వలసకూలి గురించి కవి ఆవేదనను మీ సొంతమాటల్లో రాయండి.
Answers
Answer:
అలా పని కోసం నగరాలకు వసల వచ్చిన వారు భవన నిర్మాణ కార్మికులుగా, పారిశుద్ధ్య కార్మికులుగా, హోటర్ కార్మికులుగా, మెకానిక్‌లుగా, షాపు కార్మికులుగా, తోపుడు బండ్లపై, ప్లాట్‌ఫామ్‌లపై చిరువ్యాపారస్తులుగా, హమాలీలుగా, రవాణా కార్మికులుగా, ఇండ్లలో పనిచేసేవారిగా, సెక్యూరిటీ గార్డులుగా చెత్త ఏరుకుని అమ్మి కొత్త సరుకు ఉత్పత్తికి తోడ్పాటునిస్తూ దుర్గంధ కాలుష్య కోరల్లో చిక్కుకుని సామాన్య మానవుడి అవసరాలుతీర్చే వాళ్ళుగా మారారు. వీరిలో ఎంతో మంది కుటుంబం గడవడం కోసం తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారు.
చట్టం వచ్చినా...
ఎలాంటి అభివృద్ధికీ నోచుకోని ఇలాంటి అసంఘటిత కార్మికులు వేలల్లో ఉన్నారు. కాని ఈ కార్మికుల గురించి మన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. వీరిలో ఏ ఒక్కరికీ పనిగ్యారెంటీ కల్పించడం లేదు. వీరి సంక్షేమం కోసం వామపక్ష పార్టీలు పోరాడితే అసంఘటిత కార్మిక చట్టం 1996లో దేవేంద్రగౌడ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆయా రాష్ట్రాల పరిస్థితులకనుగుణంగా ఈ చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్రాలకు అప్పజెప్పింది.
పట్టించుకునే వారు లేరు
కార్మికులకు పనిగ్యారెంటీ. అసంఘటిత కార్మికులకు కనీసవేతనం ఇవ్వాలి. ఈ కార్మికులకు ప్రభుత్వమే ఇండ్లు నిర్మించాలి. కార్మిక గుర్తింపుకార్డులు ఇవ్వాలి. ఇ.ఎస్.ఐ, పి.ఎఫ్ సౌకర్యం కల్పించాలి. 60 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలి. 34 రకాల పనులుచేసే అసంఘటిత రంగాలకు విడివిడిగా సంక్షేమబోర్డులు ఏర్పాటు చేయాలి. ఇలా చట్టంలో ఎన్నో విషయాలు పొందుపర్చారు. మన పక్కన ఉన్న తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో ఇందులోని కొన్ని అమలవుతున్నాయి. అలాగే కేరళ, త్రిపురలో 34 రంగాలకు విడి విడిగా బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. 60 సంవత్సరాలు దాటిన వారికి వెయ్యి రూపాయలు పెన్షన్ కూడా ఇస్తున్నారు. కాని తెలుగు రాష్ట్రాల్లో ఈ చట్టం గురించి, అసంఘటిత కార్మికుల గురించి పట్టించుకునే నాథుడులేడు.
చేతులు దులుపుకున్నారు
సీఐటీయు లాంటి కార్మిక సంఘం ఇతర కార్మిక సంఘాలతో కలిసి అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఉద్యమించారు. కార్మికుల ఉద్యమాలకు తట్టుకోలేని ప్రభుత్వం 34 రంగాలకు కలిపి ఒకటే బోర్డు ఏర్పాటు చేసింది. వాటిలో కేవలం భవననిర్మాణ కార్మికులకు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ఆర్ ప్రభుత్వం స్కాలాబన్ పేరుతో కొన్ని సౌకర్యాలు కల్పించారు. అందులో కార్మికులకు గుర్తింపు కార్డులు ఇచ్చారు. ప్రమాదం జరిగి చనిపోతే 5 లక్షల 20 వేలు, కాలు, చేతులు విరిగితే లక్షా 50 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. కాని ఐదు వేల రూపాయాలు స్వాలంబన పథకం కింద డిపాజిట్ చేసి పేరు నమోదు చేసుకుంటే తప్ప వయసుపైబడ్డ వారికి పెన్షన్లు ఇవ్వలేమని చేతులు దులుపుకున్నారు.
చాలీ చాలని జీతంతో బతుకులు
అసంఘటిత కార్మికులు నగరాలపై ఆధారపడ్డ తర్వాత భార్యా భర్తలిద్దరూ పని చేయాలి. చాలీ చాలని జీతంతో బతుకు గడపాలి. కాని వారి పిల్లల భవిష్యత్ కోసం ఎన్నో అగచాట్లు పడాల్సి వస్తుంది. చాలామంది తమ పిల్లల్ని చదివించలేక మధ్యలోనే చదువు ఆపేసి పనుల్లో పెడుతున్నారు. దాంతో మంచి చదువులు చదువుకొని ఉద్యోగాలు చేయాల్సిన యువత కార్మికులుగా మిగిలిపోయి కష్టం చేసి బతుకుతున్నారు.
వేధింపులు
రవాణా కార్మికులు, ప్లాట్ ఫామ్ వ్యాపారం, భవన నిర్మాణ కార్మికులు రోడ్డుపైనే గడపాలి. ఎక్కడ తినే అవకాశం ఉంటే అక్కడే తినాలి. చీకటి పడేవరకు శ్రమించాలి. దాంతో సంపాదన ఉన్నా, లేకున్నా కొంత పోలీసులకు ముట్ట జెప్పక తప్పదు. రోడ్డుపై ట్రాఫిక్ అవుతుందని పోలీసులతోపాటు పెద్ద వ్యాపారుల వేధింపులు తప్పవు. ఇలాంటి వేధింపుల నుండి తమకు రక్షణ కల్పించమని కార్మిక శాఖా అధికారుల ముందు ఎన్ని సార్లు మొరపెట్టుకున్న చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు వ్యవహరిస్తున్నారు.
