన త్యాగానికి ఫలితముండదు. నిజమైన సుఖాన్ని పొందాలంటే లోబడి ఉన్నవారు మనస్ఫూర్తిగా త్యాగం చేయడం వారి భాగ్యానికి నిదర్శనం. ఇందులో ఆత్మకు అసలైన సుఖం లభిస్తుంది. విషయ వికారాలను, చెడు అలవాట్లను, వస్తు వైభవాలు సంబంధాలను మనసావాచాకర్మణా త్యాగం చేయడమనేది సత్యమైన త్యాగంలో అనుభవమవుతుంది. కోరికలను త్యజించిన వారే శ్రేష్ఠాత్మలనబడతారు త్యాగం చాలా గొప్ప శక్తి కావటం వల్ల వ్యక్తి ఎంతో శక్తివంతుడవటమే గాక ఎందరో ఆత్మలకు ప్రేరణ నిచ్చినవాడవుతాడు.