అందరికీ చదువు అవసరం అని తెలుసుకున్నారు కదా! అయినప్పటికీ ఇంకా మన సమాజంలో
కొంతమంది పిల్లలు చదువుకోవడం లేదు. దీనివల్ల వాళ్ళు ఏమేమి కోల్పోతున్నారు? వాళ్ళు కూడా
చదువుకోవాలంటే మనమేం చేయాలి?
Answers
1.చదువు జీవితాల నే మార్చేస్తుంది.
2.మన ఆర్ధిక పరిస్థితిని మార్చేస్తుంది.
3.మన పై మనకి నమ్మకాన్ని కలిగిస్తుంది.
4.ముఖ్యం గా మన మాట తీరు,నడవడిక,వేష ధారణ మార్చేస్తుంది.
5.గొప్ప,గొప్ప వాళ్ళు రాసిన పుస్తకాల చదడానికి ఉపయోగపడుతుంది.
6.మనకు పట్టుదల, ఆత్మ విశ్వాసం కలిగేలా చేస్తుంది.
7.మన పిల్లల పెంపకంలో సరైన నిర్ణయం తీసుకోడానికి ఉపయోగపడుతుంది.
8.మన ఉరికి వచ్చే ఎర్ర బస్సు పై రాసిన వూరి పేరు ఎవరిని అడగకుండా తెలుసుకోవచ్చు కదా!
9.ముఖ్యం గా మన ఉపాధి ని మనమే చేసుకొనే లా చదువు తోడు ఉంటుంది.
10.ఇవి అన్ని చదువు లేని వాళ్ళు కూడా చేస్తారు.అవి చేస్తున్నారు అంటే వాళ్ళ కి దేవుని అనుగ్రహం ఉంది అని నా నమ్మకం.
11.చదువుకోవడం వల్లే కదా యంత్రము అభివృద్ధి తెలిసింది.
12.సామాన్య శాస్త్రం(సైన్స్) తెలుసుకోగలిగాము.మన నాగరికత కి అదే గా మూలం.
13.చరిత్ర ని చదివి మనకు పూర్వం ఎం జరిగిందో తెలుసుకుంటున్నాం.
"చదువు మూడో నేత్రం అంటారు పెద్దలు"
"విద్య లేని వాడు వింత పశువు" అన్నారు ఎవరో పెద్ద వాళ్ళు.
చదువు వల్ల మనో వికాసం పెరుగుతుంది.
ఉపయోగాలు గురించి తెలుసుకోవాలి అంటే,ఎర్ర బస్ ఓక ట్రిప్ తిరిగే ఊళ్లు మన దేశం లో చాలా ఉన్నాయి.రండి వచ్చి అక్కడ బ్రతికే అవ్వ నో,తాత నో అడిగితే వాళ్ళ మనకి కళ్ళకి కట్టినట్టు చెప్తారు.
పిల్లలు చదువుకోవకపోతే సమాజం ఎంతో మంది మహానుభావులను కోల్పోతుంది.
మనం చెయ్యగలిగినది మధ్యవర్తిత్వం ఒక్కటే. మన దగ్గర ధనములేదు. కానీ అవసరం ఎక్కడ ఉందో నేను సూచించ గలను. ఎవరైనా స్పందించి సహాయపడితే ఆపిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది కదా అన్నదే నాతపన.