కనీస సౌకర్యాలు లేవు
లేబర్ అడ్డాలపై మహిళలకు టాయిలెట్స్, వేచి ఉండటానికి షెడ్డులు, మంచినీరు, వంటి కనీస సౌకర్యాలు కల్పించాలి. ప్రతి అడ్డా వద్ద ఐదు రూపాయాల భోజన సౌకర్యం కల్పించాలి. 34 రకాల కార్మిక సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలి. బోర్డు కమిటీలలో ఐ.ఎ.ఎస్ అధికారి, ఇద్దరు ప్రజా ప్రతినిధులు, వివిధ కార్మిక సంఘాలనుంచి ప్రతి నిధులు ఉండేటట్లు నిర్ణయించాలి. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి సరిపోయే నిధులు కేటాయించి సక్రమంగా ఖర్చు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
సంఖ్య పెరిగిపోతున్నది.
ఎన్నో గ్రామాల నుండి కూలి పనుల కోసం నగరానికి వలస వస్తున్నారు. తెల్లవారు జామున అడ్డాలపై నిలబడి పని కోసం ఎదురు చూడాలి. రోజు రోజుకు అడ్డాలపై పని కోసం ఎదురు చూసే వారి సంఖ్య పెరిగిపోతున్నది. దాంతో అందరికీ పని దొరకడం లేదు. పని దొరికిన రోజు కుటుంబం కడుపు నిండా తింటుంది. మిగిలిన రోజుల్లో చాలీ చాలని తిండితో బతకాల్సిందే. ఇలాంటి కార్మికుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ కార్మికులకు చేతినిండా పని కల్పిస్తే హాయిగా బతకగలుగుతారు.
ప్రభుత్వానికి పట్టదా?
తెల్లవారు జామున లేవాలి. అడ్డాపై వచ్చి నిలబడాలి. పని ఉన్న రోజు చేసుకోవాలి. లేకపోతే ఉసూరుమంటూ వెనక్కుపోవాలి. చాలా కుటుంబాల్లో భార్యా, భర్తలు ఇదే పనిపై ఆధారపడి బతుకుతున్నారు. కాంట్రాక్టర్లు కూలీలకు వారికి ఇష్టమొచ్చినంత కూలి ఇస్తారు. గట్టిగా మట్లాడితే అసలు పనే లేదు పొమ్మంటారు. దాంతో కార్మికులు వారి సమస్యలపై నోరువిప్పలేకపోతున్నారు. చాలామందికి గుర్తింపు కార్డులు లేవు. వేల సంఖ్యలో ఉన్న ఇలాంటి అసంఘటిత కార్మికుల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదు.
సౌకర్యాలు కరువు
పనిలోకి వెళ్ళినపుడు ఎంతో మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. చాలామంది కాళ్ళూ చేతులు విరగొట్టుకుంటున్నారు. అయినా వీరి ఆరోగ్యం గురించి పట్టించుకునేవారు లేరు. భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు సరైన చదువులేదు. చాలామంది తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక, కుటుంబం గడవక పిల్లల్ని మధ్యలోనే చదువు మాన్పించి పనులోకి తీసుకెళ్ళవల్సి వస్తుంది. నిత్యం సిమెంట్ పని చేసి చేసి చేతులు బొబ్బలు ఎక్కుతాయి. కాళ్ళు రాళ్ళలా తయారవుతాయి. అయినా వీరికి ఇఎస్‌ఐ లాంటి సౌకర్యమే లేదు.
వలసకులికి పర్యాయపదంగా మారిన పాలమూరు కష్టజీవుల శ్రమజీవానికి అద్దం పట్టే ఈ గేయంలో ముకురాల రామారెడ్డి ఒక జాలరి జీవితాన్ని కనులకు గిట్టినట్లు చిత్రించారు.
పని ఎక్కువా దొరుకుతుందనీ పైసలు ఎక్కువ వస్తాయని ఇక్కడి ఆనుభూతులను, ఊరిలో అనుభందాన్ని, కుటుంబం నుండి లభించే మమతానురాగాలను వదులుకొని కోస్తదేశంలో చేపలు పట్టే పనికోసం పోయిన ఆజలరిని గురించీ భార్యాపిల్లలను యాధిచేసుకోవటం ఎంత బాధగా వుంటుందో తెలుస్తుంది.వానలు లేక పంటలెండిపోయాయ్. పశువులకు మెతలు కరువయ్యాయి. నేల నెర్రెలు వారింది.
చెరువులకు సరిపడా నీళ్లు రాలేదు. కొడిమేలు, గాలలు విడిచిపెట్టి కుక్క కులికి ఆశపడి నైలానువాలు మాత్రమే ధిసుకొని కోస్తదేశం పోయిన ఆ జాలరి కోసం అంత ఎదురు చూస్తున్నారు. వస్తానన్న మద్ధతు ఎప్పుడో దాటిపోయింది.
అక్కడ చేపల రుచి మరిగి రాకుండా ఉండిపోయాడా? గోదావరి వరదలు చల మండి చనిపోయారు అన్న వార్తా అపశకునాని కలగజేస్తుంటే, గుబులు గుబులుగా, ధిగులు ధిలుగుగా అతని కోసం ఎదురుగా ఉంటున్నారు అందరు.